గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, డిసెంబర్ 2012, గురువారం

ప్రపంచ తెలుగు మహా సభలలో మీ భాగస్వామ్యం ఉంటే తెలియజేయండి

జై శ్రీరామ్.
సహృదయ పాఠక సోదరీ సోదరులారా! 
నిత్య లోక కల్యాణకర చిత్త వృత్తిచే మహనీయులైన మీకు నా అభినందనలు.
ప్రపంచ తెలుగు మహా సభలు తిరుపతిలో ఈ నెల 27 -28 -29 తేదీలలో జరుగబోతున్నాయి. మీలో అనేకమంది ఈ సభలలో పాల్గొనుచూ ఉండ వచ్చును. విషయ పరిగ్రహణ దృష్టితో కొందరు , ఆ కార్యక్రమాలలో భాగస్వాములై కొందరు వెళ్ళుతూ ఉండ వచ్చును. మీలో ఎవరెవరు అక్కడకు భాగస్వాములై వెళ్ళుతున్నారో తెలిస్తే అభిమానులనేకమంది చూడటానికి తప్పక వస్తారు. కావున 
ఆ కార్య క్రమాలలో మీరు భాగస్వాములైయుంటే 
తప్పక మీ వ్యాఖ్యానం ద్వారా తెలియ జేయ గలరని మనవి చేస్తున్నాను.
శుభమస్తు.
జైహింద్. 
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
పాల్గొన గలిగిన అదృష్ట వంతు లందరికీ హృదయ పూర్వక శుభాభి నందనలు . కార్య క్రమా నంతరం విసిష్టతను వివరించ గలిగితే చదివి ఆనందించ గలగడమే అదృష్టంగా తృప్తి పడగలం. అందుకు ఎదురు చూస్తూ ! ధన్య వాదములతో .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.