గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

11, డిసెంబర్ 2012, మంగళవారం

ఆశావాది అవధాన వినోదం- సరస ప్రసంగం.1 వ భాగము

జైశ్రీరామ్.
గండ పెండేర సత్కార గ్రహీత డా. ఆశావాది ప్రకాశ రావు.
వీరి సెల్ నెంబర్.7386964476.
సాహితీ ప్రియబాంధవులారా!
అవధానాచార్య డా. ఆశావాది ప్రకాశ రావుకవిశిరోమణిని గూర్చి తెలియని వారుండరు.
అటువంటి అవధాని గారు చేసిన అవధానాలలో  అప్రస్తుత ప్రసంగములో చేసిన సరస ప్రసంగాలు మీ ముందుంచుతున్నందుకు ఆనందంగా ఉంది. పృచ్ఛకుని ప్రశ్న దానికి అవధానిగారి చతురోక్తి మీ ముందుంచుతున్నాను.
ఇక చూడండి.
 1. పృచ్ఛకుఁడు: వీళ్ళంతా కాలేజీ పిల్లలే అంటారా?
     అవధాని:  అనుమానమెందుకు? కాల్ యేజ్ పిల్లలే.అంటే పిలిచే వయస్సులోనున్నవాళ్ళు 
     ముందు కాలే జీవన గతి కలవాళ్ళు.
 2. పృచ్ఛ:-మీరు నియోగులా?
     అవ:- అవును. అవధానంలో నియోగింపఁబడుతూ ఉంటాను. కాబట్టి నియోగినే.
 3. పృచ్ఛ:-మీకు చలికాలం ఎట్లా ఉంటుంది?
     అవ:- నాకు - చలికి ఆలం (పోరాటం)వెచ్చగానే ఉంటుంది.
 4. పృచ్ఛ:-మీకు కనకాభిషేకం చేయాలని ఉంది అంగీకరిస్తారా?
     అవ:-  అంగీకరించ లేను. ఎందుకంటే కష్టమ్స్ వెంట పడ్డట్లే. అంటే కష్టమ్స్ అధికారులు, 
     ఆతరువాత కాపాడుకోడానికి పడే కష్టాలు.
 5. పృచ్ఛ:- ఇంటర్వల్ కు బయటకు వెళ్ళిన పిల్లలు ఏమి చేసుకొని వస్తారు?
     అవ:- అబ్బాయిలైతే గంట. అమ్మాయిలైతే మైదానం.
 6. పృచ్ఛ:-పాడువారు ఆడువారిలోగల ఆకర్షణ స్థానాలు దెబ్బ తీసే వైనాలు  చెప్పండి?
     అవ:- పాడువారిలో ‘పాడు’ తనం  ఆడువారిలో ‘ఆడు’ తనం.
 7. పృచ్ఛ:-వచ్చిన చోటుకుమళ్ళీ పోవటం, పోయిన చోటుకు మళ్ళీ రావటం వీలు కాదు. 
     ఆచోటులేవి?
     అవ:- వచ్చిన చోటునుండి మళ్ళీ పోవటానికి వీలు లేనిది తల్లు గర్భం. పోయిన 
     చోటునుండిమళ్ళీ రావటానికి వీలు లేనిది పుడమితల్లి గర్భం.
 8. పృచ్ఛ:-వారి తండ్రి పాలు వారికి నొసగి, నీదు పాలు సుతులకెల్ల పంచి యిమ్ము అంటాడు 
     విదురుడు దృతరాష్ట్రునితో. పాలు పురుషులకు కూడా ఉంటాయా?
     అవ:-ఇక్కడ పాలు ఇవ్వటానికి ఆ కౌరవ పాండవులు ఒడిలో బిడ్డలు కాదయా. రాజ్యం ఏల 
     దగిన వాళ్ళు. కాబట్టి పాలు అనగా భూభాగం. 
 9. పృచ్ఛ:-చ్సంతకం ఏ విధంగా ఉంటే బాగుంటుందండి?
     అవ:- సిగ్గు నేచర్ లాగుంటే బాగుంటుందండి. అంటే సంతకం సంతకం కోసం చేసినట్లు కాక 
     ప్రకృతిలో  ఒయ్యారాలు ఒలకబోసేలాఉండాలని నా ఉద్దేశ్యము.
10.పృచ్ఛ:-ఉప కారాగారం ఏ సంధండి?
     అవ:- ఇక్కడ సంధి లేదు. ఉన్నది సమాసమే. అది ఉఅ కారాగారమే. 
     ఉపకార+ఆగారము కాదు..
సశేషం.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.