గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

5, ఆగస్టు 2024, సోమవారం

లక్ష్మీసహస్రం. 2వ శ్లోకం. 7 - 12. పద్య రచన చింతా రామకృష్ణారావు. పద్య గానం శ్రీమతి సుశీలాదేవి భాగవతారిణి.

0 comments

 లైశ్రీరామ్.

॥ శ్రీలక్ష్మీసహస్రనామావలిః ॥

శ్రీ లక్ష్మీ సహస్ర నామాంచిత పద్యసహస్ర దళపద్మము.

రచన.   చింతా రామకృష్ణారావు.

గానం శ్రీమతి సుశీలాదేవి భాగవతారిణి.

॥ శ్రీలక్ష్మీసహస్రనామావలిః ॥

శ్లో.  మహాలక్ష్మీర్మహాకాలీ మహాకన్యా సరస్వతీ ।

భోగవైభవసంధాత్రీ భక్తానుగ్రహకారిణీ ॥ 2 ॥

7. ఓం *మహాలక్ష్మ్యై* నమః ।

నామ వివరణ.

గొప్ప లక్ష్మీదేవి మన అమ్మ. అందరికీ జీవనాధారమయిన తల్లి మన

మహాలక్ష్మితల్లి.

తే.గీ.  నుత *మహాలక్ష్మి!* నినుఁ గొల్చు బ్రతుకు బ్రతుకు.

క్షితిజ మానవ జాతికి బ్రతుకు నీవె,

నీవు లేకున్న బ్రతుకులే లేవు జనని,

నీదు కృపజూపి భక్తుల నాదుకొనుము.

8. ఓం *మహాకాల్యై* నమః ।

నామ వివరణ.

మిక్కిలి శక్తిస్వరూపిణి అయిన కాలీ స్వరూపము మన తల్లి.  మిక్కిలి నల్లగా

ఉండు తల్లి ఈ జనని.

తే.గీ.  శ్రీ *మహాకాలి!* నిలుము నా చిత్తమందు,

నా గృహంబున నీవుండి నన్ను గనుచు

నైహికంబును బరము నాకందఁ జేసి

నన్ను గాపాడుమమ్మరో సన్నుతముగ.

9. ఓం *మహాకన్యా*యై నమః ।

నామ వివరణ.

మన అమ్మ లక్ష్మీమాత గొప్ప కన్యక. కన్యకలయందు ప్రకాశించు మహాకన్యక

మన అమ్మ.

తే.గీ.  కన మహాకన్య వీవమ్మ కల్పవల్లి!

కొలిచెదన్ *మహా కన్య!* నిన్ గొప్పగాను,

కన్యకామణులందునఁ గలిగి నీవు

వినుత లక్ష్మీప్రదమ్ముగా వెలుగుదువుగ.

10. ఓం *సరస్వత్త్యై* నమః

నామ వివరణ.

మన అమ్మయగు లక్ష్మీ మాతయే సరస్వతీ స్వరూపము.

తే.గీ.  ఓ *సరస్వతీ!* నీకృపనొప్పిదముగ

జీవితము సాగుచుండును సేవిత పద!

హంసవాహినివగుచు నీవమరియుండి

చిత్తమునవెల్గు చుందువే చిన్మయముగ.

11. ఓం *భోగవైభవసంధాత్ర్యై* నమః ।

నామ వివరణ.

భోగమును వైభవములను మనకు ప్రసాదించుజనని లక్ష్మీమాత.

తే.గీ.  *భోగవైభవ సన్ధాత్రి!* పూజలంది

భోగవైభవములనిమ్ము పూజ్యముగను,

యోగమును గొల్ప ముక్తికై, యోగ్యులకును,

నిన్ను సేవించు యోగమే నిరుపమమిల.

12. ఓం *భక్తానుగ్రహకారిణ్యై* నమః ।

నామ వివరణ.

భక్తులపై అనుగ్రహ కారణమయిన జనని లక్ష్మీమాత.

శా.  *భక్తానుగ్రహకారిణీ!* జయము, నీ భక్తాళి ధన్యాత్ములై

రక్తిన్ నిన్ మదిలోన నిల్పి సతమున్ బ్రార్థింతురోయమ్మ! నీ

శక్తిన్ మానసమందు నెంచి కృపకై సాంతంబు నిన్ గొల్తురే,

భక్తిన్ శక్తి నిహంబు సత్ పరము నా భాగ్యంబుగాఁ గొల్పుమా.
జైహింద్.

లక్ష్మీసహస్రం. 1వ శ్లోకం. 1 - 6. పద్య రచన చింతా రామకృష్ణారావు. పద్యగానం శ్రీమతి సుశీలాదేవి భాగవతారిణి.

0 comments

 

జైశ్రీరామ్.

॥ శ్రీలక్ష్మీసహస్రనామావలిః ॥

శ్రీ లక్ష్మీ సహస్ర నామాంచిత పద్యసహస్ర దళపద్మము.

రచన.   చింతా రామకృష్ణారావు.


॥ శ్రీలక్ష్మీసహస్రనామావలిః ॥

శ్లో.  నిత్యాగతానంతనిత్యా నందినీ జనరంజనీ ।

నిత్యప్రకాశినీ చైవ స్వప్రకాశస్వరూపిణీ ॥ 1 ॥

1.  ఓం *నిత్యాగతా*యై నమః ।

నామ వివరణ.

నిత్యమూ వచ్చుచుండెడి తల్లి మన అమ్మ లక్ష్మీ మాత.

శా.  శ్రీమన్మంగళ భవ్యభాగ్యద రమా! శ్రీ రూప! *నిత్యాగతా!*

ప్రేమోదార గుణాలయా! శుభద! నీవే సృష్టిలో మూలమై

క్షేమంబున్ గలిగింప మాకు సతమున్, శ్రీదేవివై వత్తువే,

నీ మాతృత్వమునెన్న నాకుఁ దరమా, నిన్నున్ సదా కొల్చెదన్.

2. ఓం *అనన్తనిత్యా*యై నమః ।

నామ వివరణ.

అంతము లేని శాశ్వతమయిన తల్లి రమామాత.

కం.  పరమాత్ముని నారాయణు

నరయుట నీ కృపను గలుగు నమ్మా! శుభదా!

కరుణ ననంతుని జూపెడి

నిరుపమ జననీ! *యనంత నిత్యా!* కొలుతున్,

3. ఓం *నన్దిన్యై* నమః ।

నామ వివరణ.

ఆనందమును కలుగఁ జేయు తల్లి మన అమ్మ శ్రీదేవి.

తే.గీ.  వినుత *నన్దినీ!* యానంద మనుభవైక

వేద్యమమ్మరో నీకృపన్ బ్రీతిఁ గనిన,

సతతమానందము న్మదిన్ సదయ నిలిపి,

కాచి రక్షించఁ, గొల్తు నిన్ గమల నయన!

4. ఓం *జనరఞ్జన్యై* నమః ।

నామ వివరణ.

జనుల మనసులకానందము కలుగజేయు తల్లి మన శ్రీదేవి.

తే.గీ.  దివ్య  *జనరఞ్జనీ!* సన్నిధిగనె నీకు

నన్ను నిలుపుకొనుము కృపన్, సన్నుతముగ

జనుల రంజింప జేసెదన్ ఘనతనెన్ని

పద్యములు వ్రాసి నీపైన భవహరముగ.

5. ఓం *నిత్యప్రకాశిన్యై* నమః ।

నామ వివరణ.

ఎల్లప్పుడూ ప్రకాశించు తల్లి లక్ష్మీదేవి.

తే.గీ.  జనని *నిత్యప్రకాశినీ!* జయము నీకు,

నీవె నిత్యప్రకాశమై నిండి మదిని

నీదు తేజంబు నాలోన నిండనిమ్ము

జ్ఞానసద్భాగ్య దాయినీ! కరుణఁ గనుమ.

6. ఓం *స్వప్రకాశస్వరూపిణ్యై* నమః ।

నామ వివరణ.

స్వయముగా ప్రకాశించు స్వరూపము కల తల్లి.

తే.గీ.  *స్వప్రకాశస్వరూపిణీ!* విప్ర పూజ్య!

నీ ప్రకాశమ్ము నాలోన నిలువనిమ్ము,

జ్ఞాన దివ్యప్రకాశమ్ము కలుగఁ జేసి,

కనఁగఁ జేయుము  నీ పతిన్ గాంక్షతీర.

జైహింద్.

1. ఓం నారసింహాయ నమః. చంపకమాల వృత్త గర్భ సీసము.

0 comments

 జైశ్రీరామ్.

శ్రీయాదాద్రి లక్ష్మీనృసింహస్వామి వారికి అష్టోత్తరశత నామాంచిత పద్యపుష్పార్చన.
1.  ఓం నారసింహాయ నమః. 
చంపకమాల వృత్త గర్భ సీసము.
అగణిత భవ్యదేహ! శుభుఁడైన మహేశ్వ -  ర, శ్రీగణేశులన్! సుశ్రవణుని,
జగమును నిల్పు మా జనని సన్నుత భార - తి, శ్రీరమాసతిన్, దీక్షఁ గొలుతు,
బ్రగణిత రాఘవున్, పరమ పావన సత్క - వి వ్రాతమున్, లసత్ విశ్వ జనుల,
జగతికి వెల్గులౌ సుగుణసాంద్రుల నంచి -  త ప్రేమఁ గొల్చెదన్, తలచి మదిని.
గీ. బంధ బహుఛంద సీసముల్ వరలఁ గొలుప - వీర నరసింహ శతకంబు *నారసింహ*.  
భక్త జన పోష! భవశోష! పాపనాశ! - శ్రితజనోద్భాస! యాదాద్రి శ్రీనృసింహ!
1వ సీస గర్భస్థ చంపకమాల వృత్తము.. (న జ భ జ జ జ ర .. యతి 11)
అగణిత భవ్యదేహ! శుభుఁడైన మహేశ్వ -  ర, శ్రీగణేశులన్! 
జగమును నిల్పు మా జనని సన్నుత భార - తి, శ్రీరమాసతిన్, 
బ్రగణిత రాఘవున్, పరమ పావన సత్క - వి భ్రాతలన్, లసత్ 
జగతికి వెల్గులౌ సుగుణసాంద్రుల నంచి -  త ప్రేమఁ గొల్చెదన్, 
భావము. 
భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున 
ప్రకాశించువాఁడా!  ఓ యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! పొగడ శక్యముకాని గొప్ప దేహము కలవాఁడా! వీర 
నరసింహ! శతకము అనేక ఛందములు గర్భితములై వరలు గొలుపు నిమిత్తము శుభములను కలిగించు శ్రీ 
మహేశ్వరులను, సుశ్రవణుఁడయిన గణపతి దేవులను, సృష్టిని నిలిపెడి నా తల్లి శారదాంబను, మంగళస్వరూపిణియైన 
లక్ష్మీదేవిని, సాటి లేనిదైన పార్వతీ మాతను దీక్షతో కొలిచెదను, మిక్కిలి పొగడఁ బడు శ్రీరాముని, గొప్ప పావన మూర్తులైన 
సత్కవుల సమూహమును, విశ్వమందలి సజ్జనులను, ఈ లోకమునకే వెలుఁగుగానున్న మంచిగుణములు కలవారిని, 
నా మదిలో తలచి తగిన విధముగా ప్రేమతో కొలిచెదను.

జైహింద్.

4, ఆగస్టు 2024, ఆదివారం

వనేఽపి దోషాః ప్రభవన్తి రాగిణాం .. మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో. వనేఽపి దోషాః ప్రభవన్తి రాగిణాం  -  గృహేఽపి పఞ్చేన్ద్రియనిగ్రహస్తపః।

అకుత్సితే కర్మణి యః ప్రవర్తతే  -  నివృత్తరాగస్య గృహం తపోవనమ్॥ 

(హితోపదేశః)

తే.గీ.  రాగునకు వనమందునన్ గ్రాలు నవియె,

యింద్రియ జితుడింటఁ దపసియె, గణియింప

కుత్సితపు కర్మ దూరునకును విరాగు

నకు దపోవనమిల్లెయౌ సకలవేద్య!

భావము. విషయవాసనలు కలవారికి అడవికి వెళ్లినా కామక్రోధాదిదోషాలు 

సంభవిస్తాయి. పంచేంద్రియాలను నిగ్రహించినవారు ఇంటిలో ఉన్నా తపస్సు 

చేయగలరు. అనగా వారు తాపసులే. శాస్త్రముచే నిందింపబడని 

(శాస్త్రసమ్మతములైన) కర్మలు ఆచరిస్తూ విషయవాంఛలు వదిలి చరించేవారికి 

ఇల్లే తపోవనము.

జైహింద్.

3, ఆగస్టు 2024, శనివారం

డా. బోరెల్లి హర్ష అష్టావధానం తే. 04 - 8 - 2024.

0 comments

 

జైశ్రీరామ్.
జైహింద్.


ప్రజ-పద్యం ఆధ్వర్యవంలో శ్రీ కాటేపల్లి 100వ అష్టావధానం. తే.11 - 8 - 2024.ని.

0 comments

జైశ్రీరామ్. 

జైహింద్.

ఉభయోర్నాస్తి భోగేచ్ఛా .. మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

జైశ్రీరామ్. 

శ్లో.  ఉభయోర్నాస్తి భోగేచ్ఛా  -  పరార్థం ధనసంచయః |

కృపణోదారయోః పశ్య  -  తథాపి మహదంతరమ్ ||  (సుభాషితసుధానిధి)

కం.  కృపణుఁ డుదారుఁడు నిరువురుఁ

దపియింపరు భోగములకు, ధనముగడింపన్

దపియింతురు, పర వశమౌ

స్వ, పరార్థంబుగఁ గల నిధి, సామ్యము కలదే?

భావము.  పిసినారి మరియు ఉదారి ఈ ఇద్దరూ తాము అనుభవించాలనే కోరిక 

కలిగి ఉండరు; ఇద్దరూ ఇతరులకోసం డబ్బు కూడబెట్టడానికే పనిచేస్తారు. 

అయినప్పటికీ, వీరిద్దరి మధ్య అపారమైన తేడా.

  జైహింద్.

8వ పద్యము. శ్రీమన్నారాయణ శతకము. గానము. శ్రీమతి దోర్బల బాలసుజాత.

0 comments

జైశ్రీరామ్.

8. శా. మున్నే నిన్ను మనమ్మునన్ మననమున్ మున్నుంచి మన్నించు నీ

నన్నున్, నా నిను నెన్నునాన్నను ననూనా! మున్నె మన్నించు నో

కన్నా! రక్షకు డీవె కాదె. మనమున్ గాంచన్ మహోదార! శ్రీ

మన్నారాయణ! కావుమయ్య.  జగతిన్ మంచిన్ గృపన్ గావుమా. !

భావము.

పరిపూర్ణుఁడవైన ఓ శ్రీమన్నారాయణా!  ఇతః పూర్వమే నిన్ను మనసులో 

ముందుగా నిలిపిమన్నించు నీవాడినైన నన్ను, నాకు సంబంధించిన నిన్ను 

గుర్తించెడి నా యొక్క అన్ననుముందుగానే మన్నించునటువంటి నీకన్నా

రక్షకులింకెవరు? మనసుపెట్టి చూచెడి మహోదారగుణసంపన్నుఁడా! 

కాపాడుము. లోకమున మంచిని కృపతో కాపాడుము.

జైహింద్.

ఆకారైరింగితైర్గత్యా . .. మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  ఆకారైరింగితైర్గత్యా  -  చేష్టయా భాషణేన చ l

నేత్రవక్త్రవికారైశ్చ  -  లక్ష్యతేఽన్తర్గతం మనః ll

తే.గీ. వ్యక్తమగునట్టి యింగితం బాకృతియును,

భాషణము, చేష్ట, మనదైన వ్యవహృతియును,

కనుల ముఖమున గనఁబడు కవళికలును

తెలుపు మనలోని భావనల్ తెల్లమవగ.

భావము. ఆకారముచేత, ఇంగితముచేత, నడవడికచేత, వ్యవహారముచేత, 

మాటలచేత మరియు కళ్ళలో, ముఖములో కలిగే మార్పులచేత 

మనస్సులోని భావం తెలియజేయబడును.

జైహింద్.

2, ఆగస్టు 2024, శుక్రవారం

శృంగేరీలో భువనవిజయం సాహిత్య రూపకం ||Bhuvana Vijayam Sahitya Roopakam

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

బ్రహ్మశ్రీ డా. మాడుగుల నాగఫణిశర్మగారి అద్భుతమైన పూరణలు.garikapati samasya madgula samadhanam

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

స్వభావేన హి తుష్యంతి. .. మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  స్వభావేన హి తుష్యంతి  -  దేవాః సత్పరుషాః పితా |

జ్ఞాతయస్త్వన్నపానేన  -  వాక్యదానేన పండితాః ||

తే.గీ.  సత్స్వభావాన కనుదురు సంతసమును

దేవ, పితరులు, సజ్జనుల్,  దివ్యమైన

భోజనమునను బంధువుల్ సాజముగనె,

పండితులు మంచిమాటకే పరవశింత్రు.

భావము.  మంచి స్వభావంచేత దేవతలు, సజ్జనులు, తండ్రి - వీరు సంతృప్తి 

చెందుతారు. బంధుబాంధవులు అన్నపానాలతో సంతుష్టులౌతారు. 

విద్వాంసులైతే చక్కని మాటలతోనే ఆనందపడతారు.

జైహింద్.

1, ఆగస్టు 2024, గురువారం

డా.D.V.G.A.సోమయాజులు గారికి అఖిలభారతీయబ్రాహ్మణ మహా సంఘం ఆంధ్రప్రదేశ్ వారు వేదవిజ్ఞానభాస్కర అనేబిరుదుతో సత్కరించారు.

0 comments

 జైశ్రీరామ్.

ప్రముఖసంస్కృతాంధ్రపండితులు, జ్యోతిశ్శాస్త్రపారంగతులు డా.D.V.G.A.సోమయాజులు గారికి  అఖిలభారతీయబ్రాహ్మణ మహా సంఘం ఆంధ్రప్రదేశ్ వారు కడపసమీపమునగల గండి క్షేత్రంలో వేదవిజ్ఞానభాస్కర అనేబిరుదుతో సత్కరించుట ముదావహము.

డా.సోమయాజులు గారు సంస్కృతాంధ్రోపన్యాసకులుగా పనిచేసిమంచి కీర్తిగడించారు. వేదవిజ్ఞానసంపన్నులయిన వీరికి ఈ బిరుదు నొసగుట సముచితముగనొప్పియున్నది. డా.సోమయాజులు గారికి ఆంధ్రాంఋతం అభినందనలు తెలియఁజేస్తోందె.

జైహింద్.

న కాష్టే విద్యతే దేవో .. మేలిమి బంగారం మన సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  న కాష్టే విద్యతే దేవో  -  న శిలాయాం న మృత్సు చ | 

భావే హి విద్యతే దేవః  -  తస్మాద్భావం సమాచరేత్ ||

ఆ.వె.  కట్టెయందు లేడు కటికి శిలనులేడు,

మట్టిబొమ్మలందు మసలఁబోడు,

భావనముననుండు భగవంతుఁడెప్పుడు,

నాత్మలోనగాంచుమతనిఁ గొలువ.

భావము.  భగవంతుడు కట్టెయందు కాని, రాతియందు కాని, 

మట్టిబొమ్మల యందు కాని లేడు. మన భావనయందు మాత్రమే 

భగవంతుడున్నాడు. కనుక సద్భావముతో విగ్రహారాధన చేయవలెను.

జైహింద్.

శ్రీగురుపురస్కారాలు 2024. అఖిలభారతీయ బ్రాహ్మణ మహా సంఘము. ఆంధ్రప్రదేశ్.తే.29 - 7 - 2024.

0 comments

 జైశ్రీరామ్.

జైహింద్.

31, జులై 2024, బుధవారం

సంఘం శరణం గచ్ఛామి(ఏకాదశ రుద్రాత్మకమ్)రచన:-శ్రీవల్లభ

0 comments

 జైశ్రీరామ్.

కం:_శ్రీమాతా కరుణింపుమ
        నీమావృతి నడచు జగము నిన్నే దలపన్
        రామాశ్రిత రమ్య జగతి
        ధామంబును గూర్చి గావ దలచెదు మాతా!

తే గీ:-కర్మ సిద్ధాంత జనితమై ధర్మ నిరతి!
       మర్మ కర్మాంత  వేద్యుల మాయ దవిలి
      చర్మ ధారుల దౌర్భాగ్య సాయకముల
     మర్మ స్వార్ధపు మాంగళ్య మందె కలిని!    1.

తే గీ:-స్వార్ధ భూయిష్ట సంసార కడలి నిలచి
       వ్యర్ధ జీమూత సంఘంబు పట్టు జిక్కి
      ధర్మ మన్నది దరిజేర తప్పటంచు
     వర్ధ మానుల రీతిని వరల దగునె?          2

తే గీ:-శక్తి రూపిణి స్త్రీ మాత జగతి క ర్త
        కష్టముల కోర్చి కన్నట్టి కన్న త ల్లి
       కృ ళ్ళు సంఘాన కుత్సితాకులము చెంది
       భిక్షు లోకాన వేస రి వేడె శివుని!          3

తే గీ:-అన్న ముక్కంటి గనవేమి?యాటవికుల
       చేష్ట లన్నియు కలి నడ్డి చితుక కొట్టె
      ధర్మ గ్లానియు చేకురి తల్లడిల్లె
     దురితులను  చీల్చి ఛెండాడ తెగువ లేద? 4.

తే గీ:-కుల మతాల కుంపట్ల జ్వాల లెగసె
       జాతి మత సంక్షోభ చరిత మిగిలె!
      రక్ష యవి నీతి భక్షణ రక్ష గనక
      శిక్ష గూర్చెడి శివ మూర్తి చక్షువంటె!      5.

(అవినీతి జ్వాల లు శివుని మూడవ కన్నును జేరుటచే
చూడ జాలక మూసియుంచెను)

తే.గీ:-చక్షువును మూసి న్యాయంపు సరళి గనుచు
        దొంగ దోబూచి మాటల లొంగి పోయె
        జగతి కాధార మూర్తివి! జనకు డీవు!
       జాల మేలుచు లోకాన్ని  చక్క దీర్చు!   6.

తే.గీ:-  దుష్ట సంహారమును జేసి శిష్ట రక్ష
           నిష్టమై జేయు నిర్మల నీతి మంత!
          సమ సమాజంబు డబ్బుతో!చక్క బడునె?
         మమత మమకారములు పెంచు మహితమూర్తి! 7.

తే గీ:-భూమి కబళించు మృచ్ఛులు పుట్టి రిలను
        తట్టు కో లేక కన్నీట తడిసె దేల?
       విలయ తాండవ మేర్చుమా!వినుతి గనెదు!
       తండ్రి తలకోయు ధన్యులు ధాత్రి గలరు!         8.

తే.గీ:-క్షమకు కాలంబు చెల్లెను చచ్చె సుఖము!
        జీవ హింసయె జీవన సరళి యాయె!
        పాప కూపాన మిట్టాడ పద్ధ తగునె?
        ధర్మ దేవత కను గుడ్డ తగదు విడుమ!       9.

(కంటితోచూచి విని చెప్ప నీయని ధర్మము సంపూర్ణత
గనునా?)

తే.గీ;-జనన మరణాల నాపంగ శక్య మగునె?    
         సృష్టి కర్తృక మంతయు శివ మయంబు!
        లోక దౌర్భాగ్య దుస్తితి లోను యగుచు
        దురితు లాయెడి వారల దురిత మాపి!     10.

తేగీ:-సత్తు తత్తుల దృష్టిని సాగ నిచ్చి
       సత్వ బుద్ధిని నేర్పించి జగము బ్రోచి!
       కావు కల్యాణ కారకా!కన్న తండ్రి!
      శివము శాంతంబు కాదొకో? జీవ ధాత్రి!   11.

జైహింద్.