గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

11, అక్టోబర్ 2026, ఆదివారం

ఆంధ్రామృత పాఠకులకు ఆస్తిక మహాశయులకుశరన్నవరాత్రులు సందర్భంగా శుభాకాంక్షలు.

 జైశ్రీరామ్.

ఓం శ్రీమాత్రే నమః.

ఆంధ్రామృత పాఠకులకు ఆస్తిక మహాశయులకు శరన్నవరాత్రులు సందర్భంగా శుభాకాంక్షలు.

ఆ జగన్మాత ఈ నవరాత్రులలో నవ దుర్గలుగా భక్తులకు కనువిందు చేస్తూ అలౌకికానందాన్ని కలుఁగఁ జేస్తూ అనుగ్రహిస్తుంది. ఐతే భక్తులైనా సాధకులైనా చేయవలసినది ఒక్కటే. అమ్మవారి అనుగ్రహాన్ని పూర్తిగా పొందాలనే ఆ కాంక్ష త్రికరణ శుద్ధిగా కలిగి ఉండటంతో పాటు ఆ జగన్మాతను అణువణువునా చూడగలగాలి. అణువణువునా ఆతల్లి రూపాన్నే చూడఁ గలగాలి. ఆరాధించఁ గలగాలి. అప్పుడు తప్పక ఆ తల్లి అనుగ్రహం లభిస్తుందనడంలో ఎట్టి సందేహమూ లేదు.

జై జగన్మాతా!

అందరికీఆ తల్లి ఆశీస్సులు లభించుఁగాక.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.