గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

20, అక్టోబర్ 2026, మంగళవారం

ప్రమాణీ,మత్తరజనీ,జవాశ్రీ,ఆజ్ఞతా,జాతి భిక్షుక,సృష్టి భ్రష్ట,స్వార్థ మేథ,అనారత,, కుల స్వార్ధ,కు జ్ఞతా,దోషాజ్ఞ,స్వార్ధ పూర్ణ,అపక్వ,ధర్మ హరణ,గర్భ వివక్షతా"- వృత్తము, రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి,

జై శ్రీరామ్

ప్రమాణీ,మత్తరజనీ,జవాశ్రీ,ఆజ్ఞతా,జాతి భిక్షుక,సృష్టి భ్రష్ట,స్వార్థ మేథ,అనారత,,

కుల స్వార్ధ,కు జ్ఞతా,దోషాజ్ఞ,స్వార్ధ పూర్ణ,అపక్వ,ధర్మ హరణ,గర్భ వివక్షతా"-

వృత్తము,


                                          రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి,

                                                                       జుత్తాడ,


వివక్షతా వృత్తము,


వివక్ష జాతి భిక్షువై! విజ్ఞతెల్ల నజ్ఞ తొందెనే?విరించి సృష్టి భ్రష్టు పడన్!

భవాబ్ది కాల కూటమై!ప్రజ్ఞదే?కులంబు నంటెనే?వరామ లేమి సామ్యమయెన్!

అవాంఛ నీయ తెల్వయెన్?ఆజ్ఞ దోష వర్తనాశ్రియై!హరించె నీతి,ధర్మ మిలన్!

కవాతు ద్రొక్కె భూతలిన్!కుజ్ఞతే ప్రమోద మాయెనే?కు రూప కేళిమోద మననన్!!


అర్ధములు

విజ్ఞత=తెలివి తేటలు,అజ్ఞత=తెలివిలేని,ఆజ్ఞదోష=చెడు ఆజ్ఞలు,

కు జ్ఞత=చెడు తెల్వి,కురూప కేళి=వికారాకారుల యాట,


వివక్షతా వృత్తము, జ,ర,య,జ,ర,జ,ర,జ,లగ,గణము లుండును,

ఉత్కృతి ఛందము నందలిది, ప్రాస నియమము కలదు,

యతులు,9,18. అక్షరములు,వృ,సం:-2.79.61.992.


1.గర్భ గత ప్రమాణీ వృత్తము,


వివక్ష జాతి భిక్షువై!

భవాబ్ది కాలకూటమై!

అవాంఛనీయ తెల్వయెన్!

కవాతు ద్రొక్కె!భూతలిన్!!


ప్రమాణీ వృత్తము,జ,ర,లగ,గణము లుండును,

అనుష్టుప్ఛందము నందలిది,ప్రాస నియమము కలదు,

వృ,సం:-86.


2.గర్భగత,మత్త రజినీ వృత్తము,


విజ్ఞ తెల్ల నజ్ఞ తొందెనే?

ప్రజ్ఞ దే?కులంబు నంటెనే?

ఆజ్ఞ దోష వర్తనాశ్రియై!

కుజ్ఞతే ప్రమోద మాయెనే?


మత్త రజినీ వృత్తము,ర,జ,ర,గణము లుండును,

బృహతి ఛందము నందలిది,ప్రాస నియమము కలదు,

వృ,సం:-171.


3.గర్భగత,జవాశ్రీ వృత్తము,


విరించి సృష్టి భ్రష్టు పడన్!

వరామ లేమి సామ్య మయెన్!

హరించె ,నీతి,ధర్మ మిలన్!

కురూప కేళి మోదమనన్?


జవాశ్రీ వృత్తము,జ,ర,స,గణము లుండును,

బృహతి ఛందము నందలిది,ప్రాస నియమము కలదు,

వృ,సం:-214.


4.గర్భగత,ఆజ్ఞతా వృత్తము,


వివక్ష జాతి భిక్షువై!విజ్ఞతెల్ల?నజ్ఞ తొందెనే?

భవాబ్ది కాలకూటమై!ప్ర జ్ఞదే?కులంబు నంటెనే?

అవాంఛ నీయ!తెల్వయెన్!ఆజ్ఞ!దోష వర్తనాశ్రియై!

కవాతు ద్రొక్కె!భూతలిన్!కుజ్ఞతే ప్రమోద మాయెనే!


ఆజ్ఞతా వృత్తము,జ,ర,య,జ,ర,లగ,గణము లుండును,

అత్యష్టి ఛందము నందలిది,ప్రాస నియమము కలదు,

యతి,9.వ యక్షరము,వృ,సం:-46,006.


5.గర్భగత జాతి భిక్షుక వృత్తము,


విజ్ఞ తెల్ల?నజ్ఞ తొందెనే!విరించి సృష్టి భ్రష్టు పడన్!

ప్రజ్ఞదే?కులంబు నంటెనే?వరామ లేమి!సామ్య మయెన్!

ఆజ్ఞ దోష వర్తనాశ్రియై!హరించె!నీతి,ధర్మ మిలన్!

కు జ్ఞతే ప్రమోద మాయెనే?కురూప కేళి మోద మనన్!


జాతి భిక్షుక వృత్తము,ర,జ,ర,జ,ర,స,గణము లుండును,

ధృతి ఛందము నందలిది,ప్రాస నియమము కలదు,

యతి,10.వ,యక్షరము,వృ,సం::-1.10.227.


6.గర్భగత సృష్టి  భ్రష్ట వృత్తము


విరించి సృష్టి భ్రష్టు పడన్!వివక్ష జాతి భిక్షువై!

వరామ లేమి!సామ్య మయెన్!భవాబ్ది కాలకూటమై!

హరించె!నీతి,ధర్మ మిలన్!అవాంఛనీయ తెల్వయెన్?

కురూప కేళి మోద మనన్?కవాతు ద్రొక్కె!భూతలిన్!


సృష్టి భ్రష్ట వృత్తము,జ,ర,స,త,ర,లగ,గణము లుండును,

అత్యష్టి ఛందము నందలిది,ప్రాస నియ మము కలదు,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-43.222.


7.గర్భ గత స్వార్ధ మేథ వృత్తము,


విజ్ఞ తెల్ల?నజ్ఞ తొందెనే!వివక్ష జాతి భిక్షువై!

ప్రజ్ఞదే?కులంబు నంటెనే?భవాబ్ది కాలకూటమై!

ఆజ్ఞ దోష వర్తనాశ్రియై!అవాంఛనీయ!తెల్వయెన్!

కుజ్ఞతే!ప్రమోద మాయెనే?కవాతు ద్రొక్కె భూతలిన్!!


స్వార్ధ మేథ వృత్తము,ర,జ,ర,జ,ర,లగ,గణము లుండును,

అత్యష్టి ఛందము నందలిది,ప్రాస నియమము కలదు,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-43.691.


8.గర్భగత అనారత వృత్తము,


విరించి సృష్టి భ్రష్టు పడెన్!విజ్ఞ తెల్ల?నజ్ఞ తొందెనే!

వరామ లేమి సామ్యమయెన్!ప్రజ్ఞదే?కులంబు నంటెనే?

హరించె!నీతి,ధర్మ మిలన్!ఆజ్ఞ దోష వర్తనాశ్రియై!

కురూప కేళి మోద మనన్!కుజ్ఞతే!ప్రమోద మాయెనే!



అనారత వృత్తము,జ,ర,స,ర,జ,ర,గణము లుండును,

ధృతి ఛందము నందలిది,ప్రాస నియమము కలదు,

యతి,10.వశయక్షరము,వృశసం;-87,254.


9.గర్భ గత కులస్వార్ధ వృత్తము,


వివక్ష జాతి భిక్షువై!విరించి సృష్టి భ్రష్టు పడెన్!

భవాబ్ది కాలకూటమై!వరామ లేమి?సామ్య మయెన్!

అవాంఛ నీయ!తెల్వయెన్?హరించె నీతి,ధర్మ మిలన్!

కవాతు ద్రొక్కె!భూతలిన్!కురూప కేళి మోద మనన్?


కుల స్వార్ధ వృత్తము,జ,ర,జ,ర,జ,లగ,గణము లుండును,

అత్యష్టి ఛందము నందలిది,ప్రాస నియమము కలదు,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-54.574.


10.గర్భగత కుజ్ఞతా వృత్తము,


విజ్ఞ తెల్ల నజ్ఞ తొందెనే?విరించి సృష్టి భ్రష్టు పడెన్!వివక్ష జాతి భిక్షువై!

ప్రజ్ఞదే?కులంబు నంటెనే?వరామ!లేమి సామ్య మయెన్!భవాబ్ది!కాలకూటమై!

ఆజ్ఞ దోషవర్తనాశ్రియై!హరించె!నీతి,ధర్మ మిలన్!అవాంఛనీయ!తెల్వయెన్?

కు జ్ఞతే?ప్రమోద మాయెనే!కు రూప కేళి మోద మనన్?కవాతు ద్రొక్కె!భూతలిన్!!


కుజ్ఞతా వృత్తము,ర,జ,ర,జ,ర,స,జ,ర,లగ,గణము లుండును,

ఉత్కృతి ఛందము నందలిది,ప్రాస నియమము కలదు,

యతులు,10.19.అక్షరములు,వృ,సం;-2.23.91.267.


11.గర్భగత:-దోషాజ్ఞా వృత్తము,


విరించి సృష్టి భ్రష్టు పడెన్!వివక్ష జాతి భిక్షువై!విజ్ఞ తెల్ల నజ్ఞ తొందెనే?

వరామ లేమి!సామ్య మయెన్!భవాబ్ది కాలకూటమై!ప్రజ్ఞదే?కులంబు నంటెనే?

హరించె!నీతి,ధర్మ మిలన్!అవాంఛనీయ తెల్వయన్!ఆజ్ఞ దోష వర్తనాశ్రియై.

కు రూప కేళి మోద మనన్!కవాతు ద్రోక్కె!భూతలిన్!కుజ్ఞతే?ప్రమోద మాయెనే?


దోషాజ్ఞా వృత్తము,జ,ర,స,జ,ర,య,జ,ర,లగ, గణము లుండును,

ఉత్కృతి ఛందము నందలిది,ప్రాస నియమము కలదు,

యతులు,10.18.అక్షరములు,వృ,సం:-2.26.96.482.


12.గర్భగత స్వార్ధ పూర్ణ వృత్తము,


విజ్ఞ తెల్ల నజ్ఞ తొందెనే?వివక్ష జాతి భిక్షువై!విరించి సృష్టి భ్రష్టు పడెన్!

ప్రజ్ఞదే?కులంబు నంటెనే!భవాబ్ది కాలకూటమై!వరామ లేమి!సామ్య మయెన్!

ఆజ్ఞ దోష వర్తనాశ్రియై!అవాంఛనీయ!తెల్వయెన్!హరించె!నీతి,ధర్మ మిలన్!;!

కుజ్ఞతే?ప్రమోద మాయెనే?కవాతు ద్రొక్కె భూతలిన్!కురూప కేళి మోద మనన్?


స్వార్ధ పూర్ణ వృత్తము,ర,జ,ర,జ,ర,జ,ర,జ,లగ,గణము లుండును,

ఉత్కృతి ఛందము నందలిది,ప్రాస నియమము కలదు,

యతులు,10.18.అక్షరములు,వృ,సం:-2.79.62.027.


13.గర్భగత అపక్వ వృత్తము,


విరించి సృష్టి భ్రష్టు పడన్!విజ్ఞ తెల్ల నజ్ఞ తొందెనే?వివక్ష జాతి భిక్షువై!

వరామ లేమి?సామ్య మయెన్!ప్రజ్ఞదే?కులంబు నంటెనే!భవాబ్ది కాలకూటమై!

హరించె!నీతి,ధర్మ మిలన్!ఆజ్ఞ దోష వర్త నాశ్రియై ! అవాంఛ నీయ?తెల్వయెన్!

కురూప కేళి మోద మనన్!కుజ్ఞతే?ప్రమోద మాయెనే!కవాతు ద్రొక్కె!భూతలిన్!!


అపక్వ వృత్తము,జ,ర,స,ర,జ,ర,జ,ర,లగ,గణము లుండును,

ఉత్కృతి ఛందము నందలిది,ప్రాస నియమము కలదు,

యతులు,10.19.అక్షరములు,వృ,సం:-2.23.69.494.


14.గర్భగత ధర్మ హరణ వృత్తము,


వివక్ష జాతి భిక్షువై!విరించి సృష్టి  భ్రష్టుపడెన్!విజ్ఞ తెల్ల నజ్ఞ తొందెనే?

భవాబ్ది కాలకూటమై!వరామ లేమి సామ్య మయెన్!ప్రజ్ఞదే?కులంబు నంటెనే?

అవాంఛ నీయ తెల్వయెన్?హరించె నీతి ధర్మ మిలన్!ఆజ్ఞ దోష వర్తనాశ్రియై!

కవాతు ద్రొక్కె!భూతలిన్!కురూప కేళి మోద మనన్?కు జ్ఞతే?ప్రమోద మాయెనే!


ధర్మ హరణ వృత్తము,జ,ర,జ,ర,జ,య,య,ర,లగ,గణము లుండును,

ఉత్కృతి ఛందము నందలిది,ప్రాస నియమము కలదు,

యతులు,9.18.అక్షరములు,వృ,సం:-2.12.88.236.

జైహింద్. 

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.