గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

20, డిసెంబర్ 2022, మంగళవారం

ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో - ...17 - 7...//...ఆయుఃసత్త్వబలారోగ్య - ...17 - 8,,,//.....సప్తదశోధ్యాయము - శ్రద్ధాత్రయవిభాగయోగము

0 comments

 జైశ్రీరామ్.

|| 17-7 ||

శ్లోఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః|

యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు. .

తే.గీజనులకిష్టంబు త్రివిధభోజనములవని

తపము, యజ్ఞము,ధనమట్లె, తలచి చూడ,

భేదమరయుము వానిలో మోదమలర,

నీవు గ్రహియింపుమర్జునా నేర్పు మీర.

భావము.

మానవులకు మూడు విధాలైన ఆహారం ప్రియమౌతుంది. యజ్ఞమూతపస్సూ, దానమూ 

కూడా అలాగే ఉంటుంది. వాటిలోని భేదాన్ని విను.

|| 17-8 ||

శ్లో.  ఆయుఃసత్త్వబలారోగ్యసుఖప్రీతివివర్ధనాః|

రస్యాః స్నిగ్ధాః స్థిరా హృద్యా ఆహారాః సాత్త్వికప్రియాః. ||

తే.గీ. ఆయువును, సత్వబలముల, ననితరముగ

సుఖము, నారోగ్యమున్, బ్రీతి, అధికమవగ

చేయు, రసయుక్తమౌ, స్నిగ్ధ, శ్రేయమునిడు

భోజనము కోరు సాత్వికుల్ పూర్తిగాను.

భావము.

ఆయువు సత్వగుణం, బలం, ఆరోగ్యం, సుఖం ప్రీతి వీటిని పెంచేవీరసంతో నిండినివీ, జిడ్డుతో నిగనిగలాడేవీ, కడుపులో చాలా కాలం ఉండేవీ, మనస్సునాకర్షించేవీ అయిన ఆహారాలు సాత్వికులకు ప్రియంగా ఉంటాయి.

జైహింద్.

19, డిసెంబర్ 2022, సోమవారం

అశాస్త్రవిహితం ఘోరం - ...17 - 5...//...కర్షయన్తః శరీరస్థం - ...17 - 6,,,//.....సప్తదశోధ్యాయము - శ్రద్ధాత్రయవిభాగయోగము

0 comments

జైశ్రీరామ్.

|| 17-5 ||

శ్లోఅశాస్త్రవిహితం ఘోరం తప్యన్తే యే తపో జనాః|

దమ్భాహంకారసంయుక్తాః కామరాగబలాన్వితాః. 

తే.గీప్రబల కామరాగములతో వరలుచుండి

యహముదంబంబులనగల్గియహరహంబు,

శాస్త్రమొప్పని, చెడుగొల్పు సద్విరుద్ధ

తపము చేసెడివారుంద్రు ధరణిపైన.

భావము.

దంభాహంకారాలతో, ప్రబలమైన కామరాగాలతో కూడి శాస్త్ర విరుద్ధమైన

పీడా కరమైన తపస్సు చేసే వారూ,

|| 17-6 ||

శ్లోకర్షయన్తః శరీరస్థం భూత గ్రామమచేతసః|

మాం చైవాన్తఃశరీరస్థం తాన్విద్ధ్యాసురనిశ్చయాన్

తే.గీ. తెలివిమాలి జీవకణాళి, దేజమయిన

నన్ను హింసింతురాసుర మున్న జనము

లసురనిశ్చయులనియెంచుమట్టి వారి

కిహము పరమును చెడిపోవు, మహిత! కనుమ.

భావము.

తెలివి తక్కువగా శరీరంలోని జీవకణాలనూ, శరీరంలో ఉండేనన్ను కూడా 

హింసించే వాళ్ళు అసురిక నిశ్చయం కలవారని తెలుసుకో.

జైహింద్.

తే. ఫిబ్రవరి 22న ప్రపంచ అవధాన దినోత్సవము..... శ్రీకాకుళంలో గన్నవరంలలితాదిత్యశతావధానవిజయోత్సవసభ||రెవెన్యూశాఖామంత్రి ప్రకటన.

0 comments

జైశ్రీరామ్.
ప్రస్తుతం ఉన్న అష్టావధాన, శతావధాన, ప్రక్రియలకు రూపకల్పన చేసినవారు శ్రీమాన్‌ మాడభూషి వేంకటాచార్యులు(1835 - 1895)వీరు వైష్ణవబ్రాహ్మణులు, కౌశికగోత్రులు మరియు ఆపస్తంబసూత్రుడు. వీరి తల్లి: అలివేలమ్మ మరియు తండ్రి: నరసింహాచార్యులు. వీరు నూజివీడు లో 1835 లో ఫిబ్రవరి 22న జన్మించారు. వీరి నిధనము: 1895-మన్మథ నామ సంవత్సర ఫాల్గుణ బహుళ తృతీయ.  మాడభూషి వేంకటేశ్వరరావు గారి జన్మదినమయిన ఫిబ్రవరి యిరవై రెండవ తేదీని ప్రపంచ అవధాన దినంగా ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభిత్వమునకు, మత్రివర్యులు శ్రీ ధర్మాన ప్రసాదరావు మహోదయులకు ధన్యవాదపూర్వక నమస్సులు.
అవధాన విద్యా వర్ధతామ్.
జైహింద్.

శ్రీకాకుళంలో శతావధానశరశ్చంద్ర శ్రీలలితాదిత్య శతావధానం|దర్శనమ్ సంపాదకులు ...

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

16, డిసెంబర్ 2022, శుక్రవారం

సిద్దలక్ష్మీస్తోత్రమ్.

0 comments

కైశ్రీరామ్. సిద్దలక్ష్మీస్తోత్రమ్ ఓం అస్య శ్రీసిద్ధిలక్ష్మీ స్తోత్రస్య హిరణ్యగర్భ ఋషిః అనుష్టుప్ ఛందః సిద్ధిలక్ష్మీర్దేవతా మమ సమస్త దుఃఖక్లేశ పీడా దారిద్య్ర వినాశార్థం సర్వలక్ష్మీప్రసన్న కరణార్థం మహాకాలీ మహాలక్ష్మీ మహాసరస్వతీదేవతాప్రీత్యర్థంచ సిద్ధిలక్ష్మీస్తోత్ర జపే వినియోగః | ధ్యానమ్ | బ్రాహ్మీంచ వైష్ణవీం భద్రాం షడ్భుజాం చ చతుర్ముఖామ్ త్రినేత్రాం చ త్రిశూలాం చ పద్మచక్రగదాధరామ్ | పీతాంబరధరాం దేవీం నానాలంకార భూషితామ్ తేజఃపుంజ ధరాం శ్రేష్ఠాంధ్యాయేద్బాలకుమారికామ్ || స్తోత్రమ్ | ఓంకారలక్ష్మీరూపేణ విష్ణోర్హృదయ మవ్యయమ్ | విష్ణుమానంద మధ్యస్థం హ్రీంకార బీజరూపిణీ || ౧ || ఓం క్లీం అమృతానందభద్రే సద్యఆనందదాయినీ | ఓం శ్రీం దైత్యభక్షరదాం శక్తిమాలినీ శత్రుమర్దినీ || ౨ || తేజఃప్రకాశినీ దేవీ వరదా శుభకారిణీ | బ్రాహ్మీ చ వైష్ణవీ భద్రా కాలికా రక్తశాంభవీ || ౩|| ఆకారబ్రహ్మరూపేణ ఓంకారం విష్ణుమవ్యయమ్ | సిద్ధిలక్ష్మి పరాలక్ష్మి లక్ష్యలక్ష్మినమోస్తు తే || ౪ || సూర్యకోటి ప్రతీకాశం చంద్రకోటి సమప్రభమ్ | తన్మధ్యే నికరేసూక్ష్మం బ్రహ్మరూప వ్యవస్థితమ్ || ౫ || ఓంకార పరమానందం క్రియతే సుఖ సంపదా | సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే || ౬ || ప్రథమే త్ర్యంబకా గౌరీ ద్వితీయేవైష్ణవీ తథా | తృతీయే కమలా ప్రోక్తా చతుర్థే సురసుందరీ || ౭ || పంచమే విష్ణుపత్నీచషష్ఠే చ వైష్ణవీ తథా | సప్తమేచ వరారోహా అష్టమే వరదాయినీ || ౮ || నవమే ఖడ్గ త్రిశూలాదశమే దేవదేవతా | ఏకాదశే సిద్ధిలక్ష్మీ ర్ద్వాదశే లలితాత్మికా || ౯ || ఏతత్ స్తోత్రంపఠంతస్త్వాం స్తువంతి భువి మానవాః | సర్వోపద్రవ ముక్తాస్తే నాత్ర కార్యా విచారణా ||౧౦ || ఏకమాసం ద్విమాసం వా త్రిమాసం చ చతుర్థకమ్ | పంచమాసం చ షణ్మాసం త్రికాలం యఃపఠేన్నరః || ౧౧ || బ్రాహ్మణాః క్లేశతో దుఃఖదరిద్రా భయపీడితాః | జన్మాంతర సహస్రేషుముచ్యంతే సర్వక్లేశతః || ౧౨ || అలక్ష్మీ ర్లభతే లక్ష్మీ మపుత్రః పుత్ర ముత్తమమ్ | ధన్యం యశస్యమాయుష్యం వహ్నిచౌరభయేషు చ || ౧౩ || శాకినీ భూతవేతాల సర్వవ్యాధినిపాతకే | రాజద్వారే మహాఘోరే సంగ్రామే రిపు సంకటే || ౧౪ || సభాస్థానే శ్మశానేచ కారాగేహారిబంధనే | అశేష భయసంప్రాప్తౌ సిద్ధిలక్ష్మీం జపేన్నరః || ౧౫ || ఈశ్వరేణ కృతం స్తోత్రంప్రాణినాం హితకారణమ్ | స్తువంతి బ్రాహ్మణా నిత్యం దారిద్ర్యం న చ వర్ధతే || ౧౬ || యా శ్రీః పద్మవనే కదంబశిఖరే రాజగృహే కుంజరే శ్వేతే చాశ్వయుతే వృషేచ యుగలే యజ్ఞే చయూపస్థితే | శంఖే దేవకులే నరేంద్రభవనే గంగాతటే గోకులే *సా శ్రీ స్తిష్ఠతు సర్వదా మమగృహే భూయాత్సదా నిశ్చలా || ఇతి శ్రీబ్రహ్మాండపురాణే ఈశ్వరవిష్ణుసంవాదే దారిద్య్ర నాశన సిద్ధిలక్ష్మీ స్తోత్రం సంపూర్ణమ్ || జైహింద్.

13, డిసెంబర్ 2022, మంగళవారం

సత్త్వానురూపా సర్వస్య శ్రద్ధా - ...17 - 3...//...యజన్తే సాత్త్వికా దేవాన్యక్ష- , , .17 -4,,,//.....సప్తదశోధ్యాయము - శ్రద్ధాత్రయవిభాగయోగము

0 comments

జైశ్రీరామ్.

|| 17-3 ||

శ్లో.  సత్త్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత|

శ్రద్ధామయోయం పురుషో యో యచ్ఛ్రద్ధః ఏవ సః. || 

తే.గీవ్యక్తియొక్క స్వభావంబుననుసరించి

శ్రద్ధయుండును మనుజులన్, శ్రద్ధ నొప్పు

నతడు నిరతంబు, శ్రద్ధయునతులితముగ

నొప్పునెట్టిదోవ్యక్తిత్వమొప్పునటులె.

భావము.

అర్జునా! ప్రతివారిలోను వ్యక్తి యొక్క స్వభావాన్ని అనుసరించి అతని శ్రద్ధ ఉంటుంది

మానవుడు శ్రద్ధా మయుడు. ఎవరి శ్రద్ధ ఎటువంటిదో వాళ్ళ వ్యక్తిత్వం అటువంటిది ఔతుంది.

|| 17-4 ||

శ్లోయజన్తే సాత్త్వికా దేవాన్యక్షరక్షాంసి రాజసాః|

ప్రేతాన్భూతగణాంశ్చాన్యే యజన్తే తామసా జనాః. ||

తే.గీదేవతల గొల్చు సాత్వికుల్ దివ్యముగను,

రాజసికులింక యక్షులన్ రాక్షసులను,

తామసికపాళి భూతప్రేతముల గొలుచు,

నీవు గ్రహియింపుమర్జునా నేర్పు మీర.

భావము.

సాత్వికులు దేవతలను, రాజసికులు యక్షరాక్షసులను, తామసికులు 

భూత ప్రేత గణాలను ఆరాధిస్తారు.

జైహింద్.

12, డిసెంబర్ 2022, సోమవారం

శ్రీ ఆంధ్ర రఘువంశము e-book రచన... ఆలమూరు వెంకటాచలము

0 comments

 జై శ్రీరామ్.

ఆలమూరు వీర రాజు వ్రాయునది.

ఆర్యా, మీకు  అభివాదము.



మా తండ్రి గారు  ఆలమూరు వెంకటాచలము రచించిన 

శ్రీ ఆంధ్ర రఘువంశము" - పద్య కావ్యము e-book 

Dr. DIVAKARLA VENKATAVADHANI

Dr. K.V.R. NARASIMHAM M.A. Ph.D.,

Prof. G.J.Somayaji, Vidwan M.A. LT

వారి పరిచయముతో  1981 లో ప్రచురితమై, 

K. HANUMANTHA RAO. M.Pharm, Ph.D.   గారిచే పరిష్కృతమై 

1993 రెండవ ముద్రణ పొందినది.

మాచే వ్రాయబడిన సులభ టీకతో ఉచిత  e-book. ను 

ఈ క్రింది లింకు ద్వారా దిగుమతి చేసికొన ఏర్పాటు చేసితిమి.

https://archive.org/details/sree-andhra-raghuvamsamu

ఈ సౌకర్యమును ఉపయోగించు కొని  మాతండ్రి గారి 

పుస్తకమును చదివి ఆనందింతురని ఆకాంక్ష! 

మీకు తెలసిన సహృదయులకు కూడ పంచమని/ 

మాకు తెలియపరచమని  మా మనవి.

మీ సలహా / అభిప్రాయము తెలియచేయ ప్రార్థన.

నమస్కారము 

ఆలమూరు వీర రాజు

9666378002

ఆలమూరు ఉమాదేవి.

9052898646

https://archive.org/details/sree-andhra-raghuvamsamu/mode/1up?view=theater

URL ను కాపీ పేష్ట్  చెయ్యండి.

జై హింద్

11, డిసెంబర్ 2022, ఆదివారం

అన్నపూర్ణే సదాపూర్ణే.....మాతా చ పార్వతీ దేవీ..... పద్యభావములు...... మేలిమి బంగారం నా సంస్కృతి.

0 comments

జైశ్రీరామ్.

శ్లో.  అన్నపూర్ణే సదాపూర్ణే!  -  శంకర ప్రాణవల్లభే!  

జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం!  -  భిక్షాం దేహీ చ పార్వతీ!

తే.గీ. అన్నపూర్ణ! సదాపూర్ణ! యమర వినుత!

శంకరప్రాణ వల్లభా! సరసిజాక్షి!

జ్ఞాన వైరాగ్యములు మాలుఁ గలుగఁ జేయ

పార్వతీ! భిక్షనొసగుమ, ప్రణుతులమ్మ!

భావము. అన్నపూర్ణాదేవీ! ఓ సదాపూర్ణ స్వరూపిణీ! దేవతలచే 

ప్రశంసింపఁబడు ఓ తల్లీ! శివంకరుఁడయిన శంకరుని ప్రాణేశ్వరీ! 

నాకు హ్ఞానవైరాగ్యములు సిద్ధించుట కొరకు భిక్షను 

ప్రసాదించుమమ్మా!

శ్లో.  మాతా చ పార్వతీ దేవీ  -  పితా దేవో మహేశ్వరః!

బాంధవా శ్శివభక్తాశ్చ   -  స్వదేశో భువన త్రయమ్.

తే.గీ. పార్వతీమాత నా మాత! భక్త సులభ,

శివుఁడు నా తండ్రి, మెదలు నా చిత్తమందు,

వరలు  శివ భక్తులే నాకు బంధువులిల,

నా నివాసంబు గన భువనత్రయంబు. 

భావము.  నాతల్లి పార్వతీమాత. నా తండ్రి మహేశ్వరుఁడు. 

శివభక్తులే నా బంధువులు.  ముల్లోకములూ నా నివాస స్థానము.

జైహింద్.

మాడుగుల నాగఫణి శర్మ గారిపై ....నామ, భావ గోపన చిత్రశార్దూలము.

0 comments

 

జైశ్రీరామ్.


జైహింద్.

9, డిసెంబర్ 2022, శుక్రవారం

శ్రీకాకుళంలో 2022 డిశంబరు 16 - 17 - 18 తేదీలలో చిరంజీవి గన్నవరం లలితాదిత్య సంపూర్ణ శతావధానం.

0 comments

 జైశ్రీరామ్.

జైహింద్.

యే శాస్త్రవిధిముత్సృజ్య - ...17 - 1...//...త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం- , , .17 -2,,,//.....సప్తదశోధ్యాయము - శ్రద్ధాత్రయవిభాగయోగము

0 comments

 జైశ్రీరామ్.

సప్తదశోధ్యాయః - శ్రద్ధాత్రయవిభాగయోగః

అర్జున ఉవాచ|  

భావము.

అర్జునుడనుచున్నాడు.

|| 17-1 ||

శ్లో.  యే శాస్త్రవిధిముత్సృజ్య యజన్తే శ్రద్ధయాన్వితాః|  

తేషాం నిష్ఠా తు కా కృష్ణ సత్త్వమాహో రజస్తమః.

తే.గీ. శాస్త్రమును వీడి, నిన్నె తా శ్రద్ధతోడ

కొలువ నాసేవ యేమగు కూర్మి జెపుమ

సాత్వి కమొతామసమొరాజసంబొ కృష్ఢ! 

తెలుయ జెప్పుమునాకీవు దివ్య తేజ!

భావము.

కృష్ణా! ఎవరైనా శాస్త్ర విధిని వదిలిపెట్టి శ్రద్ధతో ఆరాధిస్తే వాళ్ళ నిష్ట ఎలాంటిది?

సాత్వికమా, రాజసికమా, తామసికమా?

శ్రీభగవానువాచ|

భావము.

శ్రీ భగవానుడనుచున్నాడు.

|| 17-2 ||

శ్లో.  త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా|

సాత్త్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు.

తే.గీ. శ్రద్ధ సత్వరజస్తమ రమ్య తేజ

ములను మనుజుల నుండును, పుట్టినపుడె

యుండునవి నీవెరింగిననొప్పిదముగ

నీవు గ్రహియింపుమర్జునా! నేర్పు మీర.

భావము.

మనుష్యుల శ్రద్ధ సాత్వికము, రాజసికము, తామసికము అని మూడు విధాలుగా 

ఉంటుంది.  అది స్వభావం నుండి జనిస్తుంది. వాటిని గురించి విను.

జైహింద్

8, డిసెంబర్ 2022, గురువారం

యః శాస్త్రవిధిముత్సృజ్య - ...16 - 23...//....ఏతైర్విముక్తః కౌన్తేయ తమోద్వారై- , , .16 -24,,,//.....దైవాసురసమ్పద్విభాగయోగఃము.

0 comments

జైశ్రీరామ్.

 || 16-23 ||

శ్లో.  యః శాస్త్రవిధిముత్సృజ్య వర్తతే కామకారతః|

న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిమ్.

తే.గీ.  కోరికలు పెచ్చి శాస్త్రమున్ దూరి దురిత

వర్తులిల కార్య విఫలులై బాధితులగు,

సుఖము, పరగతి దూరమౌచు వెతలందు,

చుందురో యర్జునా!మది యందు కనుము.

భావము.

తన కోరికల కారణంగా శాస్త్రాన్ని ఉల్లంఘించి ప్రవర్తించిన వాడు 

కార్యసిద్ధిని పొందడు. సుఖాన్ని పరమగతిని కూడా పొందడు.

|| 16-24 ||

శ్లో.  తస్మాచ్ఛాస్త్రం ప్రమాణం తే కార్యాకార్యవ్యవస్థితౌ|

జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తుమిహార్హసి.

తే.గీ.  శాస్త్రమాధారమిచ్చట చక్కగగొని

మంచి త్రోవలో నడచిన మంచి జరుగు,

శాస్త్రమును గాంచి వర్తించ చక్కగాను

ముక్తిమార్గంబు నందుట పొసగు పార్థ!

భావము.

అందుచేత కర్తవ్యాన్ని, అకర్తవ్యాన్నినిర్ధారించుకోవడానికి శాస్త్రం ప్రమాణం. 

శాస్త్రం చెప్పిన విధిని తెలుసుకుని ఇక్కడ నీవు కర్మ చెయ్యడం మంచిది.

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు

బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే

దైవాసురసమ్పద్విభాగయోగో నామ షోడశోऽధ్యాయః.

జైహింద్.

తే. 07 - 12 - 2022 న పటేల్నగర్ కమ్యూనిటీ హాల్ లో జరిగిన కవిశ్రీ సప్తతి ఉత్సవ సందర్భముగా గురుపూజలో శ్రీ కందిశంకరయ్య దంపతులకు మాకు జరిగిన సత్కార చిత్రములు.

0 comments

జైశ్రీరామ్.

తే. 07 - 12 - 2022 న పటేల్నగర్ కమ్యూనిటీ హాల్ లో జరిగిన కవిశ్రీ సప్తతి ఉత్సవ సందర్భముగా గురుపూజలో శ్రీ కందిశంకరయ్య దంపతులకు మాకు జరిగిన సత్కార చిత్రములు.

జైహింద్.

6, డిసెంబర్ 2022, మంగళవారం

త్రివిధం నరకస్యేదం ద్వారం - ...16 - 21...//....ఏతైర్విముక్తః కౌన్తేయ తమోద్వారై- , , .16 -22,,,//.....దైవాసురసమ్పద్విభాగయోగఃము.

0 comments

జైశ్రీరామ్.

 || 16-21 ||

శ్లో.  త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః|

కామః క్రోధస్తథా లోభస్తస్మాదేతత్త్రయం త్యజేత్.

తే.గీ. ఆత్మనాశనహేతువు లరయ మూడు

కామమున్క్రోధలోభముల్, కాన నరుడు

విడువగావలె మూడిటిన్, విజ్ఞత గలి

గి, కను మర్జునా సత్యంబు ప్రకటితమవ.

భావము.

ఆత్మ నాశనానికి దారి తీసే నరక ద్వారాలు మూడు-కామం, క్రోధం, 

లోభం. అందుచేత ఈ మూడింటిని త్యజించాలి.

|| 16-22 ||

శ్లో.  ఏతైర్విముక్తః కౌన్తేయ తమోద్వారైస్త్రిభిర్నరః|

ఆచరత్యాత్మనః శ్రేయస్తతో యాతి పరాం గతిమ్.

తే.గీ.  నరకమార్గ మీ మూటిని నరుడు విడువ

శ్రేయమునుగొల్పు కర్మలే చేయుచుండు,

పరమగతిపొందునాతడు నరకము విడి

నీవు గ్రహియింపుమర్జునా నేర్పు మీర.

భావము.

కౌంతేయా! నరక ద్వారాలైన ఈ కామ క్రోధ లోభాలు మూడింటి నుండి 

విడుదల పొందిన నరుడు, తనకు శ్రేయస్సును కలిగించే కర్మలు చేస్తాడు. 

దాని వలన పరమగతిని పొందుతాడు.

జైహింద్.

5, డిసెంబర్ 2022, సోమవారం

శతావధాని శ్రీ ఆముదాల మురళి గారి 199వ అష్టావధానం||అవధాన విద్యా వికాస పరిషత్, భాగ్యనగరం

0 comments

జైశ్రీరామ్.

నిన్న జరిగిన శ్రీ ఆముదాల మురళి అష్టావధానంలోతెలంగాణారాష్ట్ర తెలుగు అధికార భాషా సంఘ అధ్యక్షురాలు శ్రీమతి మంతి శ్రీదేవిగారు,శ్రీయుతులు మరుమామల సహీదరులు చేసిన సత్కారం. నేను ఛందోభాషణం నిర్వహించాను.

జైహింద్.

29, నవంబర్ 2022, మంగళవారం

సంస్కృతములో పుష్పముల పేర్లు.

0 comments

జైశ్రీరామ్. 

సంస్కృతంలో పుష్పాల పేర్లు:

1.సేవంతికా = చామంతి
2.సూర్యకాంతి: = పొద్దుతిరుగుడు
3.మాలతీ = మాలతీ
4.వకులం = పొగడ
5.కమలం = తామర
6.జపా = మందార
7.జాతీ = జాజి
8.నవమల్లికా = విరజాజి
9.పాటలం = గులాబీ
10.నక్షత్ర సేవంతికా = నక్షత్ర చేమంతి
11.కురవకం = గోరింట
12.ప్రతాపన: = తెల్లమందారం
13.శిరీషం = దిరిశెన పువ్వు
14.ఉత్పలం = కలువపువ్వు
15.అంభోజం = తామర
16.సితాంభోజం = తెల్ల తామర
17.కుశేశయం = నూరు వరహాలు
18.కరవీరం = గన్నేరు
19.నలినం = లిల్లీ
20.శేఫాలికా = వావిలి
21.కుందం = మల్లె
22.అంబష్టం = అడివి మల్లె
23.జాతీ సుమం = సన్న జాజి
24.గుచ్చ పుష్పం = బంతి
25.కేతకీ = మొగలి
26.కర్ణికారం = కొండ గోగు
27.కోవిదారం = దేవకాంచనము
28.స్థలపద్మం = మెట్ట తామర
29.బంధూకం = మంకెన
30.కురంటకం = పచ్చ గోరింట
31.పీత కరవీరం = పచ్చ గన్నేరు
32.గుచ్చ మందారం = ముద్ద మందారం
33.చంపకం = సంపెంగ
34.పున్నగం = పొన్న పువ్వు
35.పుష్ప మంజరీ = పూలవెన్ను
36.అర్క = జిల్లేడు
37. నంద్యావర్తనం = నందివర్ధనం
38. బృహతీ = వాకుడు
39. ద్రోణ = తుమ్మిపూలు.
జైహింద్.

27, నవంబర్ 2022, ఆదివారం

అవధాన విద్యావికాస పరిషత్ శిక్షణ శిబిరం|| వారగణనం పై అష్టావధాని శ్రీ ముద్దురాజయ్య.

0 comments

జైశ్రీరాం.
జైహింద్.

26, నవంబర్ 2022, శనివారం

"ర"కీ "ఱ"కి మధ్య తేడా ఏమిటి? .....ద్వా.నా. శాస్త్రి గారు

0 comments

జైశ్రీరామ్.

అరసున్న [ ఁ ], బండి ' ఱ 'లు ఎందుకు?

అరసున్న, బండి ' ఱ 'లు నేటిభాషలో దాదాపుగా వాడుకలో లేవు. అలా చేసారు మన ఆధునిక భాషా వేత్తలు. తెలుగుకు పట్టిన దుర్గతి ఇది. అయితే, ఇవి తెలుగు భాషకి ప్రత్యేకమైనవి. తెలుగు భాషా లక్షణాన్ని నిరూపించేవి. అంతేకాదు- కావ్యభాషలోను, లక్షణ శాస్త్రంలోను వీటి ప్రాముఖ్యం చాలావుంది. కానీ వీటిగురించి తెలుగువాడు తెలుసు కోవాలిగదా! మన భాషా సంపదలో ఇవీ భాగస్వాములే అని గ్రహించాలి గదా! అరసున్న( ఁ ) , ఱ- ల వల్ల అర్థభేదం ఏర్పడుతుంది. పదసంపదకి ఇవి తోడ్పడతాయి. ఎలాగో చూడండి:

అరుఁగు = వీధి అరుగు

అరుగు = వెళ్ళు, పోవు

అఱుగు = జీర్ణించు

ఏఁడు = సంవత్సరం

ఏడు = 7 సంఖ్య

కరి = ఏనుగు

కఱి = నల్లని

కాఁపు = కులము

కాపు = కావలి

కాఁచు = వెచ్చచేయు

కాచు = రక్షించు

కారు = ఋతువు, కాలము

కాఱు = కారుట (స్రవించు)

చీఁకు = చప్పరించు

చీకు = నిస్సారము, గ్రుడ్డి

తఱుఁగు = తగ్గుట, క్షయం

తఱుగు = తరగటం(ఖండించటం)

తరి = తరుచు

తఱి = తఱచు

తీరు = పద్ధతి

తీఱు = నశించు, పూర్తి(తీరింది)

దాఁక = వరకు

దాక = కుండ, పాత్ర

నాఁడు = కాలము

నాడు = దేశము, ప్రాంతము

నెరి = వక్రత

నెఱి = అందమైన

నీరు = పానీయం

నీఱు = బూడిద

పేఁట = నగరములో భాగము

పేట = హారంలో వరుస

పోఁగు - దారము పో( గు

పోగు = కుప్ప

బోటి = స్త్రీ

బోఁటి = వంటి [నీబోఁటి]

వాఁడి = వాఁడిగా గల

వాడి = ఉపయోగించి

వేరు = చెట్టు వేరు

వేఋ = మరొకవిధము

మడుఁగు = వంగు, అడఁగు

మడుగు = కొలను, హ్రదము

మొదలైనవీ ఉన్నాయి.

అయినా తెలుగు భాషను నాశనం చేస్తున్న కాలం .
జైహింద్.

11, నవంబర్ 2022, శుక్రవారం

అవధాన విద్యావికాస పరిషత్ శిక్షణ శిబిరం...శతావధాని శ్రీ ఆముదాల మురళి గారి సూచనలు...

0 comments

జైశ్రీరామ్.
చక్కని సూచనల్ మురళి సన్నుతరీతినొసంగినారు. బల్
మక్కువతోడ వింటిని, సమంచితసన్నుత మార్గదర్శిగా
నిక్కము వీరు నిల్చిరి, మనీషులు మెచ్చెడి సూచనాళి పెం
పెక్క సుశిక్షకాళి విని పేరుగందించు వధానరంగమున్.
జైహింద్.

తానహం ద్విషతః క్రురాన్సం - ...16 - 19...//....ఆసురీం యోనిమాపన్నా - , , .16 -20,,,//.....దైవాసురసమ్పద్విభాగయోగఃము.

0 comments

 జైశ్రీరామ్.

 || 16-19 ||

శ్లో.  తానహం ద్విషతః క్రురాన్సంసారేషు నరాధమాన్|

క్షిపామ్యజస్రమశుభానాసురీష్వేవ యోనిషు.

తే.గీ.  నన్ను దూషించు కౄరులన్, నాదుభక్తు

ల నిల ద్వేషించునామూర్ఖులన్ గణించి

యాసురీయోనులన్ బుట్ట  నమరజేసి

శిక్షగొలుపుదు శిష్టుల రక్షణకని.

భావము.

ఇలా నన్ను ద్వేషించే కౄరులు, దుష్టులు, నరాధములను నిత్యమూ 

నేను అసురీ యోనుల్లోకి విసిరేస్తాను.

|| 16-20 ||

శ్లో.  ఆసురీం యోనిమాపన్నా మూఢా జన్మని జన్మని|

మామప్రాప్యైవ కౌన్తేయ తతో యాన్త్యధమాం గతిమ్.

తే.గీ. ఆసురీయోనిజుల్ నన్ను నరయ లేక

జన్మజన్మలకును నీచ జన్మలెత్తు,

పాపపంకిల జన్ములై పాపకూప

ముననె కృంగుచునుందురు వినుము పార్థ!

భావము.

అర్జునా! అసురీ జన్మను పొందిన మూర్ఖులు ప్రతి జన్మలోను నన్ను 

చేరకుండానే ఇంకా అధోగతికి పోతారు.

జైహింద్.

10, నవంబర్ 2022, గురువారం

భరత స్వాతంత్ర్య వజ్రోత్సవాలలో రవీంద్రభారతిలో చింతా శ్రీవిజయలహరి, మాన్వి...

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

ఆత్మసమ్భావితాః స్తబ్ధా - ...16 - 17...//....అహంకారం బలం దర్పం - , , .16 -18,,,//.....దైవాసురసమ్పద్విభాగయోగఃము.

0 comments

 జైశ్రీరామ్

|| 16-17 ||

శ్లో.  ఆత్మసమ్భావితాః స్తబ్ధా ధనమానమదాన్వితాః|

యజన్తే నామయజ్ఞైస్తే దమ్భేనావిధిపూర్వకమ్.

తే.గీ.  యసురులాత్మస్తుతులు మూర్ఖు లసమదృష్టు

లరయదంబ,ధనమదాంధులనవరతము

నామమాత్రపు యజ్ఞ ముల్ భూమిజేయు

చుందు రనుపమ మూర్ఖులై మందభతులు.

భావము.

తమని తాము మెచ్చుకునే వాళ్ళు, మొండి వారు ధన మాన మదాలతో 

కూడుకుని, గుడ్డి వాళ్ళై దంభం కోసం శాస్త్ర పద్ధతిని వర్ణించి నామమాత్రంగా 

యజ్ఞాలు చేస్తారు.

|| 16-18 ||

శ్లో.  అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః|

మామాత్మపరదేహేషు ప్రద్విషన్తోऽభ్యసూయకాః.

తే.గీ.  దర్ప బలముల నహమును, ధాత్రి క్రోధ

కామముల నాశ్రయించి, గర్వమొంది,

యంతటన్గలనన్ దిట్టు నట్టివాని

ఆసురంబగు యోనుల నమర విడుతు.

భావము.

అహంకారాన్ని, బలాన్ని, దర్పాన్ని, కామ క్రోధాలను ఆశ్రయించుకొని, 

తమలోను, ఇతరులలోను ఉన్న నన్ను ద్వేషించే కౄరులు, దుష్టులు 

నరాధములను నేను నిత్యము అసురీ యోనుల్లోకి విసిరేస్తాను.

జైహింద్.

9, నవంబర్ 2022, బుధవారం

ఆఢ్యోభిజనవానస్మి కోన్యోస్తి - ...16 - 15...//....అనేకచిత్తవిభ్రాన్తా - , , .16 -16,,,//.....దైవాసురసమ్పద్విభాగయోగఃము.

0 comments

 జైశ్రీరామ్.

|| 16-15 ||

శ్లో.  ఆఢ్యోభిజనవానస్మి కోన్యోస్తి సదృశో మయా|

యక్ష్యే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞానవిమోహితాః.

తే.గీ.  నేను ధనికుడనుకులీను నేనె ఘనుడ,

యజ్ఞ ముల్జేయుదున్, దానమాచరింతు

ననుచు మూర్ఖుడై పతనంబు గనునతండు

రాక్షసములక్షణంబిది, శిక్షితుడగు.

భావము.

నేను ధనవంతుణ్ణి, కులమున్న వాడిని, నాకు సమానులు ఎవరున్నారు?

యజ్ఞం చేస్తాను. దానాలిస్తాను, సంతోషిస్తాను ఇలా అజ్ఞానంతో 

భ్రాంతి చెందుతారు.

|| 16-16 ||

శ్లో.  అనేకచిత్తవిభ్రాన్తా మోహజాలసమావృతాః|

ప్రసక్తాః కామభోగేషు పతన్తి నరకేऽశుచౌ.

తే.గీ. అంతు లేని తలపులతో, భ్రాంత చిత్తు

లగుచు నజ్ఞానమున జిక్కి, యంతులేని

కామభోగాలచే నరకమునబడుచు

హేయముగ నాసురులు భువి మాయదగులు.

భావము.

అనేక రకాల ఆలోచనలతో భ్రాంత చిత్తులై అజ్ఞానపు వలలో చిక్కుకొని, 

కామభోగాలలో మరులుగొని అపవిత్రమైన నరకంలో పడతారు.

జైహింద్.

8, నవంబర్ 2022, మంగళవారం

ఇదమద్య మయా లబ్ధ - ...16 - 13...//....ఆశాపాశశతైర్బద్ధాః కామ - , , .16 -14,,,//.....దైవాసురసమ్పద్విభాగయోగఃము.

0 comments

 జైశ్రీరామ్.

|| 16-13 ||

శ్లో.  ఇదమద్య మయా లబ్ధమిమం ప్రాప్స్యే మనోరథమ్|

ఇదమస్తీదమపి మే భవిష్యతి పునర్ధనమ్.

తే.గీ. పెరుగుచున్నట్టి కోర్కెలన్ పెచ్చురేగి

పాపముల్జేయుచుందురు భ్రష్టులగుచు,

దుష్టసంపాదనాసక్తితోడ చెడుచు

రాక్షసంబునన్ నశియింత్రు రక్ష లేక.

భావము.

ఈ రోజు ఇంత సంపద నాకు లభించింది. ఈ కోరికలని తీర్చుకుంటాను. 

ఇంత ధనం నాకుంది. ఇక ముందు ఇంకా ఇంత ధనం వస్తుంది.

|| 16-14 ||

శ్లో.  అసౌ మయా హతః శత్రుర్హనిష్యే చాపరానపి|

ఈశ్వరోహమహం భోగీ సిద్ధోహం బలవాన్సుఖీ.

తే.గీ. శత్రువులజంపినాడను,చంపుదన్యు

లనిలనింక దైవంబేనె, యని రహింతు

రన్నియున్ నేనె యని ఖలులెన్ని గనుచు

పాపవర్తులై చెడుదురు పాండు తనయ!

భావము.

ఈ శత్రువు నాచే చంపబడినాడు, ఇతరులను కూడా చంపేస్తాను. నేను 

ఈశ్వరుణ్ణి, భోగిని, సిద్ధుణ్ణి, బలవంతుణ్ణి, సుఖిని.

జైహింద్.

7, నవంబర్ 2022, సోమవారం

చిన్తామపరిమేయాం చ ప్రలయా - ...16 - 11...//....ఆశాపాశశతైర్బద్ధాః కామ - , , .16 -12,,,//.....దైవాసురసమ్పద్విభాగయోగఃము.

0 comments

 జైశ్రీరామ్.

|| 16-11 ||

శ్లో.  చిన్తామపరిమేయాం చ ప్రలయాన్తాముపాశ్రితాః|

కామోపభోగపరమా ఏతావదితి నిశ్చితాః.

తే.గీ.  కామభోగంబులవధిగా కలుగువారు,

జన్మకడదాక పాపులై జగతిమెలగి

నరకమును చేరుచుందురాసురగుణులిల

నీవు గ్రహియింపుమర్జునా నేర్పు మీర.

భావము.

వాళ్ళు మరణించే వరకు అపరిమితములైన యోచనలలో మునిగి తేలుతూ, 

కామ భోగాలు తప్ప జీవితానికి వేరే లక్ష్యం లేదని నిశ్ఛయించుకున్న వాళ్ళు.

|| 16-12 ||

శ్లో.  ఆశాపాశశతైర్బద్ధాః కామక్రోధపరాయణాః|

ఈహన్తే కామభోగార్థమన్యాయేనార్థసఞ్చయాన్.

తే.గీ. అంతులేనట్టి యాశలనలమటింత్రు,

కామమునకును వశులయి భూమిపైన

ధనము కామాదులకునయి తగలబెట్టు

చుందుర్జునా! లేకయే ముందుచూపు.

భావము.

వాళ్ళు వందలాది ఆశా పాశాలతో కట్టుబడి, కామక్రోధాలకు వశులై 

తమ కామభోగానికిగాను, అన్యాయంగానైనా సరే సంపదలను 

సమకూర్చుకోవాలని అనుకుంటారు.

జైహింద్.

6, నవంబర్ 2022, ఆదివారం

ఏతాం దృష్టిమవష్టభ్య - ...16 - 9...//....కామమాశ్రిత్య దుష్పూరం - , , .16 -10,,,//.....దైవాసురసమ్పద్విభాగయోగఃము.

0 comments

 జైశ్రీరామ్

|| 16-9 ||

శ్లో.  ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మానోల్పబుద్ధయః|

ప్రభవన్త్యుగ్రకర్మాణః క్షయాయ జగతోऽహితాః.

తే.గీ.  ఇట్టి దుర్భావపూర్ణులై కౄరగతిని

ధర్మదూరులై పాపులై ధరణిపైన

మంచినణచుచు వంచనన్ మసలుచుందు

రాసురంబున చెడుచుంద్రు ధీసమేత!

భావము.

ఈ దృష్టినే పట్టుకుని వేలాడుతూ వీళ్ళు ధర్మ భ్రష్టులై సంకుచిత బుద్ధులై, 

ప్రపంచానికి శత్రువులై, కౄరకర్ములై లోక నాశనం కోసం పుడతారు.

|| 16-10 ||

శ్లో.  కామమాశ్రిత్య దుష్పూరం దమ్భమానమదాన్వితాః|

మోహాద్గృహీత్వాసద్గ్రాహాన్ప్రవర్తన్తేశుచివ్రతాః.

తే.గీ.  తృప్తిచెందనం తాశలో తేలుచుంద్రు

దంభ, మాన, మదంబులన్, దారి తప్పి 

సత్యదూరమౌ మిధ్యపై సతము మసలి

పాపవర్తులై చెడుదురు లోపమదియె.

భావము.

వాళ్ళుతృప్తి పరచడానికి వీలులేనంత కోరికలను పెట్టుకొని దంభ, మాన, 

మదాలతో నిండి, భ్రాంతి వలన అసత్యమైన వాటి వెంట అనాచారంగా 

ప్రవర్తిస్తారు.

జైహింద్.

5, నవంబర్ 2022, శనివారం

ప్రవృత్తిం చ నివృత్తిం చ - ...16 - 7...//....అసత్యమప్రతిష్ఠం తే - , , .16 -8,,,//.....దైవాసురసమ్పద్విభాగయోగఃము.

0 comments

 జైశ్రీరామ్.

|| 16-7 ||

శ్లో.  ప్రవృత్తిం చ నివృత్తిం చ జనా న విదురాసురాః|

న శౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్యతే.

తే.గీ.  నిజమిది ప్రవృత్తిని నివృత్తిని నసురగుణు

లెరుగ, రిల శౌచమాచార మెరుగబోరు,

సత్యదూరులై యుందురు సతతమిలను,

నీవు గ్రహియింపుమర్జునా!  నేర్పు మీర.

భావము.

అసుర స్వభావం కలవారు ప్రవృత్తిని కాని నివృత్తిని గాని ఎరుగరు. వాళ్ళలో 

శౌచమూ, ఆచారమూ, సత్యమూ ఉండవు.

|| 16-8 ||

శ్లో.  అసత్యమప్రతిష్ఠం తే జగదాహురనీశ్వరమ్|

అపరస్పరసమ్భూతం కిమన్యత్కామహైతుకమ్.

తే.గీ.  జగతి మిధ్యని యిది సహజంబటంచు,

కామమే సృష్టిమూలమై కలిగెననుచు,

పాపపుణ్యధర్మంబులే వరలవనుచు

నసుభావులు తలచెదరనుమముగ.

భావము.

జగత్తు మిధ్య అనీ, దానికి ధర్మా ధర్మాలు ఆధారము ఉండవని, ఈశ్వరుడే 

లేడనీ ఈ ప్రపంచములోని ప్రాణులు స్త్రీ పురుషుల కలయిక వలననే 

పుట్టినదనీ వారు అంటారు. అందుచేత ఈ జగత్తుకి కారణం కామమే 

అంటారు అసుర జనులు.

జైహింద్.

4, నవంబర్ 2022, శుక్రవారం

దైవీ సమ్పద్విమోక్షాయ - ...16 - 5...//....ద్వౌ భూతసర్గౌ లోకేస్మి - , , .16 -6,,,//.....దైవాసురసమ్పద్విభాగయోగఃము.

0 comments

 జైశ్రీరామ్

|| 16-5 ||

శ్లో.  దైవీ సమ్పద్విమోక్షాయ నిబన్ధాయాసురీ మతా|

మా శుచః సమ్పదం దైవీమభిజాతోऽసి పాణ్డవ.

తే.గీ.  మోక్షమిచ్చు దైవీయము పూర్తిగాను,

మహిత సంసార బంధంబు మహిని యసుర

మునను కల్గును మనలకు, వినుము పార్థ!

నీవు దైవాంశజుండవే, నిజము కనుమ.

భావము.

దైవీ సంపద మోక్షానికి, అసుర సంపద సంసార బంధానికి కారణం. అర్జునా! 

విచారించకు, నీవు దైవీ సంపదతోనే పుట్టావు

|| 16-6 ||

శ్లో.  ద్వౌ భూతసర్గౌ లోకేస్మిన్దైవ ఆసుర ఏవ చ|

దైవో విస్తరశః ప్రోక్త ఆసురం పార్థ మే శృణు.

తే.గీ.  దైవమాసురమన్రెండు  జీవకోటి

వరలు, దైవమున్ దెల్పితి, పరగు నసుర

విషయమరయుము తెలిపెద విపులగతిని.

యరసి వర్తింపుమా తగన్ నిరుపమాన!

భావము.

ఈ లోకంలో దైవం, అసురం అని ప్రాణుల సృష్టి రెండు రకాలు. దైవసృష్టిని 

గురించి విస్తారంగా చెప్పబడినది. అర్జునా! అసుర సృష్టి గురించివిను.

జైహింద్.

3, నవంబర్ 2022, గురువారం

ఈ రోజు సద్గురుమూర్తి శ్రీ యాజ్ఞవల్క్యమహామునుల జన్మ దినము. ఆ గురువులపాదాంబుజములకు సాష్టాంగప్రణామములు. Yagnavalka mangala harathi

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

దర్శనం శర్మ సుధీవరుని డా. అయాచితం నటేశ్వర శర్మ గారు చేసిన ప్రశంస ప్రత్యక్షర సత్యమే.

0 comments

జైశ్రీరామ్.

 దర్శనాభినందనము.

🍁🍁🍁🍁🍁🍁

సీ.  మరుమాములాన్వయమాణిక్యతేజమ్ము

దర్శనమ్మై నేడు ధరణి వెలిగె

వేంకటరమణుని విద్వత్ప్రభాదీప్తి

ధార్మికపథముగ దనరుచుండె

తత్త్వదర్శకులు విద్వత్కవీశ్వరులెల్ల

రచనలనందింప రాణకెక్కె

భారతీయాత్మను భాసిల్లజేసెడి

కార్యక్రమమ్ముల కాంతులీనె

తే.గీ.  ఇద్దిరా 'దర్శన'మ్మన నిల జనముల

కేది యావశ్యకము దాని ప్రోదిజేసి

పత్రికారూపమున దీర్చి వరలు ధర్మ

దర్శి వేంకటరమణుడు ధన్యజీవి !


అభినందనలతో.....

డా.అయాచితం నటేశ్వరశర్మ.

🍁🍁🍁🍁🍁🍁🍁

జైహింద్.

తేజః క్షమా ధృతిః శౌచమ - ...16 - 3...//....దమ్భో దర్పోభిమానశ్చ - , , .16 -4,,,//.....దైవాసురసమ్పద్విభాగయోగఃము.

0 comments

 జైశ్రీరామ్.

|| 16-3 ||

శ్లో.తేజః క్షమా ధృతిః శౌచమద్రోహో నాతిమానితా|

భవన్తి సమ్పదం దైవీమభిజాతస్య భారత.

తే.గీ.  తేజమోర్మియు దీక్షయు, దివ్య శుచియు,

ద్రోహచింతవిదూరత, మోహదూర

తయును, ద్వేషరాగవిదూరతయును, దైవ

లక్షణములు పార్థ! గ్రహించు, లక్ష్యమరసి.

భావము.

తేజస్సు, ఓర్మి, పట్టుదల, శుచిత్వం, ద్రోహచింతన లేకపోవడం, 

అభిమాన రాహిత్యం. . . అర్జునా! ఇవి దైవీ సంపదతో పుట్టిన 

వానికి కలుగుతాయి.

 || 16-4 ||

శ్లో.  దమ్భో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ|

అజ్ఞానం చాభిజాతస్య పార్థ సమ్పదమాసురీమ్.

తే.గీ.  దంభమభిమాన క్రోధముల్, దర్పము పరు

షతయు, నజ్ఞానమసుర, సహజలక్ష

ణములు, గ్రహియింపు మర్జునా! నయనిధాన!

దైవభావంబునన్ మెల్గ దగును మనము.

భావము.

అర్జునా! దంభం, దర్పం, అభిమానం, క్రోధం, పరుషత్వం, అజ్ఞానం. . . 

ఈ లక్షణాలు అసుర సంపదతో పుట్టిన వానికి కలుగుతాయి.

జైహింద్.

2, నవంబర్ 2022, బుధవారం

శ్రీ తోపెల్లబాలసుబ్రహ్మణ్యశర్మచే శ్రీమానం వైద్యం వేంకటేశ్వరాచార్యులు గారికి జరిగిన సత్కారం.

0 comments

కైశ్రీరామ్.
కైహింద్.

అభయం సత్త్వసంశుద్ధిర్జ్ఞా - ...16 - 1...//....అహింసా సత్యమక్రోధస్త్యాగః- , , .16 -2,,,//.....దైవాసురసమ్పద్విభాగయోగఃము.

0 comments

జైశ్రీరామ్ 

అథ షోడశోధ్యాయః - దైవాసురసమ్పద్విభాగయోగః.

శ్రీభగవానువాచ|

భావము.

శ్రీ భగవానుడనుచున్నాడు.

|| 16-1 ||

శ్లో.  అభయం సత్త్వసంశుద్ధిర్జ్ఞానయోగవ్యవస్థితిః|

దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవమ్.

తే.గీ.  

సత్వసిధ్యభయంబులు జ్ఞాన యోగ

మందునిలకడ, విజితేంద్రియమును, తపసు,

యజ్ఞమునుమరి యిలను స్వాధ్యాయమొకటి

వరనిజాయితీ, దేవునిభాగ్యతతియె.

భావము.

అభయం సత్వసుద్ధి జ్ఞానయోగంలో నిలవడం, ఇంద్రియ నిగ్రహం, 

యజ్ఞం, స్వాధ్యాయం, తపస్సు, నిజాయితీ(దైవీ పురుషుడికి కలుగుతాయి)

 || 16-2 ||

శ్లో.  అహింసా సత్యమక్రోధస్త్యాగః శాన్తిరపైశునమ్|

దయా భూతేష్వలోలుప్త్వం మార్దవం హ్రీరచాపలమ్.

తే.గీ.  శాంతమున్, సత్యమునహింస, చపల దూర

తయును, సిగ్గు, మృదుత్వమున్, ధరను కలుగు

టనుసులక్షణములుదైవమునకుకలుగు

నీవు గ్రహియాంపుమర్జునా నేర్పుమీర.

భావము.

అహింస, సత్యం, కోపము లేకపోవడం, మృదుస్వభావం, సిగ్గు, చాపల్యం లేకపోవడం.

జైహింద్.

1, నవంబర్ 2022, మంగళవారం

ఎవరు రాసి పాడారో తెలియదు కానీ.. పాటతో తెలుగు వ్యాకరణం ఫటాఫట్ నేర్చుకోవచ్చు👍

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

యో మామేవమసమ్మూఢో - ...15 - 19...//....ఇతి గుహ్యతమం శాస్త్రమిద- , , .15 -20,,,//.....పురుషోత్తమయోగము

0 comments

 జైశ్రీరామ్.

|| 15-19 ||

శ్లో.  యో మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమమ్|

స సర్వవిద్భజతి మాం సర్వభావేన భారత.

తే.గీ. అట్టి పురుషోత్తమునునన్నునరయువారు

కనగ సర్వజ్ఞులిద్ధరన్, కనుచు నన్ను 

పొంది సేవింపుదురునన్ను పూజ్యమీగను.

నీవు గ్రహియింపుమర్జునా నేర్పు మీర.

భావము.

అర్జునా! పురుషోత్తముడిని అయిన నన్ను ఈ విధముగా ఏ జ్ఞాని 

తెలుసుకుంటాడో, అతడు సర్వమూ తెలిసిన వాడై అన్ని విధములుగా నన్ను 

సేవిస్తాడు(పొందుతాడు).

|| 15-20 ||

శ్లో.  ఇతి గుహ్యతమం శాస్త్రమిదముక్తం మయానఘ|

ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్స్యాత్కృతకృత్యశ్చ భారత.

తే.గీ. గుహ్యతమమైన శాస్త్రంబు కోరి తెలిపి

యుంటి గ్రహియించు ధన్యులే యుత్తమోత్త

ములును కృతకృత్యులిద్ధర తెలియుమీవు,

చక్కనైనట్టి ములో జయముగనుము.

భావము.

భారతా! అలా గోప్యమైన ఈ శాస్తం నాచే చెప్ప బడినది. దీనిని అర్ధము 

చేసుకుంటే బుద్ధిమంతుడు కృతకృత్యుడు.

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు

బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే

పురుషోత్తమయోగో నామ పఞ్చదశోऽధ్యాయః22] 

పురుషోత్తమప్రాప్తి యోగము.

జైహింద్.