గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

17, సెప్టెంబర్ 2026, గురువారం

తే. 16 - 9 - 2026న శ్రీ నారాయణీ అవధానవేదిక కవిరాడ్వరేణ్య బిరుదుప్రదానము చేసి నన్ను సత్కరించిన సందర్భములో.....

జైశ్రీరామ్.

నన్ను సత్కరించిన అవధాని బైరపనేని పోతరాజు ఔదరీని నేను ప్రశంసించిన పద్యములు.

 శా.  శ్రీమన్మంగళ భావనా కలితుఁడై శ్రీయుక్త నారాయణీ

శ్రీమంతంబుగు వేదినే కొలిపి ధాత్రిన్ పోతరాజాఖ్యుఁడీ

ప్రేమోద్దీపిత సత్కృతిన్ గొలిపెనే విద్వన్మణుల్ మెచ్చగా

నీ మాన్యుండవధానిగాన్బిలుచు నా యీశాని సత్ ప్రేరణన్.


(అనేక కంద గీత గర్భ చంపక మాల.)

నుత ఘనుడై సదా నెనరు ధాత్రిని బైరపనేని చూపురా,

క్షితి కనుచుండురా కవుల చిద్ఘన తేజ సుగణ్యమూర్తిగా,

ధృతి మనుచున్ డునా సదవధాన నుతాత్ముల సంస్తుతించు తాన్,

నుతి గనుతన్ భువిన్, నుత తనుండననొప్పి వినోదమిచ్చుటన్.


గీ.  నెనరు ధాత్రిని బైరపనేని చూపు

కవుల చిద్ఘన తేజ సుగణ్యమూర్తి

సదవధాన నుతాత్ముల సంస్తుతించు

నుత తనుండననొప్పి వినోదమిచ్చు


క.  ఘనుడై సదా నెనరు ధా

త్రిని బైరపనేని చూపురా,క్షితి కనుచున్

మనుచున్ డునా సదవధా

న నుతాత్ముల సంస్తుతించు తాన్, నుతి గనుతన్.


క.  కనుచుండురా కవుల చి

ద్ఘన తేజ సుగణ్యమూర్తిగా,ధృతి మనుచున్

గనుతన్ భువిన్, నుత తనుం

డననొప్పి వినోదమిచ్చుటన్.నుత ఘనుడై


క.  గనుతన్ భువిన్, నుత తనుం

డననొప్పి వినోదమిచ్చుటన్.క్షితి కనుచుం

కనుచుండురా కవుల చి

ద్ఘన తేజ సుగణ్యమూర్తిగా,ధృతి మనుచున్.


ఉ.  బైరపనేని వంశజుఁడు భక్తుఁడు, సత్ కవి, పోతురాజు, సు

స్మేర ముఖాంబుజుండు, మతి చింతనఁ జేయుచునుండు దైవమున్,

సూరి నికాయమున్ గొలుచుచుండు సతంబునుతాత్ముఁడై, జనుల్

కోరి భజింతురీతనిని కూర్మిని జూపుచు ప్రేమమీరగన్.

జైహింద్. 

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.