గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, సెప్టెంబర్ 2026, గురువారం

19.అతి ధృతి ఛందము, (వెలసిన వృత్తములు,5,24,288.). ప్రాస నియమము కలదు, రచన:-వల్లభ వఝల అప్పల నరసింహ మూర్తి,

జై శ్రీరామ్.

 19.అతి ధృతి ఛందము,


                    (వెలసిన వృత్తములు,5,24,288.).

                        ప్రాస నియమము కలదు, 


                                             రచన:-వల్లభ వఝల అప్పల నరసింహ మూర్తి,

                                                                            జుత్తాడ,


1.ఆది శంకరా వృత్తము,


              ఆది శంకరా!యాత్మ బంధువా!అనయము నిన్నే!గొల్చెదన్!

             నాద బ్రహ్మవే!నాగ భూషణా!నరులను బ్రోచే!దేవరా!

             సాధు వర్తనన్!సత్య నిష్టకున్!జయమిడు!మల్లేశా!శివా!

             మది సర్వదా!గొల్చు భక్తుడన్!మనుకలి సౌఖ్యం బీయవా.


ఆది శంకరా వృత్తము,ర,య,జ,భ.స,త,గ,గణము లుండును,

యతి,11.వ,యక్షరము,వృ,సం:-146663.


2.మానవత్వ వృత్తము,


            శిష్టమైన విశిష్ట మదియే!శ్రేష్ట మాయె నేమొ?భూతలిన్!

            కష్ట కాలము నందు చెలిమిన్!కాన నౌను!ధరా తలిన్!

           ఇష్టమైన విధాన మదియే!హేమ పూర్ణ కుంభ సామ్యమౌ!

           భ్రష్ట తత్వము నీర్ష్య వలనన్!బాధ లొందు చుందు రెన్నడున్!


మానవత్వ వృత్తము,ర,స,స,త,ర,జ,గ,గణము లుండును,

యతి,11.వ,యక్షరము,వృ,సం:-174555.


3.విద్యే బుద్ధి వృత్తము,


            సాధ్య మసాధ్య యూహలకున్!సాధనమే!సమాదర మేర్చున్!

            బుధ్యనుకూల మేథ జనన్!బోధ్యమునౌ!వేద్యత! సర్వమ్!

            ఆధ్యము శోధనా పఠిమన్!హర్ష మనోజ్ఞత న్తుది జయదంబౌ!

           విద్యయె?బుద్ధి దోహదమౌ!విశ్వ సమోత్సుకం బొనరించున్!


విద్యే బుద్ధి వృత్తము,భ,ర,స,భ,భ,స,గ,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-109777.


4.విక్రమ వృత్తము,


          వక్ర బుద్ధి తగదేరికిన్!వర్ధితములు పాడు చేయు లే!

          చక్రి నైన గెలుతందువే?సత్వ రజ స్థముండ వీవయా!

           విక్రమించు!సుగుణాలచే!వేద పరిధి మీర కెన్నడున్!

           అక్రమార్క చరు లంటకన్!హర్ష మమరు!జీవ మందుమా!


విక్రమ వృత్తము,ర,న,ర,భ,స,జ,గ,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-179387.


5.వెరవెరుగు వృత్తము,


            వెర వెరిగి మసలుమా!విలు వెరిగి వరలు మోయీ!

            తెర వెరిగి నడచుమా!తెలివమర బ్రతుకు జీవా!

            పర మమరు తెరగునన్!పను లలర వలెను ధాత్రిన్!

           సుర వరదుల గొలుమా!సుగుణ ఖనివి!భువి గమ్మా!


వెర వెరుగు వృత్తము,న,న,స,న,న,స,గ,గణము లుండును,

యతి,10.వ,యక్రము,వృ,సం:-130810.


6.రత్న భారతి వృత్తము,


         వేద శాస్త్ర పురాణేతి హాస!భిషగ్రత్న మన భారతిన్!

        శోధ నీయ శుభోద్దామ!శస్త్ర సు మేథా నిథి! భూరమన్!

        ఆది నుండి పరాయీల చేత!యనంతంబుగ వేధిలన్!

        మేథ మాపి పరాశ్రాను కూల!మహత్వం బడు గంటెనే!


రత్న భారతి,ర,స,ర,స,భ,జ,గ,గణము లుండును,

యతి,11.వ,యక్షరము,వృ,సం:-180206.


7.జ్ఞాన భారతి,వృత్తము,


            స్రుతి నుత మతము' సుశ్రుత'-శోధ్య శస్త్ర శాస్త్ర సంపదల్!

            బ్రతుకు సుఖత''చెఱకు'ని-వైద్య శాస్త్ర  నేర్పు పెన్నిథిన్!

            ప్రతిగ నిలిచె ననగ!'కొరాను'-జన్యు శాస్త్ర మేభువిన్!

            మతి మత గరిమతపరమాణు శాస్త్ర '"బాబ"-కీర్తిలెన్!


జ్ఞాన భారతి వృత్తము,న,న,న,జ,ర,జ,గ,గణము లుండును,

యతి,11.వ,యక్షరము,వృ,సం:-175604.


8.నేర్పరనకు,వృత్తము,


            పరువు మాలి బ్రతుక బోకు!పాడు జనుల వీడు వడిన్!

           నెరవు గాని స్థలము. నందు!నేర్పరి ననరాదు సుమా!

            పరువు పెంచు నడత గల్గి!పల్వురు కొనియాడ బడన్!

            సరగు మోయి!తెలివి తోడ!సర్వము శుభ మౌను!భువిన్!


నేర్పరనకు,వృత్తము,న,భ,స,జ,న,భ,గ,గణము లుండును, 

యతి,11.వ,యక్షరము,వృ,సం:-228082.


9.మారెలోకం,వృత్తము,


     .    1.   తర తరాలు మారి పోయె!తనువు మనువు తీరు మారెన్!

                 స్థిరత లేని జీవ యాత్ర!చిరము గనని తెల్వి తీరున్!

                 కరము స్వార్థ చింత నిండె!కరుణ జగతి కాన దాయెన్!

                 చెరగ దాయె!వర్గ పోరు!చెరిగె!సమత స్వార్థ చింతన్!


       2.     తరుగు చుండు శ్రేయ మెల్ల!తరగక పెరిగేది! విద్యే?

               చెరగ నీకు నీతి ఖ్యాతి!చివరకు మిగిలేది?సున్నే!

               మెరుగు లెల్ల!పాలిపోవు!మిగులిల!పరువొండె!సుమ్మా!

                పిరికి వీడి పల్కు మంచి!పరులకు!నుప కారి!వౌమా!


మారె లోకం.వృత్తము,న,ర,జ,న,న,ర,గ,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-94630.


10.నెలమి దప్పు వృత్తము,


             సుథలు జిమ్ము వసుధకే!సొదలు గల్గె!నెందుకో?యనన్!

             బుధుల మాట జనులకే!బొడమె!స్వార్ధ మంచు నెంచగన్!

              విధుల నిర్వహణ మదే!నెలమి దప్పె!నేలనో?భువిన్!

              సొరలు జీవ సరళికే!శుభ గతెట్లు?యబ్బునో?రసన్!


నెలమి దప్పు వృత్తము,న,భ,స,న,ర,జ,గ,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-145864.


11.తప్పులెన్ను వృత్తము,


             దోష త్రయ భూషితుండెపో?తొలు తెంచు నితర తప్పులన్!

            వేషమున దోష మొప్పగా!వెలనైన స్థిమిత లేమిలన్!

             ఘోషిలు తనెంత వాడనో?కులుకేల?నిజము గానరే?

             కృషి గన దించు కేనియున్?గిలి గింత లిడును లోకమున్!


తప్పు లెన్ను వృత్తము,భ,జ,ర,స,న,జ,గ,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-194223.


12.పర హాని వృత్తము,


              పరహానే?పరమావధి!పరము తలపు పట్టదాయెన్

             నర హంతం ఘన మంచును!నడచు దుడుకు తుంటరౌచున్!

              చరమాంకంబున హింసిలు!సతత మహితచైద్య చేష్టన్!

              వర సౌమ్యంబనుమానమ్!వలను పడదు!ధన్య జీవమ్!


పర హాని వృత్తము,స,భ,భ,న,న,ర,గ,గణము లుండును,

యతి,10.వ,యతక్షరము,వృ,సం:-98202.


13.మూర్ఖతా వృత్తము,


             అండ దండ లుండెనం చిలన్?హరి గిరులను తూల నాడన్!

              మొండి మూర్ఖ తత్వ మెంచునే?ముదము గనని!మూర్ఖ తొప్పన్!

             తిండి లేని బీద వారినిన్!తిరిగి వెతకి!చంపు నీర్ష్యన్!

             ఛండ శాసనుండు ధాత్రినిన్!చివరి వరకు!ద్రోహ మెంచున్!


మూర్ఖతా వృత్తము,ర,జ,ర,న,న,ర,గ,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-97957.


14.అమానుష వృత్తము,


              కండ కావర మేల?నయ్యా!కాల గమన మాగ నౌనొకో?

              చొండి జీవన మెండ మావే?చూడ బ్రతుకదే?తెగున్వడిన్!

               పుండు కారము జల్లె దేలన్?పోదు విక నమానుషంబునన్!

               మండ నీయకు!మంచి నెల్లన్!మట్టి గలియగా!తలంతువే?


అమానుష వృత్తము,ర,స,య,భ,స,జ,గ,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-179181.


15.యోచిలు వృత్తము,


               తోడు నీడా!పాడుగోరగా!తొల్లి నీవే!పాడౌదు వెంచవే?

              మేడి పండౌ!జీవితంబగున్!మేటి గొప్పే తుప్పౌను!గానుమా!

              కాడి వీడే!రైతు తీరగున్!కాస్త యోచించేవా?దురంతకా!

             పాడి పంటా నిండు యోచనన్!పర్వ మేర్పన్?మార్పెంచు మంచినిన్!


యోచిలు వృత్తము,ర,త,ర,ర,మ,జ,గ,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-165027.


16.వాచాలతా వృత్తము,


             లేని పోని వాగ్దానా లవే?లేశ మేర్చె!భావి ప్రగతినిన్!

            కాని పోని వాచాలత్వమే!కల్ల లంటె!నిండు జగతినిన్!

            బాని సత్వ తీరేలా?యిలన్!పల్లవించే?స్వేచ్ఛ గను మయా!

             మానసత్వమేమాయే?నయా!మంచి పెంచు లోక సమతకున్!


వాచాలతా వృత్తము,ర,య,ర,ర,జ,న,గ,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-251037.


17.మిడిసి పడకు వృత్తము,


              ఏమి?జూచి మిడిసి పడెదు?యించుకైన మంచి నెంచకన్?

               పాములున్న జగమిదియని!పట్ట గోర!దిట్ట వౌదొకో?

               కామ క్రోధ మదము లవియె?కూడె!లోభ చింత మించగన్?

              రామ నామ మహిమ గనక!రాల నెంచు యూహ!తప్పగున్!


మిడిసి పడకు వృత్తము,ర,న,న,జ,ర,జ,గ,గణము లుండును,

యతి,11.వ,యక్షరము,వృ,సం:-174899.


18.విద్య ఘనత వృత్తము,


            తెలివి పెంచును విద్యయే!తెలిసి నేర్వుమి విద్య నేర్పున్!

            బలయుతుండగు మిత్రుడే?భవిత దీర్చెడి!భాగ్య రాశై!

            విలువ పెంచు నపారమున్?వినుతి గల్గును విశ్వ మందున్!

           పలుకు లమ్మయు రక్షయై!పరమ పావన తత్వ మేర్చున్!


విద్య ఘనత వృత్తము,న,భ,ర,న,భ,ర,గ,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-93874.


19.ఘన భారతి,వృత్తము,


              జ్ఞాన సీమ రత్న గర్భ!విశాలాక్షి యన్నపూర్ణ!వరాశ్రిన్!

             మౌని వర్య,వేద జ్ఞాన ప్రమాణాశ్రి!భారతాంబ వరామన్!

              దాన ధర్మ సత్య నిష్ట!నిధానంపు ధన్య గణ్య!శుభాశ్రిన్!

              మానవత్వ జన్మ దివ్యతమంబౌను!తెల్వి గల్గి మనంగన్!


ఘన భారతి వృత్తము,ర,జ,భ,త,ర,స,గ,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం;-108965.


20.నీతి నిరతి,వృత్తము,


             తల్లి భారతాంబ!బిడ్డలమ్!ధర్మ నీతి నిరతి మీరకన్!

            పల్లవింప సర్వ సామ్యతన్!పట్టు పట్టి ఘనత చాటగన్!

            చెల్ల నీక కీర్తి  సంపదల్! సర్వ మీశ్వరమను భావనన్!

            కొల్ల గొట్ట కన్య శ్రేయమున్!కూర్మి నొప్పు!భరత భూమినిన్!


నీతి నిరతి,వృత్తము,ర,జ,ర,ర,న,జ,గ,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-193707.


21.మానవతా వృత్తము,


              మను వారసులమ్!మానవులమ్!మనమంతా?యొకకటే నయా!

              మననన్!జననన్!సామ్య మవన్!మమతన్!భేద మదేల?నయా!

               కనవా సమతన్!కాదనకన్!కల తేలన్?గలిగింతు వయా!

               జను పూర్వ విధానాలమలున్!జగదైక్యంబది యేను సుమా!


మానవతా వృత్తము,స,స,భ,భ,త,జ,గ,గణము లుండును,

యతి,11.వ,యక్షరము,వృ,సం:-173608.


22.నిండు ప్రేమ వృత్తము,


            నిత్య నిర్మల మాటే సత్యమ్!నిండు ప్రేమను నీతి నింపునన్!

            కృత్య కర్మము ధర్మంబొ ప్పన్!క్షేమ మారయు జీవయాత్రవన్?

            సత్య దీక్షయె!నిచ్చుం మోక్షమ్!జాతి మేలదె!జన్మ సార్ధకమ్!

            ధృత్యమౌ సుమ జీవం భద్రమ్!దివ్య దీక్ష యదేను? మానవా!


నిండు ప్రేమ వృత్తము,ర,స,య,ర,స,జ,గ,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-159191..


23.భారతీయతా వృత్తము,


                 జాతి మతములు మేలు బంతై!సర్వ సామ్య మన స్తత్వతన్!

                ఖ్యాతి గనిన సు మేరు ధీరే!కర్మ సాక్షియె సౌమ్యంబునన్!

                జ్యోతిగను వెలుగిచ్చె!శ్రేయమ్!సోమ సుందర తేజం బిలన్!

                మాత ఘనతను చాట నౌనె?మంగళంబిదె!మేల్జేయులే?


భారతీయతా వృత్తము,భ,న,ర,త,భ,త,గ,గణము లుండును,

యతి,11.వయక్షరము,వృ,సం:-157827.


24.నియమం చర వృత్తము,


              తిండి బ్రతుకు కొఱకు గాని!తినుట కొఱకు బ్రతుకా!

              మండి పడకు వినుము కొంత!మసలు సమత మమతన్!

              నిండు బ్రతుకు సురభి వౌచు!నియమ నిరతి మనుమా!

               ఛొండి తనము పనికి రాదు!చొరుము నియత మమరన్!


నియమం చర వృత్తము,భ,న,స,జ,న,న,గ,గణము లుండును,

యతి,11.వ,యక్షరము,వృ,సం:-260857.


25.జన్మ సిద్ధాంత వృత్తము,


             మేడి పండు తుల్య దేహమున్!మేలెంచి పెంచి పోషిలం భువిన్!

            చీడ పీడ కోరి పొందుటే?చేతెంచు!మంచి చేష్టలం జనన్?

             పాడి యౌను మోక్ష గామివై!పర్మాత్ము నైక్య మెంచుమా!నరా!

             వీడి కర్మ చావు పుట్టుకల్!వేడంగ దైవ ప్రాప్తమౌ!తుదిన్!


జన్మ సిద్ధాంత వృత్తము,ర,జ,ర,త,ర,జ,గ,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-174101.


26.కీర్తి గను వృత్తము,


               మేథో స్థి మజ్జ మాంస వపు!సమీకృత హేయ  దేహ మిదే?

              ప్రాధాన్య మిచ్చి యిచ్ఛ నడచి!పాప మెసంగ గొప్పగునే?

              శోధించి జ్ఞాన సౌరభముల!శోభిలు మయ్య తెల్వి మెయిన్!

              సాధించు కీర్తి జన్మ మిలన్!సద్వరదంబు గూర్చు నయా!


కీర్తి గను వృత్తము,న,భ,ర,జ,భ,ర,గ,గణము లుండును,

యతి,11.వ,యక్షరము,వృ,సం:-92850.


27.జీవన కారక వృత్తము,


               కాలు జారిన భవిత శూన్యమ్!కర్మ మాలిన దోషమే యౌ!

               నేల మారిన నడత మారున్!నీతి మారదు యేడ జూడన్!

               ఫాల నేత్రుడు గతిని గూర్చున్! పాడి పంటలు రైతు మెచ్చన్!

                యాలమందల సిరుల భూమిన్!హాయె?జీవన కారకంబౌ!


జీవన కారక వృత్తము,ర,న,స,త,భ,ర,గ,గణము లుండును,

యతి,11.వయక్షరము,వృ,సం:-92405.


28.చిరాశ్రిత వృత్తము,


           చిరాశ్రి తాశ్రి రామ మయమ్!విశేష జీవ రక్షకా!శివా!

           వరాశ పాశ బద్ధులకున్!స్వభావ మార్పు చేయవా! హరా!

            తిరంపు కీర్తి పెంపునకున్!సు దీప్తి నింపి మేలు!గూర్చవా!

            పరం తపాన ధన్యతిడన్!అపర్ణ తోడ గూడి రావ!శంకరా!


చిరాశ్రిత వృత్తము,జ,ర,జ,ర,స,జ,గ,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-177494.


29.రామ మెంచు వృత్తము,


            అమలమ్!విమలమ్!కమలమ్!యాత్మాభిద శోభిదమ్!శ్రీకరమ్!

           సుమ సౌరభ సంస్థవమునై! సోమంబున సామ మేర్చున్!రసన్!

           విమలామల జ్ఞాన కరమ్!విశ్వేశ్వర కంఠ హారమ్! శివమ్!

           స్థిమితము గనుమా!నరుడా!శ్రీరమము నెంచ!సర్వమ్!శ్రియమ్!


రామ మెంచు వృత్తము,స,స,స,త,జ,త,గ,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-22748.


30.జగమాయ వృత్తము,


              నెలవేదైనా?సరె!తెల్వి నేర్చి కూర్చుమేలు!ధాత్రి యందున్!

              వెల పెంచే!నీతది!విశ్వ విజ్ఞ తేర్చు!కాల జ్ఞాన మింతే!

              కుల జాఢ్యాలం బడి!కొల్ల గొట్ట లోక తీరు!నాశమే!యౌ!

              వెల లేదీనా డిల!మాయ వేట గాండ్ర చేత జిక్కె లోకమున్!


జగ మాయ వృత్తము,స,త,జ,ర,జ,ర,గ,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-87390.


31.ధనం ములమ్!వృత్తము,


                జన్మ సంకట మార్జ నాయెన్!జాతి సంకట మంటె!నెల్లెడన్!

               కన్మరుంగయె?నీతి నాతే!కాన దేడను?సర్వ సామ్యమున్!

               మన్మదంబయె! మత్తు పెచ్చై!మాయ డబ్బుకు చిక్కి రెల్లరున్!

               చిన్మయంబిడ దేవతాళే!శీఘ్ర రక్షణ గూర్చగా వలెన్!


ధనం మూలమ్ వృత్తము,ర,స,య,ర,స,జ,గ,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-177243.


32.నీతి విలాప వృత్తము,


         1.    జాతి ధాటి కోర్వ లేక!సాగె నీతి నాతి యామడామడల్!

                నేత చేతి వాటతీరు!యెప్పు డేమి?సేయునో!యటంచు తా!

                త్రాత దిక్కు నా కటంచు!ధర్మ దేవ తంట పొమిమనెన్!

                 ఘాతుకాల లోకమందు!కర్మ కాలెనంచు!నీతి రోధిలెన్!


     2.     కూడు లేక!గుడ్డ లేక!నుండ గూడు లేని!బీద లెందరో?

              మాడి మాడి చచ్చు చుండ!తా మమానుషాన!జూడ మానిరే!

             చీడ పుర్వు లౌచు నొప్పుచున్!విచిత్ర మభ్యతేర్చి గూర్చిరే!

              చూడ బీద లంద రంచు నే?పశుత్వ తత్వ జ్ఞానులై రిలన్!


నీతి విలాప వృత్తము,ర,జ,ర,జ,ర,జ,గ,గణము లుండును,

యతి,11.వ,యక్షరము,వృ,సం:-174723.


33.కిల్భిష వృత్తము,


              సర్వ సామ్యము మాట తీరయెన్!స్వా ర్థమే?సర్వార్థ మాయెనే!

              నిర్వికార విచిత్ర ధోరణే!  నీతి సామ్రాజ్యంబు నేలెనే!

              దర్వి బూనె!హలంత హాయినే !ధర్మమే?గోదారి మున్గెనే!

              గర్వ భంగము కల్గ దాయెనే?కర్తృ చైదం కిల్భిషం బయెన్!


కిల్భిష వృత్తము,ర,య,జ,త,మ,జ,గ,గణము లుండును,

యతి,11.వ,యక్షరము,వృ,సం:-166219.


34.శిక్షా స్మృతి,వృత్తము,

         

             తప్పునకు తగు శిక్ష లేకన్!ధర్మ ద్రోహం బేర్చి కూర్చెనే!

            చొప్పడిన విధమెంచి మెల్గన్?క్షుద్రమే యౌ!భద్రంబునొప్పెనే!

            కప్పు కొనిన స్వపక్ష తీరే?కాటు వేయున్!నన్యాయధోరణిన్!

            ఒప్పు కొనుడిక మేలు జేయన్!యూర్ధ్వ లోకాలెల్ల!మెచ్చగన్!


శిక్షాస్మృతి వృత్తము,భ,న,ర,త,య,జ,గ,గణము లుండును,

యతి,11.వ,యక్షరము,వృ,సం:-166079.


35.నాటి తెల్వి వృత్తము,


            ఆముద దీపాల చదువులన్!హర్ష మనీషు లైరి నాడే!

           మామక కల్యాణ క్రతువులన్!మానవ ప్రజ్ఞ జూపి రెంతో?

            కామిత శస్త్రాస్త్ర విలువలన్!గర్విల నాడె!జూపి రోయీ!

            క్షేమక వైద్యాన గరిములై!జీవన పెంచినా రాదినాలన్!


నాటి తెల్వి వృత్తము,భ,త,న,భ,జ,ర,గ,గణము లుండును,

యతి,11.వ,యక్షరము,వృ,సం:-89569.


36.పూర్వ  ప్రజ్ఞ  వృత్తము,


           చేతగాని వారు పూర్వులా?సిద్ధ జ్ఞాన సంపన్ను లెంచగా!

           భూత ధాత్రి నిండు గూర్చిరే?బుద్ధి పెంచు వైద్యంబు జేసిరే!

          పాత  రోత మాట లేలయా?వారి మేథ ధీ శక్తి నెంచరే?

         పాత వారి మేథ మేథయే?పట్ట రేల? నవ్వారి నైపుణిన్!


పూర్వ ప్రజ్ఞ వృత్తము,ర,జ,ర,ర,య,జ,గ,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం;-169131.


37.జన్మ ఫలమ్,వృత్తము,


                స్థవనీయంబగు జన్మ నొందన్!సత్పూర్వ జన్మ కర్మమే నౌ!

               భవబంధాన్విత దోష చర్యల్!ప్రాళుబ్ద కర్మ శేషమే నౌ.!

                నివహంబున్జను వొంట రీవే?నీవెంట వచ్చు ధర్మమేగా!

                 శివమేర్చు న్శుభ కర్తృకంబుల్!జీవించు త్యాగి వొచు!జీవా!


జన్మ పలమ్ వృత్తము,స,భ,ర,మ,జ,ర,,గ,గణము లుండును,

యతి,11.వ,యక్షరము,వృ,సం:-86190.


38.విజ్ఞతా వృత్తము,


             సక్రమ తెలివి తేటలకు!సర్వ సమర్థపు భారతిన్!

            విక్రమ మొనర మెల్గుటకు!విజ్ఞత జూప వరామమే!

             స క్రతు కృతము లందెడము!సత్యపు దూరము!మెత్తురే?

             చక్ర భ్రమణము జీవనము!చర్విత చర్వణమే గదా!


విజ్ఞతా వృత్తము,భ,న,భ,జ,జ,జ,గ,గణము లుండును,

యతి,11.వ,యక్షరము,వృ,సం:-187327.


39.హైందవ వృత్తము,


           సర్వ శ్రేయ జ్ఞాన ధృష్టి మను! జన్మ భూమి!భారతి లోక గణ్యమ్!

           నిర్విరామ శోధనం బతుల!నిర్వివాదతం!మహనీయమాయెన్!

           పర్వె నూత్న తీరు జాతిల!సృష్టి స్థిత్య ప్రజ్ఞ విశిష్ట రక్షై!

           గర్వ కారణంబు హైందవ!కర్మ కారణన్!సుఫలంబు లీయన్!


హైందవ వృత్తము,ర,జ,భ,జ,భ,ర,గ,గణము లుండును,

యతి,11.వ,యక్షరము,వృ,సం:-93093.


40.జ్ఞాన సంపద వృత్తము,


             దూర దృష్టి,దూర శ్రవణ,దూర గమన యంత్ర జ్ఞానమున్!

             కోరి కోరి మేథ సుథ!ఖగోళ గ్రహపు స్తవ్య గమ్యముల్!

             చేరి మానవాళి ఘనత!జీవ మొసగె!శాస్త్ర వేత్తలే!

             ధీర ప్రజ్ఞ కంజలు లిడ!తేజ తలరె! జ్ఞాన సంపదల్!


జ్ఞాన సంపద వృత్తము,ర,జ,న,భ,స,జ,గ,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-179691.


41.ముదమగు వృత్తము,


              తప్పు నెత్తి జూప వలయు!తగిన మార్పు గల్గి మేలునౌ!

              ఒప్పటంచు తప్పు పొగడ!యునికి కీడు నేర్చు మానవా!

              గొప్ప బోకు!యప్పు వలదు!కుటిల తత్వ మెంచ బోకుమా!

               ముప్పు దప్ప దెప్పటికిని! ముదము మెల్గు మంచి వానిగా!


ముదమగు వృత్తము,ర,జ,న,న,ర,జ,గ,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-176107.


42.అప్పు ముప్పు,వృత్థము


             ఒప్పులనొప్పు గొప్పగా!నీ యునికి లోక ఖ్యాతి పెంపవన్!

            తప్పు జేయ బోకుమా!సద్ధర్మమె కాచు నెల్ల వేళలన్!

            గొప్పకు బోకు మెన్నడున్!కోరకు విరోధ మెల్ల చేటునౌ!

             అప్పును కోరి చేయుచో?హాయి చెడు!తేల లేవ దెన్నడున్!


అప్పు ముప్పు వృత్తము,భ,ర,య,న,ర,జ,గ,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-175703.


43.స్నేహ బాల వృత్తము,


              పంత మూను వింత చర్యలే!పాడు గోరును!మంచి నెంచకన్!

              చింత స్వార్థ మెంత పాపమో?చేటు గూర్చును!సర్వ మిద్ధరన్!

              పొంతనంబు లేని పల్కులే!పోడి మంబు చెరంచు బాలకా!

              అంత యింత కొంత యైన!స్నేహంబు గోరు విశాల ధృష్టినిన్!


స్నేహ బాల వృత్తము,ర,జ,ర,ర,ర.జ,గ,గణము లుండును,

 యతి,10..వృ,సం:-173247.


44.కామితార్ధ వృత్తము,


              సొమ్ము లమ్మ!భరత మాత!శుద్ధ చిత్త!రత్న గర్భ!ధీరన్!

             కమ్మ నైన చరిత నొప్పు!కామితార్ధ దాయి!గొల్వ రమ్మా!

             చిమ్ము శాంతి గరిమ ధన్య!సర్వ సామ్య తంత్ర రాజ్ఞి!బాలా!

            అమ్మ కీర్తి నిలుపు మయ్య!హర్షనీయ కాంతిపెంచు!మోయీ!


కామితార్ధ వృత్తము,ర,న,జ,ర,జ,ర,గ,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-87413.


45.స్నేహక వృత్తము,


            కలిసి మెలసి యుండుమా!కష్ట సుఖములందు!మంచిగా!

           చెలిమి బలము నీయునులే?జీవ జగతి మేలె!మేలగున్!

             కలలు నిజము జేయుమా!కాని పనికి సాగ బోకుమా!

             తెలిసి కొనుము సర్వమున్!దీప్తి దనరు లోక మందునన్!


స్నీహక వృత్తము,న,,న,ర,భ,న,జ,గ,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-179382.


46.జ్ఞానార్జ నార్తి.వృత్తము,


               మితి మీరి మెక్క తప్పగున్! మితాశె!మేలు గూర్చు సోదరా!

               గతి మీరు చర్య దోషమౌ!కరార్తి నెంచు మేథ పెంపుకున్!

               సతతంబు సాటి వారినిన్!చరింప జేయు!నీతి నేతవై!

              వెతలందు ధెర్య మూనుమా!బిరాన గాచు!దైవ మొక్కడే!


జ్ఞానార్జనార్తి వృత్తము,స,జ,ర,జ,ర,జ,గ,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-174762.


47.మహిత సాంధ్ర వృత్తము,


               మాటలాడు జ్ఞాన జీవు డీవె!మానవా!మహిత సాంధ్రుడా!

              చాటవోయి నీ ప్రభెల్ల!జీవ సౌఖ్య!సౌరభంబు!ప్రగ తెంచగన్!

               పాటు నెంచు సర్వ సామ్య తత్వభవ్య ధీనిధులుపెంపుకున్!

               నోటి మాట నీతి నిల్క డెంచినోడకీవు హిత మేర్చుమా!


మహిత సాంధ్ర వృత్తము,ర,జ,ర,జ,భ,జ,గ,గణము లుండును,

యతి,11.వ,యక్షరము,వృ,సం:-191097. 


48.సాహస వృత్తము,


               లంచగొండి లోకమాయెనే?లాలింపేది?బీద బ్రతుకుకున్!

              పంచ భక్ష్య భోజ్య మేదిలన్?పాపం బేలె!కలి ప్రభావతన్!

               ఎంచ నొనె?సర్వ సామ్యతన్!హింసేగా?జగమను రీతిన్!

                ఎంత కైన సాహసింతురే?యేమీ?జీవ మవని యోయనన్!


సాహస వృత్తము,ర,జ,ర,మ,న,జ,గ,గణము లుండును,

యతి,10.వ, యక్షరము,వృ,సం:-193583.


49.విజయ వృత్తము,


             హితకరి శుభకరి!శ్రీ హిమ జాని రుద్రాణీ యపర్ణా!

            మతిమయ జత యుతి!క్షేమక!సోము నర్థాంగీ!

            అతులిత స్తుతి మతి!ధీ యమ!ధాత్రీ!శోభితాంఘ్రీ!

           భృతి నిడు!నను గను!మా విజయాలన్!శ్రీల తల్లీ!


విజయ వృత్తము,న,న,స,స,య,ర,గ,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-71418.    


50.జీవ శ్రేయ వృత్తము,


              కాలమేమొ?కర్మ మేమొ?వికార చేష్ట లొప్పె!చూడ రేలన్?

             నేల వీడి సాము జేయగ!నెంచి నారదెంతొ?గొప్పటంచున్!

             చీలె!జీవ జాల మెల్ల!విశేష మంచు!నాశ పాశ లేకన్!

             మేలు దీర్చు తల్లి!నీ వరమే!ఘనంబు!సర్వజీవ శ్రేయమ్!


జీవ శ్రేయ వృత్తము,ర,జ,భ,జ,ర,జ,గ,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-177019.


51.విజ్ఞానినా వృత్తము,


              చదువున మర్మంబు నెర్గి!చక్క నేర్చు మేటి విద్యలన్!

              పదిలపు జన్మంబు నొందు!భద్ర మేర్చు భావి జీవితంబున్!

              ముదమున సర్వంబు గాంచు!మొక్కవోని!ఖ్యాతి నొందు మోయీ!

               బుధులను కీర్తించు మయ్య!పుణ్య భూమి!ధన్య మేర్చు మింకన్!


విజ్ఞానినా వృత్తము,న,య,జ,ర,జ,భ,గ,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-218442.


52.అసమర్ధతా వృత్తము,


            అసమసరుల సమతేర్చన్!యసలు విద్య శూన్య మాయెన్!

           విసుగు నెసగె!తెలు వున్నన్!బిగువు లేని వారి చెంగటన్!

          పసిడి మనసు కల తాయెన్!పదవి దోష చర్య మాయచేన్!

          పసగల చదు వెత లొందెన్!పరమ స్వార్ధ జాఢ్య మంటన్!

         

అసమర్ధతా వృత్తము,న,న,స,భ,జ,ర,గ,గణము లుండును,

యతి,11.వ,యక్షరము,వృ,సం:-89338.


53.విహ్వల వృత్తము,


             విద్యా,వైద్యమ్!రాజకీయాల!విహ్వలంబై యొప్పె!జ్ఞాన శూన్యై!

             సద్యోజాతమ్!నీతి తత్వంబు!సర్వ శూన్యం బేర్చె!స్వార్ధ చింతన్!

              పద్యమ్,గద్యమ్!సర్వ. శ్రేయంబు!పట్ట దాయెన్!దర్ప మాత్సర్యానన్!

              వైద్యమ్!సర్వమ్!యూక దంపాయె!విశ్వ కీర్తే మౌనో?యూహ జేయన్!


విహ్వల వృత్తము,మ,త,త,ర,త,ర,గ,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,,వృ,సం;-83227.


54.సేవక స్వేచ్ఛ వృత్తము,


            రక్షణ,విద్యా వైద్య శాఖల్!రంజిల స్వయం ప్రతిపత్తిడన్!

            శిక్షిత నైపుణ్యం బదేయౌ!శేముషిని రక్షణ దక్షతౌ!

            కక్షను బూని రాజకీయమ్!గర్హిత మతిన్ జెలగించదే?

            మక్షిపాత కబళంబౌ!మారు విషతస్వార్ధతగున్ భవిన్!


సేవక స్వేచ్ఛ వృత్తము,ర,న,య,భ,జ,జ,గ,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-187515.


55.విష వృక్ష వృత్తము,


             రాజకీయ జ్ఞాన మెంచగా!రంజిలు చదరంగ కేళియే!

             భాజనీయ సూత్ర జ్ఞానమే!పాదు కొనును భాగ హారతన్!

             తేజమైన భావి సంపదల్!తీరు చెడును!తారతమ్యతన్!

             భీజ స్వార్ధ వృక్ష సౌరభమ్!పేరు గనును నాయకాళినిన్!


విష వృక్ష వృత్తము,ర,జ,ర,భ,స,జ,గ,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-180373.


56.విన బల్కు వృత్తము,


           సారి సారికి చావజంపున్!చవట తెలివి ప్రసన్నతన్!

          వేరు చేయును లోకమందున్!వినగ బలుకు జనాలలోన్!

           కారుకూతల మెప్పు నొప్పున్!కనరు నిజమని ప్రేలుచున్!

           నీరు గార్చెడి రాజ నీతిన్!నిగుడు టరయగ!మాయయే!


విన బల్కు వృత్తము,ర,స,య,న,ర,జ,గ,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-194367.


57.యజమాయిషీ వృత్తము,


                సేవకులే!కూలీలని!విశేష కూలి యిచ్చితే!నటంచున్!

               జీవనమున్!సాగించుటది!సేవజేస్తి నంచు చాటుటౌ  లే!

                భావిలుదుర్!సేవేయనుచు!పట్టి లాగు భుక్కు నేర్పదేగా!

                జీవజనా నీకంబులను!సేవ పేర పుష్టి నొందు తీరిదేలే!


యజమాయిషీ వృత్తము,భ,మ,న,ర,జ,ర,గ,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-77484.


58.భయానక వృత్తము,


             రావణాంశ జన్యు లిక్కలిన్!రాజ్యా లేలగ!భీమకంబగున్!

            జీవితాలు దుర్భరం బగున్. !శ్రీరామంబుకు!దారి లేనిదౌ!

            ధీ వరాలు దిక్కు మాలు లే!తేజంబే?గనరాదు!భూతలిన్!

            భావ రమ్య భాగ్య దీప్తులే!వాటం బోపక పారు దూరమున్!


భయానక వృత్తము,ర,స,ర,మ,స,జ,గ,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-176299.


59.అనర్హతా వృత్తము,


             ఏయర్హత లేని వాడిల నేల గల్గు!మూక!యెన్ను కొనన్!

             న్యాయంబును మార్చు శక్తిని నాయకత్వ రీతి నొందు ధరన్!

             మాయాన్విత చర్య నెంచును!మంచి నెంచు తెల్వి లేక!రసన్!

             దాయాదుల పోర జూచును!ధర్మమే!తనంచు తూలు భూమిన్!


అనర్హతా వృత్తము,స,జ,భ,ర,జ,భ,గ,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-259533.


60.పదవీ ప్రభ వృత్తము,


            ప్రజల దన్నున తూలు చుండున్!పదవి పోయిన నీచుడౌ!

           విజయ దుందుభి మ్రోగ గెంతున్!ప్రజల లెక్కిల మానుచున్!

           భుజ బలంబును జూపు ధాత్రిన్!భువన జేతగ భాసిలున్!

           సుజన తత్వము కాన రాకన్!సురల మించిమనున్!సదా!


పదవీ ప్రభ వృత్తము,న,భ,ర,భ,జ,జ,గ,గణము లుండును,

యతి,11.వ,యక్షరము,వృ,సం:-187576.


61.శ్రీశా వృత్తము,


            ఎన్నాశ్ళైనది?నిన్ను జూచి!యీ స్వేచ్ఛేమైనా!మారునా!తల్లీ!

            కొన్నాళ్ళే సిరు లంటె!జాతి!ఘోరాలీనాడే!పెచ్చె!నో యమ్మా!

           చిన్నా పెద్దల భేద మేది?శ్రీలె? వాలంబేజాడించెన్!భువిన్మాతా!

           కన్నారే?సుర భోగ రాజ్ఞి!కార్పణ్యంబే నిండెను లే?శ్రీశా!


శ్రీశా వృత్తము,మ,స,జ,మ,మ,య,గ,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-33113.


62.సూచితా వృత్తము,


           దోచి దాచే వారేగా!నిలన్!దూర్వా దుష్టాత్మం జరించిరే!

            వేచి చూచేవా?నీవీ!రసన్!వేదాంత విశ్వాసంబు !లేదయెన్!

            శోచనీయంబే?స్వార్ధంబయెన్!జూదాల,పానీయాల!పాడయెన్!వ

           సూచిగా!నల్చెన్?భేషాలచేన్!సూర్యోదయాదిన్!పాప మేపయెన్!


సుచితా వృత్తము,ర,మ,ర,త,మ,జ,గ,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం: -166019.


63.భూ విలాప వృత్తము,


           భూభారంబును!మోయ జాల!పుణ్యం బేడ?కానదాయె!దేవా!

           శోభిల్లెం జెడు మంత్ర మాయ!శోధిల్లం?జెడే?విలాస మాయెన్!

           భూ భుక్తంబుకె!బాధిలెందు!పూర్ణార్తిం జెడు న్గనంగ నైతిన్!

           శ్రీ,భూ భావితరాల బాధ!చింతాక్రాంత మాయె నేమి?జేతున్!


భూవిలాప వృత్తము,మ,స,జ,మ,జ,ర,గ,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-76355.


64.శోభల్జెడె వృత్తము,


             సోకులు లావయె!లోకానన్!శోభిదము ల్జెడి పోయె!నెంచన్!

             మ్రాకులు కూల్చిరి!యత్యాశన్!మాడ్చిరు సశ్యం వర్ష లేమిన్!

             బాకులు బూనిరి కార్యాలన్!పాపపు టూహే?మాపె సర్వమ్!

              చేకొని రన్యుల తాపంబున్!శ్రీ లలరు నంచు భావమే నౌ!


శోభల్జెడె వృత్తము,భ,భ,మ,భ,భ,ర,గ,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-93133.


65.విపత్కర వృత్తము,


            భూ ధరాలు!బుగ్గి సేయగా!పుణికి పుచ్చి రేమి?రోగమో!

           శోధిలంగ!వర్ష లేమికిన్!శొబగు గూర్చి!భుక్తి మాపిరే?

           భేదిలంగ బూని సత్యమున్!సతత కర్మ కాండ!జిక్కిరే?

           భోదిలంగ! మంచి నొప్పరే?భువిని మ్రింగ నాశమే!సుమా!


విపత్కర వృత్తము,ర,జ,ర,న,ర,జ,గ,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-175787.


66.చెడెంచు వృత్తము,


           మంచి వినగ నోప రించుకన్!మాయ మభ్య జీవమెంచుచున్!

           సంచిత మగు!పాప కర్మకే?సర్వ మొడ్డి నిల్తు రేలనో?

          వంచితు లయి!పీడ నొందగన్!పాప బుద్ధి వీడ రెంతకున్!

          మించి పొగరు!గెంత జూతురే!మేడ మాడ లెన్నొ?కోరుచున్!


చెడెంచు వృత్తము,భ,స,జ,త,ర,జ,గ,గణము లుండును,

యతి,11.వ,యక్షరము,వృ,సం:-174431.


67.అక్రమార్జనా వృత్తము,


              శ్రమ పడని సొమ్ము కోరికే?సర్వ జాతి శూన్య మేర్చదే?

             భ్రమల మునిగించి!స్వార్ధతన్!పాలనంబు నొందు కోరికే?

             సమయమున రూక లిచ్చుచున్!సాయ మంచు పంచు టెంచగా!

              విమలు రనుకొందు రేలనో?వెఱ్ఱి లోక మాయె!దైవమా!


అక్రమార్జనా వృత్తము,న,స,జ,త,ర,జ,గ,గణము లుండును,

యతి,11.వ,యక్షరము,వృ,సం:-174432.


68.నేటి ముచ్చట,వృత్తము,


              పన్ను రూప వసూళ్ళవే!తెల్వి పంచు నాయకత్వ మెంచరే?

             అన్న లన్న ప్రమోదమే!మిన్నహాయి గల్గె నందు వేలనో?

              అన్న తెల్సి కొనంగ లేవైతి!యాట లందున మేటి మోసమే!

              మున్ను రోజుల ద్రోహమే!నేడు ముచ్చటించె!నిట్లు!మిత్రమా!


నేటి ముచ్చట వృత్తము,ర,స,య,జ,ర,జ,గ,గణము లుండును,

యతి.11.వ,యక్షరము,వృ,సం:-175683.


69.చరిత మారె వృత్తము,


              పర్యవేక్షణ లేని పంపకమ్!పనితనంబు నెత్తి చూపున్!

              తిర్య గాదుల సఖ్య మేదిలన్?తినుట కేను నీతి భూమిన్!

              కార్య సాధన గెల్చు ధోరణిన్!గడగె నిట్లు కాల తీరై!

               శౌర్యమే!గన నౌను!సర్వదా!చరిత మారె నేడు చూడన్!


చరిత మారె వృత్తము,ర,స,జ,భ,జ,ర,గ,గణము లుండును,

యతి,11.వ,యక్షరము,వృ,సం:-89427.


70.సార్థక వృత్తము,


           జన్మ గుట్టు!జరా పట్టు!నిజాయి తీని మెట్టు నెక్కు దిట్టై!

            కన్మరుంగగు దేహం బిల!కర్మ కీర్తి నిల్చు! భూ తలంబున్

            మన్మనోహర ఖ్యాతెంచుమి!మాధవం బదేను?జీవ ధాత్రిన్!

             జన్మ సార్ధక మందన్వలె?సాగు జాతి గౌర వంబ దెంచన్!


సార్ధక వృత్తము,ర,స,ర,ర,జ,ర,గ,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-87189.


71.సర్వమీవ వృత్తము,


            కష్ట మొందని సొమ్ము వద్దయా!కాలి మాడుము!జన్మ సౌఖ్యమ్!

            ముష్టి భ్రష్టము మోద మీయునే?మోదమొందని జన్మ హేయమ్!

            సృష్టి మూలము భీజ ప్రోక్తమ్!జీవమౌ?ప్రణవంబు విశ్వమ్!

            అష్టి నష్టి సమస్త మిథ్యే?హాయి గూర్చుమి!సర్వ మీవై!


సర్వ మీవ వృత్తము,ర,స,జ,త,భ,ర,గ,గణము లుండును,

యతి,11.వ,యక్షరము,వృ,సం:-92501.


72.శీల శ్రీల వృత్తము,


            గాలి వాటపు!జీవ యానం!కానిదౌ!కలకాల జీవితమ్!

            మేలు గోరెడి జన్మ నీదై!మేటి వౌమిల!శక్తి మీరన్!

           ఫాల నేత్రుడె?భక్త రక్షై! భావి సౌఖ్యము నింపి గాచులే!

           శీల శ్రీ లవి!నిల్కడౌలే?జేగురింపగ!సత్య దీక్షచేన్?


శీల శ్రీల వృత్తము,ర,స,జ,ర,స,జ,గ,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-176499.


73.దైవ శోధనా వృత్తము,


                 అచల హార్యమ్!విష్ణు ద్రోహమ్!అవ్వారి హార్యమ్!శివ ద్రోహమ్!

                వచత దోషమ్!వాణి ద్రోహమ్! పర్మాగ్న దోహమ్! పచనంబే?

                కచట తాదుల్ కర్మ  ద్రోహమ్!కర్మార్తి హార్యమ్!కమనీయమ్!

                సు చరితంబే?విశ్వ విఖ్యాతమ్!శోధించు దైవమ్!పరమంబదౌ!


దైవ శోధనా వృత్తము,న,మ,య,మయ,స,గ,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-130474.


74.తత్వజ్ఞ వృత్తము,


             యుత మతి క్రతు కృత్య! నయోన్నత!తత్వ జ్ఞాన మనీషుల్!

              బ్రతుకున పరహిత సుభాషణ! సోదరాదర శ్రేయముల్!

              నుత మతు లమరులను!నిర్మల బుద్ధి గొల్చు!జనం బీ

              గతి!కలిప్రభల చెడు కర్జము లంట!పాపము గాదే?


తత్వజ్ఞ వృత్తము,న,న,న,భ,ర,స,గ,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-110074.


75.కాని తెల్వి వృత్తము,


            చెలిమి నడుతురు ముందుగా!చేర నోపరు మంచి చర్యల్!

           మడియు తడి యను మాటలే?మాయ ఛాందస!భావ మంచున్!

           బిడియ పడవలె!భారతిన్!వేద భూమిది!తెల్సి కొమ్మా!

          కడకు కలుషిత మేర్చితే! కాని తెల్విల జూప నౌనే?


కాని తెల్వి వృత్తము,న,న,స,త,భ,ర,గ,గణము లుండును,

యతి,11.వ,యక్షరము,వృ,సం;-93638.


76.ధర్మ స్థాపన,వృత్తము,


             చిత్త మేకాగ్రతను వీడెనా!చేత,మాటకు పొంత లేకన్!

              బొత్తిగా!నీతనెడి!మాటను!పూర్తిగా!నెడ మేర్చి నారే!

              కుత్తు కంతా!విషము గ్రమ్మెను!కూర్మి గానగ దాయె!భూమిన్!

              దత్త దైవం బిలను గావగ!ధర్మ స్థాపన మౌను!ధాత్రిన్!


ధర్మ స్థాపన వృత్తము,ర,భ,జ,జ,భ,ర,గ,గణము లుండును,

యతి,11.వ,యక్షరము,వృ,సం:-93037.


77.క్రమమార్గ వృత్తము,


             పరుల కష్టము తన సుఖం బనుట!ఘోరము ధాత్రిలోన్!

              సరళ మార్గము వరలుచో?జగము దైవము మెచ్చుగా!

              పరమ భారతి ఘన యశం బలర జేయుమి!బాలకా!

               తిరుగు లేదిక!గుణ మతిం దివురు సౌఖ్యము నీతినిన్!


క్రమ మార్గ వృత్తము,న,భ,న,భ,జ,జ,గ,గణము లుండును,

యతి,11.వ,యక్షరము,వృ,సం:-187976.


78.జయ బాల వృత్తము,


              గిరి వరులు సుర వరులు నీకెదురు నిల్చి గావగన్!

              పరమ కరుణ దనరగా! పలుకు యుక్తి సూక్తముల్!

             తిరుమల గిరి వరదుడు! నీ దిగులు బాపి రక్షిలున్!

             సరి సరి సుమ సరి!మనసా!జయము నీదె?బాలకా!


జయ బాల వృత్తము,న,న,న,జ,స,జ,గ,గణము లుండును,

యతి,12.వ,యకషరము,వృ,సం;-179200.


79.నీతి ఖ్యాతి వృత్తము,,


              కోట్లు వెంట రావు!సుగుణమే!కోరి నిల్చు తోడు నీడనై!

             పాట్లు మంచి కాగ!వరదమౌ!భావి జీవ సౌఖ్య మార్గమై!

             చీట్లు లంచ మెంచ మవనిన్!జీవితంబు బాని సత్వమౌ!

             చోట్లు బట్టి తెల్వి మసలుమా!జుఱ్ఱె దీవు!స్వేచ్ఛ  జీవితమ్!


   (చీట్టు=రికమెండేషన్ కాగితములు,చోట్లు=ప్రదేశములు,జుఱ్ఱె దీవు స్వేచ్ఛ=

      సంపూర్ణ స్వేచ్ఛ నొందెదవు).


నీతి ఖ్యాతి వృత్తము,ర,జ,న,త,ర,జ,గ,గణము లుండును,

యతి,11.వ,యక్షరము,వృ,సం:-174571.


80.అపద వృత్తము,


               నీతి బ్రతుకు జీవి కుత్తమమ్!నిర్మలమ్!సదామయాశ్రితమ్!

               భూత జగతి నీతి నింపుమా!భోగమౌ!సరాగమౌ!నెంచన్!

               చేతనముల శ్రేయ మేర్చుమా!శ్రీ వరామ రామ మేర్చంగన్!

              కుత మపద మందనీకుమా!కూర్మి బోవనీ కేనాడున్!

  

               (కృత మపద=చెడు ప్రేలాపన).


అపద వృత్తము:-న,స,జ,త,ర,య,గ,గణము లుండును,

యతి,11.వ,యక్షరము,వృ,సం:-43360.


81.పరాయతా వృత్తము,


              మను విశాల హృదయంబున!మనమంతా సామ్య జనులమ్!

             మనువు సంతతిదే?నయ!మను జన్మం!దుర్ల భంబులే?

              కన వదేమి?కులంబంచు!కలత ల్లేపంగ!న్యాయమా?

              మన యనైక్యత!పరాయత! మనజాలే!మేలు గానవా!


పరాయతా వృత్తము,న,భ,జ,న,మ,జ,గ,గణము లుండును,

యతి,11.వ,యక్షరము,వృ,సం:-67792.


82.నాడి మారె వృత్తము,


             గాడి తప్పిన జీవితాలయె!కామితార్థ సంస్కార మాయెనే?

             పోడిమంబది తప్పె సంస్కృతి!పూర్తి పారశీకంబు!నొందెనే!

             నేడు రేపది తారుమా రగు!నీతి జాతి తత్వాల మార్పున్!

             వాడి పోయెను!స్వేచ్ఛ పుష్పమ్!పాప గోప్య!భావాల!మేథన్!


నాడి మారె వృత్తము,ర,స,జ,జ,ర,ర,,గ,గణము లుండును,

యతి,11.వ,యక్షరము,వృ,సం:-76629.


83.చారవశ వృత్తము,


                చార వశమున మార్పు నౌచో?సంసార సౌఖ్యము నొందు లే!

                భార వహుడవు గమ్ము!జీవా!బంగారు భారతి!తేరుతన్!

                క్షీర ఘటమిది!మర్చి నావే?చే జేతలం చెడ నీకుమా?

                సార వనరుల ధృష్టి పెట్టన్?సర్వోత్త మోత్తమ మౌ గదే!


చారవశ వృత్తము,భ,న,ర,మ,జ,జ,గ,గణము లుండును,

యతి,11.వ,యక్షరము,వృ,సం:-184493.


84.జీవన స్వేచ్ఛ వృత్తము,


              సమిష్టి కుటుంభాలు లే విలన్!స్వతంత్ర జీవ యాన మయెన్!

             అమానుషముల్పెక్కు లాయెనే?అనర్థ శైలి జీవ మయెన్!

             సమాన మదేది?కానదే!జగంబు స్వార్థ మందె సుమా!

             ప్రమోదమును!మదెంచరే?ప్రశాంత మొందు టెట్లు?రసన్!


జీవన స్వేచ్ఛ,వృత్తము,జ,య,జ,ర,త,భ,గ,గణము లుండును,

యతి,11.వ,యక్షరము,వృ,సం:-214744.


85.శ్రీకరం వృత్తము,


              శివమ్.శ్రియమ్ శ్రేయమ్!శ్రీకరమ్!వశీకర యోగమీయు!దైవమై!

              భవాంబుధిన్!క్షేమం బీదు నావే!భద్ర తమంబు నింపు సర్వమ్!

              అవాంఛ నీయంబే!లేదు! జీవా!అమ్మను గొల్వ మోక్ష మబ్బున్!

             దివాధి నాథుం డీయుం!బలంబున్!పేరొనరం మెలుంగు ధాత్రిన్!


శ్రీకరం వృత్తము,జ,మ,ర,త,జ,ర,గ,గణము లుండును,

యతి,11.వ,యక్షరము,వృ,సం:-88192.


86.ప్రజ్ఞ వృత్తము,


          నాటి మంత్ర బలము చెంత!యీనాటి యంత్ర శక్తి సరా!

         మేటి శక్తి చదువు!నిచ్చు లే!మేరు ధీర మందు గుణా!

        వాట మూని తెలివి పెంచుమొ!భవ్య శోధన నిపుణతన్!

        పోటి గెల్చు తెలివి తేటలన్!బుద్ధి పెంపె భవిత ఫలమ్!


ప్రజ్ఞ వృత్తము,ర,న,జ,త,భ,న,గ,గణము లుండును,

యతి,11.వ,యక్షరము,వృ,సం;256373.


87.వేద మాత,వృత్తము,


                 మన భూమి వేద భూమయా!మనజాతి భరత జాతయా!

                మన కీర్తి లోక ఖ్యాతయా!మన వారి ప్రతిభ! మేధురమ్!

                కన నేక తత్వ  ముత్తముల్!కమనీయ సమత కాకరమ్!

               మన మాత!రత్న గరభయా!మణిమాదు లలరు చుండురా!


వేద మాత వృత్తము,స,జ,ర,స,న,జ,గ,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-194419.


88.విద్వదాంశ వృత్తము,


              విద్య నేర్పు నభ్యసించనౌ!విద్వదాంశ పూర్వ జన్మ ఫలమ్!

              సద్యశంబు నంత!కర్మకమ్!సాధనంబె?శ్రేయ మూల మిలన్!

              విద్య మేటి వేద విద్యయే!విశ్వ శాంతి ధాంతి క్రాంతదే!

              విద్యనంత సృష్టి బోధిలన్?నీమ నిష్ట శిష్ట ధృష్టి!భరమ్!


విద్వదాంశ వృత్తము,ర,జ,ర,ర,జ,భ,గ,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-218227.


89.శోధనా వృత్తము,


              ఆది లేదు యంతు లేదు!యాదీయంతసలె!లే దదేమిటో?

              నీది కాదు నాది కాదు!నాదీ నీద సలె కా. దనాది రా!

              బీద కాదు!సాద కాదు!సాదా!బీ దసలె!కాద నుందువే?

              సాద లేదు సీద లేదు?సీదా సా దసలె లేదు!శోధిలన్!


శోధనా వృత్తము,ర,జ,ర,త,స,జ,గ,గణము లుండును,

యతి,11.వ,యక్షరము,వృ,సం:-178347.


90.ధన మద వృత్తము,


             ధనము మదము పెంచు నయా!దర్పంబుకు దారి తీయుచున్!

             మనును సతత మీర్ష్య నిలన్!మాయం బెదిరించు నన్యులన్!

            కొనరు హితము కర్కసతన్!కోరున్!పరహాని నెన్నడున్!

            వినరు కనరు!నన్యు వెతల్!వేధించగ!జూచు చుందురే!


ధన మద వృత్తము,న,న,భ,మ,స,జ,గ,గణము లుండును,

యతి,11.వ.యక్షరము,వృ,సం:-176576.


91.సిరి వాంఛ వృత్తము,


             పలుకు తేనె లొలుకు చుండు!పనిని నీరు గార్చు!చేయకన్!

            చెలిమి నాట్య మమరు చుండు!పరము నెంచ డించు కేనియున్!

            బలము జూపి మెదలు చుండు!నెలవు తప్పు!కార్య సాధనన్!

            కొలువు దీరు సిరుల గోరి!కుటిల చింత సర్వ!మెంచు!పాపియై!


సిరి వాంఛ వృత్తము,న,భ,స,న,ర,జ,గ,గణము లుండును,

యతి,11.వ,యక్షరము,వృ,సం:-165884.


92.జాతి సఖ్యతా వృత్తము,


               జనన మరణ సంఘర్షణ!జగతి జీవ రాశి!నల్గన్!

               మనన గనగ!ధీ శక్తిని!మదన జేయ!మేలుకూర్చున్!

               కనుడి!పఠన పాఠ్యాంశ! క్రమత నేర్చి!జ్ఞాన మొందన్?

               ధన యశ బలదంబగు!దనరు!గాదె?భావి సౌఖ్యమున్!


జాతి సఖ్యతా వృత్తము,న,న,త,న,జ,ర,గ,గణము లుండును,

యతి,11.వ,యక్షరము,వృ,సం:-89914.


93.అనృత వృత్తము,


            అబద్ధ మని తెలిసి కూడ!అనృతము లాడ!మానరే?

           నిబద్ధ తనుచును! ధనాశ!నిరత మనంత కోరికన్!

          విభూతి!గనితనుచు!వరాశ!వెరవక!మాట లాడగన్!

          ప్రభావిభవ మది యనంగ!బ్రతుకు చెడు!భావినిన్!


అనృత వృత్తము.జ,న,స,న,స,జ,గ,గణము లుండును,

యతి,11.వ,యక్షరము.వృ,సం:-178906.


94.పొంక మేల వృత్తము,


                  పూట తిండి పుల్ల వెల్గు నైన!పొంక మొక్కింత తగ్గ దేలన్?

                 మేటి నంచు తృళ్ళుబాటు కేమొ?మేలు నెంచంగ జూడు!జీవా!

                 పోటు గాడ నంచు బల్క నేల?పూర్తి విశ్వాశ మేది?రయ్యా!

                 తోటి వారి సఖ్య మున్న!జాలు!కొన్ని కష్టాలు!తీరి పోవే?


పొంక మేల,వృత్తము,ర,జ,ర,జ,త,ర,,గ,గణము లుండును,

యతి,11.వ,యక్షరము,వృ,సం:-84645.


95.మాయ బ్రతుకు,వృత్తము,


              నేటి మాయ లోక మిదియె!నీతి లేదు!వెతికి చూచినన్!

              మేటి వాడ నంచ హమది!మేళవించె!బ్రతుకు నందునన్!

             పోటి మాట తేట గరిమ!బూజు పట్టె!జగతి తీరిలన్?

             భూటకాల జీవ మయెను!బోడి గుండు!తలయు పోలెనే!


మాయ బ్రతుకు వృత్తము,ర,జ,న,ర,న,జ,గ,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-193881.


96,నాటి మేలు వృత్తము,


                  .గంజి యంబలి తిన్న రోజులె!కడు మేలు మేలను చొప్పెన్!

                  ఆంజ నేయుడ!కర్మ మేమయ?అసలైన తిండి యదేదీ?

                 పంజరంబున చిల్క పల్కులె!పరమేశ్వరా!గన వేమీ?

                 రంగ రించిన వేష ధోరణె?బ్రతుకే!చెడెం!తుది కెల్లన్


నాటి మేలు వృత్తము,ర,స,జ,న,ర,స,గ,గణము లుండును,

యతి,11.వ,యక్షరము,వృ,సం:-110421.


97.మోద మానస వృత్తము,


                   ప్రమోద మోద మానసాన!బ్రతుక నెంచు!వేద జ్ఞానివై!

                  సమీప బంధు వర్గ మెల్ల!చతురుడంచు!కీర్తి సేయగన్!

                  అమానుషంపు చర్య మాని!అమల ఖ్యాతి నొంద నెంచుమా!

                  క్రమాను వర్తి వౌచు!సత్య!ఘనత చాటు లోకమందునన్!


మోద మానస వృత్తము,జ,ర,జ,న,ర,జ,గ,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-175868.


98.మంచి నిలు,వృత్తము,


             తుంటరుల నంట బోకుమా!దొరకొను!పాపాలు భూమినిన్!

            పంటి పలుకు దోష మోపకన్!పలువుర మేలెంచు!బాలకా!

            బంటరికము.నెంచ కెన్నడున్!బహు విధ ప్రజ్ఞాను కూలతన్!

            అంటకు పరాయి సొత్తునున్!యది యిడు!పాపంబు!మిక్కిలిన్!


మంచి నిలు వృత్తము,న,జ,ర,న,య,జ,గ,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం;-172696.


99..జ్ఞాన నిథి,వృత్తము,


               వినుత కీర్తి గడించ వచ్చు!విజ్ఞాన పెన్నిథి వైనచోన్?

              మనుత మేలోసంగ నొప్ప!మాన్యుండ వీవని!మెత్తురే!

             కనుమి సర్వుల శ్రేయ మెల్ల!కాపాడు దైవము సర్వదా!

            మనుమి స్వచ్ఛత నీతి నిండ!మానాభిమానివి నీవనన్?


జ్ఞాన నిథి,వృత్తము,న,భ,ర,య,జ,జ,గ,గణము లుండును,

యతి,11.వ,యక్షరము,వృ,సం:-185016.


100..గత మతుల వృత్తము,


                 పూర్వ జన్ముల చిత్ర పటాలు!పూజ్య ముఖము లమాయకమ్!

                 శర్వ సర్వ సుమాన్విత భాస!సర్వ సమ!తపన నొప్పెనే?

                 పర్వమౌ!సు మేథ!వరశి భాగ్యమన నెసగు చుండు నే?

                 చర్వితంబగు జన్మ విభూతి!సర్వ మరసిరి! తెల్యుమా!


గత మతుల వృత్తము,ర,స,స,జ,న,జ,గ,గణము లుండును,

యతి,11.వ,యక్షరము,వృ,సం:-195291.


101.నాటి తీరు,వృత్తము,


                నమ్మిరి సత్యము పూర్వము!నడచిరి ధర్మ సుమార్గమున్!

                కమ్మని జీవన మొందుచు!కలతలు లేక వసించిరే!

                అమ్మకు అన్నము పెట్టిరి!యతులిత ప్రాజ్ఞత నొప్పునై!

                క్రమ్మగ నీతి నిజాయితి! కర మరుదై రస నొప్పునై!


నాటి తీరు,వృత్తము,భ,భ,భ,న,జ,జ,గ,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-188443.


102.జ్ఞాన మపార,వృత్తము,


              జ్ఞాన మనంతమ్!జన్మ ప్రశాంతమ్!చదువు నిచ్చును!బాలకా!

              మానవతా వాదీ వని మెచ్చన్!మహిత కీర్తి  గడించుమా!

              దీన జనోద్ధారీవిల నౌచున్!తగిన సాయము చేయుమా!

           అం    మానవమే! శ్రీయశ మంచున్!మహిని తేజము నింపుమా!


జ్ఞాన మపార వృత్తము,భ,మ,స,భ,న,జ,గ,గణము లుండును,

యతి,11.వ,యక్షరము,వృ,సం165795.


103.లఘు చంపక వృత్తము,


             అల నగు మోము తోడ!జను నాపదలందున ధైర్యతన్!

            మెలగుమి దైవమెంచి పదె!ధర్మము తప్పకు బాలకా!

             పలు విధ మేథ సాధనము!భాగ్యత,సామ్యత నేర్చి తా!

             విలువను పెంచు నెంచు మయ!విశ్వ విధేయుడ!వీవనన్?


లఘు చంపక వృత్తము,న,జ,భ,జ,జ,జ,గ,గణము లుండును,

యతి,11.వ,యక్షరము,వృ,సం:-187312.


104.విమలామల వృత్తము,


              విమల నయన కనుము వెతలు!నతుల కువలయమ్!

             సమత మమత భ్రమత సరగు!ననయ మవనిలోన్!

             సు మనసున జను మయ!శుభము గలుగు!ధర నతిన్!

             క్రమత వలయు పనుల!కమల భవుడు! శుభ మిడున్!


విమలామల వృత్తము,న,న,న,న,న,న,గ,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-262144.


105.జీవన సార వృత్తము,


              సారమే?నీరమా!నీర సార సాగరమా!సమీర మేనా?

              వారి క్షీరాంబుధీ!శేష సాయి వాస మనన్!ప్రమోద మౌగా!

              కారకమ్!క్షేమకమ్!గర్వ కార కారణమై!సు భూతి గూర్పన్?

             తారకుం డీవనన్?ధాత్రి తీర్చు!ధర్మ పురీ  వరం బనంగన్!


జీవన సార వృత్తము,ర,ర,ర,జ,త,ర,గ,గణము లుండును,

యతి,11.వ,యక్షరము,వృ,సం:-84721.


106.ఖ్యాతి గను,వృత్తము,


              వాంఛితార్ధ ఫలదంబునై!వసుధార్తి బాపును!విద్యయే!

              పంచ నోపని!చిరాస్తయా!బహు శోభ పూర్ణ!విభూషదే?

              పెంచు తెల్విని!వికాశతన్!వినుతింప దీర్చును!ధాత్రినిన్!

             మించు దీక్ష తెలి వొందుమా!మెరియంగ ఖ్యాతి!గడించుమా!


ఖ్యాతి గను వృత్తము,ర,న,ర,స,జ,జ,గ,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-185043.


107.అత్యాశేల?వృత్తము,


                అంతు లేని యాశ!వలదయా!యనంతు నెంచి మనుమయా!

               చింత లేని!జీవ మమరురా!చెలంగు నీతి!నని శమున్!

               పంత మూన సర్వ సమతకున్!వరాశ మార్చ నెంచకన్

              వింత తెల్వి జూప!తగదయా!విరించి మెచ్చ నడుచుకో!


అత్యాశేల?వృత్తము,ర,జ,న,ర,జ,న,గ,గణము లుండును,

యతి,11.వ,యక్షరము,వృ,సం;-231365.


108.నీతి నడు వృత్తము,


           నీతి భూది పులిమి మేన!నిజాయితీ ననుట దోషమౌ!

          పాతి పూర్వ విభవ మెల్ల!పరాశ నీఱొనర జూతువే?

          మేత వాట మమలు జేయ!మెఱుంగు భావి చెర నొంద దే?

          వాత రోగ మలమ నీకు!బడాయి మాని!నడు నీతి నిన్!


నీతి నడు వృత్తము,ర,న,జ,న,జ,భ,గ,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-192379.


     

(19.అతి ధృతి ఛందము నందు 108.వృత్తములు మాత్రమే 

గైకొన బడినవి,).


                           మంగళమ్ మహాత్

                               శ్రీ శ్రీ శ్రీ శ్రీ,శ్రీ,

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.