గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, నవంబర్ 2022, మంగళవారం

ఇదమద్య మయా లబ్ధ - ...16 - 13...//....ఆశాపాశశతైర్బద్ధాః కామ - , , .16 -14,,,//.....దైవాసురసమ్పద్విభాగయోగఃము.

 జైశ్రీరామ్.

|| 16-13 ||

శ్లో.  ఇదమద్య మయా లబ్ధమిమం ప్రాప్స్యే మనోరథమ్|

ఇదమస్తీదమపి మే భవిష్యతి పునర్ధనమ్.

తే.గీ. పెరుగుచున్నట్టి కోర్కెలన్ పెచ్చురేగి

పాపముల్జేయుచుందురు భ్రష్టులగుచు,

దుష్టసంపాదనాసక్తితోడ చెడుచు

రాక్షసంబునన్ నశియింత్రు రక్ష లేక.

భావము.

ఈ రోజు ఇంత సంపద నాకు లభించింది. ఈ కోరికలని తీర్చుకుంటాను. 

ఇంత ధనం నాకుంది. ఇక ముందు ఇంకా ఇంత ధనం వస్తుంది.

|| 16-14 ||

శ్లో.  అసౌ మయా హతః శత్రుర్హనిష్యే చాపరానపి|

ఈశ్వరోహమహం భోగీ సిద్ధోహం బలవాన్సుఖీ.

తే.గీ. శత్రువులజంపినాడను,చంపుదన్యు

లనిలనింక దైవంబేనె, యని రహింతు

రన్నియున్ నేనె యని ఖలులెన్ని గనుచు

పాపవర్తులై చెడుదురు పాండు తనయ!

భావము.

ఈ శత్రువు నాచే చంపబడినాడు, ఇతరులను కూడా చంపేస్తాను. నేను 

ఈశ్వరుణ్ణి, భోగిని, సిద్ధుణ్ణి, బలవంతుణ్ణి, సుఖిని.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.