గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

20, డిసెంబర్ 2022, మంగళవారం

ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో - ...17 - 7...//...ఆయుఃసత్త్వబలారోగ్య - ...17 - 8,,,//.....సప్తదశోధ్యాయము - శ్రద్ధాత్రయవిభాగయోగము

 జైశ్రీరామ్.

|| 17-7 ||

శ్లోఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః|

యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు. .

తే.గీజనులకిష్టంబు త్రివిధభోజనములవని

తపము, యజ్ఞము,ధనమట్లె, తలచి చూడ,

భేదమరయుము వానిలో మోదమలర,

నీవు గ్రహియింపుమర్జునా నేర్పు మీర.

భావము.

మానవులకు మూడు విధాలైన ఆహారం ప్రియమౌతుంది. యజ్ఞమూతపస్సూ, దానమూ 

కూడా అలాగే ఉంటుంది. వాటిలోని భేదాన్ని విను.

|| 17-8 ||

శ్లో.  ఆయుఃసత్త్వబలారోగ్యసుఖప్రీతివివర్ధనాః|

రస్యాః స్నిగ్ధాః స్థిరా హృద్యా ఆహారాః సాత్త్వికప్రియాః. ||

తే.గీ. ఆయువును, సత్వబలముల, ననితరముగ

సుఖము, నారోగ్యమున్, బ్రీతి, అధికమవగ

చేయు, రసయుక్తమౌ, స్నిగ్ధ, శ్రేయమునిడు

భోజనము కోరు సాత్వికుల్ పూర్తిగాను.

భావము.

ఆయువు సత్వగుణం, బలం, ఆరోగ్యం, సుఖం ప్రీతి వీటిని పెంచేవీరసంతో నిండినివీ, జిడ్డుతో నిగనిగలాడేవీ, కడుపులో చాలా కాలం ఉండేవీ, మనస్సునాకర్షించేవీ అయిన ఆహారాలు సాత్వికులకు ప్రియంగా ఉంటాయి.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.