గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, డిసెంబర్ 2022, మంగళవారం

సత్త్వానురూపా సర్వస్య శ్రద్ధా - ...17 - 3...//...యజన్తే సాత్త్వికా దేవాన్యక్ష- , , .17 -4,,,//.....సప్తదశోధ్యాయము - శ్రద్ధాత్రయవిభాగయోగము

జైశ్రీరామ్.

|| 17-3 ||

శ్లో.  సత్త్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత|

శ్రద్ధామయోయం పురుషో యో యచ్ఛ్రద్ధః ఏవ సః. || 

తే.గీవ్యక్తియొక్క స్వభావంబుననుసరించి

శ్రద్ధయుండును మనుజులన్, శ్రద్ధ నొప్పు

నతడు నిరతంబు, శ్రద్ధయునతులితముగ

నొప్పునెట్టిదోవ్యక్తిత్వమొప్పునటులె.

భావము.

అర్జునా! ప్రతివారిలోను వ్యక్తి యొక్క స్వభావాన్ని అనుసరించి అతని శ్రద్ధ ఉంటుంది

మానవుడు శ్రద్ధా మయుడు. ఎవరి శ్రద్ధ ఎటువంటిదో వాళ్ళ వ్యక్తిత్వం అటువంటిది ఔతుంది.

|| 17-4 ||

శ్లోయజన్తే సాత్త్వికా దేవాన్యక్షరక్షాంసి రాజసాః|

ప్రేతాన్భూతగణాంశ్చాన్యే యజన్తే తామసా జనాః. ||

తే.గీదేవతల గొల్చు సాత్వికుల్ దివ్యముగను,

రాజసికులింక యక్షులన్ రాక్షసులను,

తామసికపాళి భూతప్రేతముల గొలుచు,

నీవు గ్రహియింపుమర్జునా నేర్పు మీర.

భావము.

సాత్వికులు దేవతలను, రాజసికులు యక్షరాక్షసులను, తామసికులు 

భూత ప్రేత గణాలను ఆరాధిస్తారు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.