గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

11, నవంబర్ 2022, శుక్రవారం

తానహం ద్విషతః క్రురాన్సం - ...16 - 19...//....ఆసురీం యోనిమాపన్నా - , , .16 -20,,,//.....దైవాసురసమ్పద్విభాగయోగఃము.

 జైశ్రీరామ్.

 || 16-19 ||

శ్లో.  తానహం ద్విషతః క్రురాన్సంసారేషు నరాధమాన్|

క్షిపామ్యజస్రమశుభానాసురీష్వేవ యోనిషు.

తే.గీ.  నన్ను దూషించు కౄరులన్, నాదుభక్తు

ల నిల ద్వేషించునామూర్ఖులన్ గణించి

యాసురీయోనులన్ బుట్ట  నమరజేసి

శిక్షగొలుపుదు శిష్టుల రక్షణకని.

భావము.

ఇలా నన్ను ద్వేషించే కౄరులు, దుష్టులు, నరాధములను నిత్యమూ 

నేను అసురీ యోనుల్లోకి విసిరేస్తాను.

|| 16-20 ||

శ్లో.  ఆసురీం యోనిమాపన్నా మూఢా జన్మని జన్మని|

మామప్రాప్యైవ కౌన్తేయ తతో యాన్త్యధమాం గతిమ్.

తే.గీ. ఆసురీయోనిజుల్ నన్ను నరయ లేక

జన్మజన్మలకును నీచ జన్మలెత్తు,

పాపపంకిల జన్ములై పాపకూప

ముననె కృంగుచునుందురు వినుము పార్థ!

భావము.

అర్జునా! అసురీ జన్మను పొందిన మూర్ఖులు ప్రతి జన్మలోను నన్ను 

చేరకుండానే ఇంకా అధోగతికి పోతారు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.