గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

11, డిసెంబర్ 2022, ఆదివారం

అన్నపూర్ణే సదాపూర్ణే.....మాతా చ పార్వతీ దేవీ..... పద్యభావములు...... మేలిమి బంగారం నా సంస్కృతి.

జైశ్రీరామ్.

శ్లో.  అన్నపూర్ణే సదాపూర్ణే!  -  శంకర ప్రాణవల్లభే!  

జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం!  -  భిక్షాం దేహీ చ పార్వతీ!

తే.గీ. అన్నపూర్ణ! సదాపూర్ణ! యమర వినుత!

శంకరప్రాణ వల్లభా! సరసిజాక్షి!

జ్ఞాన వైరాగ్యములు మాలుఁ గలుగఁ జేయ

పార్వతీ! భిక్షనొసగుమ, ప్రణుతులమ్మ!

భావము. అన్నపూర్ణాదేవీ! ఓ సదాపూర్ణ స్వరూపిణీ! దేవతలచే 

ప్రశంసింపఁబడు ఓ తల్లీ! శివంకరుఁడయిన శంకరుని ప్రాణేశ్వరీ! 

నాకు హ్ఞానవైరాగ్యములు సిద్ధించుట కొరకు భిక్షను 

ప్రసాదించుమమ్మా!

శ్లో.  మాతా చ పార్వతీ దేవీ  -  పితా దేవో మహేశ్వరః!

బాంధవా శ్శివభక్తాశ్చ   -  స్వదేశో భువన త్రయమ్.

తే.గీ. పార్వతీమాత నా మాత! భక్త సులభ,

శివుఁడు నా తండ్రి, మెదలు నా చిత్తమందు,

వరలు  శివ భక్తులే నాకు బంధువులిల,

నా నివాసంబు గన భువనత్రయంబు. 

భావము.  నాతల్లి పార్వతీమాత. నా తండ్రి మహేశ్వరుఁడు. 

శివభక్తులే నా బంధువులు.  ముల్లోకములూ నా నివాస స్థానము.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.