గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

5, సెప్టెంబర్ 2026, శనివారం

సత్యాన్ని బోధించే గురువులకు, అన్ని రంగములలోనూ శిక్షణనిచ్చే గురువులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.

 జైశ్రీరామ్.

డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని స్మరించుకొంటూ

సత్యాన్ని బోధించే గురువులకు, అన్ని రంగములలోనూ శిక్షణనిచ్చే ఉపాధ్యాయులకు 

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.

శ్రీమన్మంగళమూర్తి సద్గురువు, రాశీభూత జ్ఞానాబ్ధియై

క్షేమంబున్ గలిగింప శాశ్వతముగాఁ జిత్తంబునే పెట్టుచున్

ధీమంతుండగు శిష్యునెన్ని జయముల్ దీపింప సచ్చిక్షణన్

బ్రేమన్ గొల్పు, మహాత్ములట్టి గురులన్ బ్రీతిన్ మదిన్ గొల్చెదన్.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.