28, మే 2024, మంగళవారం
ముచ్చర్ల బాపన కవి చెప్పిన అద్భుతమైన శ్లోకము. అంతరార్థం చెప్పుకోండి చూద్దాం.(ప్రహేళిక)
0 comments
జైశ్రీరామ్.
శ్లో. కజ్జలే కమలం భాతి
కాననే భాతి సుస్మితం,
కపటే చిత్రితం భాతి,
కవిరామే కిమద్భుతమ్?
వివరణ.
కజ్జలము = కాటుక,
కాటుకలో కమలం ప్రకాశిస్తుందిట,
కాననము = అడవి,
మంచి చిఱునవ్వు అడవిలో ప్రకాశిస్తుందిట,
కపట = మోసము,
మోసంలో చిత్రం ప్రకాశిస్తుందిట,
కవి రామునిలో ఎంతటి అద్భుతముంది!
అనే మనకు తోస్తుంది.
దీనిలోఏదైనా ఆంతర్యం ఉందంటారా? ఉంటే వివరించి చెప్పుకోండి చూద్దాం.
జైహింద్.
సోమరాజ,భీమ,జంగమ,గంగేశ,ఉమాపతి,దేవరా,ఫాల నేత్ర,పారగ,నీర ధారి,శూలి,శౌరి,చంద్రమౌళి,నట శేఖర,నింగి నేల,గర్భ"-శివస్తుతి"వృత్తము, .. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి,
0 comments
జైశ్రీరామ్.
సోమరాజ,భీమ జంగమా!శూలి శౌరి చంద్ర మౌళి!శూర ధీర విక్రమార్కమా!
విజృంభణ.సంచితార్ధ,పాపాలు,నిస్తేజ,దంచికొట్టు,ఫాలనేత్ర,ప్రకంపన,జాలమెల్ల,పాతకాళి,కాలనేమి,చాలటంచు,బూదియ,త్రాత,సృష్టి,గర్భ"భూత ప్రకోప"పృత్తము .. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి,
0 comments
జైశ్రీరామ్.
పంచ భూత విజృంభణంబున్!ఫాల నేత్రుని చూపులన్!పాతకాళి నశించి తీరున్!
విశ్వ విభు,వేదవేద్యు,బోది వృక్ష,రాధామయ,వేకువకల,శ్లోకిత,మాధవ,స్తుతి వర,ధన్యోపమ,పశుతుల్య,అరిషడుల,ధన్యతా,జ్ఞానినా,సుస్వప్న,గర్భ"ఆర్తి దూర"వృత్తము... రచన:-వల్లభవఝల ఆప్పల నరసింహమూర్తి,
0 comments
జైశ్రీరామ్.
వేద వేద్యు విశ్వ విభునిన్!వేకువ కల గాంచి నాడ!విశ్వ స్తుత్యు స్తోత్రము లున్!
27, మే 2024, సోమవారం
26, మే 2024, ఆదివారం
ఆంధ్ర బహ్వర్థ కావ్యాల సూచి. శ్రీమాన్ వైద్యం వేంకటేశ్వరాచార్యులు.
0 comments
బహ్వర్థ కావ్యాల సూచి
1.రాఘవపాండవీయము-ద్వ్యర్థి,
అలభ్యం,
వేములవాడభీమకవి విరచితం.
2.రాఘవపాండవీయము-ద్వ్యర్థి,
పింగళిసూరన విరచితం.
3.హరిశ్చంద్రనలోపాఖ్యానము-ద్వ్యర్థి,
భట్టుమూర్తి విరచితం.
4.నైషధపారిజాతీయము-ద్వ్యర్థి,
కృష్ణాధ్వరి విరచితం.
5.రాఘవవాసుదేవీయము- ద్వ్యర్థి,
అముద్రితం,తాళపత్రాలలోఉంది.,
చిత్రకవి సింగరాచార్యవిరచితం.
6.యాదవభారతీయము-ద్వ్యర్థి,
ప్రెగడరాజుచెన్నకృష్ణకవి విరచితం.
7.రామకృష్ణవిజయము-ద్వ్యర్థి,
అలభ్యం.
8.శివరామాభ్యుదయము-ద్వ్యర్థి,
పోడూరిపెదరామయామాత్యకృతం.
9.అచలాత్మజాపరిణయము-ద్వ్యర్థి,
కిరీటి వేంకటాచార్య విరచితం.
10.ధరాత్మజాపరిణయము-ద్వ్యర్థి,
కొత్తలంకమృత్యుంజయకవి కృతం.
11.రావణదమ్మీయము-ద్వ్యర్థి,
పిండిప్రోలు లక్ష్మణకవి విరచితం.
12.సౌగంధికాపారిజాతీయము- ద్వ్యర్థి,విక్రాలశ్రీనివాసాచార్యవిరచితం.
13.కృష్ణార్జునచరిత్ర-ద్వ్యర్థి,
మంత్రిప్రెగడసూర్యప్రకాశకవికృతం
14.వసు స్వారోచిషోపాఖ్యానము-
ద్వ్యర్థి,కొత్తపల్లి సుందరరామకవి
విరచితం.
15.ఏసు కృష్ణీయము-ద్వ్యర్థి,
గాడేపల్లికుక్కుటేశ్వరశాస్త్రికృతం.
16.ఖలకర్ణవిషాయనము-ద్వ్యర్థి,
పన్నాలబ్రహ్మయ్యశాస్త్రికృతం.
17.అచ్చాంధ్ర నిరోష్ట్య హరిశ్చంద్ర
నలోపాఖ్యానము-ద్వ్యర్థి,
గంగనామాత్య విరచితం.
18.నిర్వచనభారతగర్భరామాయణ
ము-
ద్వ్యర్థి,రావిపాటిలక్ష్మీనారాయణ
విరచితం.
19.ఏకవీర కుమారీయము-ద్వ్యర్థి,
గౌరీభట్లరామకృష్ణశాస్త్రికృతం.
20.యాదవ రాఘవీయము-ద్వ్యర్థి,
మైనంపాటికామేశ్వరామాత్య
విరచితం.
21.రాఘవపాండవీయము-ద్వ్యర్థి,
రావూరి దొరసామిశర్మవిరచితం.
22.రాజ్యలక్ష్మి-ద్వ్యర్థి,
మానూరు కృష్ణారావు విరచితం.
త్ర్యర్థికావ్యాలు
23.రాఘవ యాదవ పాండవీయము-
త్ర్యర్థి,ఎలకూచిబాలసరస్వతికృతం
24.రాఘవయాదవపాండవీయము-
త్ర్యర్థి,అయ్యగారి వీరభద్రకవి
విరచితం.
25.రామకృష్ణార్జునీయము-త్ర్యర్థి,
ఓరుగంటిసోమశేఖరకవి కృతం.
26.యాదవ రాఘవ పాండవీయము-
త్ర్యర్థి,నెల్లూరి వీరరాఘవకవి
విరచితం.
27.రాఘవ యాదవ పాండవీయము-
త్ర్యర్థి,ఉరుటూరివేంకటకృష్ణకవి
విరచితం
28.సారంగధరీయము-త్ర్యర్థి,
పోకూరికాశీపతి విరచితం.
చతురర్థికావ్యాలు
29.నలయాదవ రాఘవపాండవీయం-
చతుర్థి,గునుగుటూరువేంకటకవి
విరచితం.
30.నలయాదవరాఘవపాండవీరము-
చతురర్థి,అలభ్యం,
మరింగంటిసింగరాచార్యవిరచితం
ఈ రోజు మా గృహమును పావనము చేసిన మహనీయులు.
1 comments
ఈ చిరంజీవి నారాయణీయం ఎంత సుస్పష్టంగా ధారణ చేస్తున్నాడో చూస్తే ఆశ్చర్యపోకుండా మీరెలా ఉండగలరు? Naraayaneeyam @BHEL SGS 2
0 comments
24, మే 2024, శుక్రవారం
శ్రీధరీయం. 96 మరియు 97.బ్రహ్మశ్రీ ధూళిపాళ మహాదేవమణి
0 comments
జైశ్రీరామ్.
బ్రహ్మశ్రీ మహాదేవమణి ధూళిపాళ
🌹శ్రీధరీయం 96🌹
సద్యఃస్ఫూర్తి విరాజమాన ధిషణా
చాంపేయ సంపత్ప్రదామ్
విద్యుత్కోటి సమానగాత్ర రుచిరాం
వేదప్రభా శాటికామ్
మాద్య ద్వీక్షణ పుంజికా వివృత పశ్యత్ఫాల భాగ్యోదయామ్
పద్యార్చ్యాం మణిమానసాబ్జ నిలయామ్
శ్రీ శ్రీధరీం భావయే.
🌹మణిశింజిని 🌹
ఎంతటి మహాకవియైనా , పండితవరేణ్యుడైనా తనకు అవసరం అయిన సమయానికి తనకు సిద్ధించిన విషయం గుర్తుకు రాకపోతే ఎందుకూ లాభంలేదు.ఆసద్యఃస్ఫూర్తిని అమ్మవారే ప్రసాదించాలి.అది ధిషణ అనే మెరుపు తీగెల తో మెరిస్తే అదే కవిపండితులకు మంచి సంపద.దాన్ని ఆశాంభవీ దేవి ప్రసాదిస్తుంది.
🥀ఆతల్లి పయ్యెద గా వేసుకొనే వస్త్రం మామూలు బట్టకాదు.వేదచైతన్యమే ఆతల్లికి పైవస్త్రంగా మారింది.🥀 మన్మథ బాణాలకు కూడా లొంగని ఆ శాంకరీ దేవి మత్తెంకిచే చూపులకు శంకరుడు వివశుడై ఆనందంతో ఉప్పొంగ గా దేహచైతన్యంతో మరింత భాగ్యవంతుడౌతాడు.🥀ఆతల్లి నా మనోబ్జంలో నివసిస్తూ నా పద్యశ్లోకాలతో సేవింపదగినది అవుతోంది.అట్టి మదుపాస్య శ్రీధరిని సంభావిస్తున్నాను.🥀
🌹 శ్రీధరీయం 97 🌹
కోటీరంబు కవీంద్రకోటికి , వచఃకోటీక ఝాటోల్లసత్
శాటీకంబు విరించి బోటికి, మనస్సౌరభ్య ఘుంఘుంఘుమత్
పాటీరంబు మహత్ సుహృత్పటలికిన్ ,
ప్రాంచన్మనీషా స్ఫురత్
ధాటీకంబుల నీపదార్చనను సంభావించనీ శ్రీధరీ !
🌹మణిశింజిని 🌹
అమ్మా ! కవిశ్రేష్ఠులు సహితం నాపాండితిని వారి అవసరం మేరకు కిరీటం లా శిరోధార్యం చేసుకొనేలా ,
🥀నామాటలనే ఆరుద్రపురుగుల సమూహంతో అందగించే ఛందః శాటి భారతీదేవికి ఎదపై వస్త్రం అయ్యేలాగూ , నానిర్మల మైన మనస్సుయొక్కసురభిళం మహాత్ములపాలిట మంచిగంధం అయ్యేలాగూ చేసి , మిక్కిలి అతియించే నా బుద్ధి ప్రకాశం యొక్క ధాటితో నిత్యం నీ పాదాలను సేవించే లా నన్ను మలుచు తల్లీ శ్రీధరీ !🌹
🌸ధూళిపాళ మహాదేవమణి 🌸
జైహింద్.
తరుము,నురుగు,వెలుగుల,వరామ,"గర్భ గురుతమ"వృత్తము, .. రచన శ్రీవల్లభవఝల అప్పల నరసింహమూర్తి,.
0 comments
జైశ్రీరామ్
జైహింద్.