గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

2, అక్టోబర్ 2018, మంగళవారం

మత్సమః పాతకీ నాస్తి! మేలిమి బంగారం మన సంస్కృతి,

జైశ్రీరామ్.
శ్లో.మత్సమః పాతకీ నాస్తి! పాపఘ్నీ త్వత్సమా న హి!
ఏవం జ్ఞాత్వా మహాదేవి! యథాయోగ్యం తథా కురు!!
 తే.గీ. నన్నుఁ బోలిన పపిలేడెన్ని చూడ.
పాపులనుబ్రోవ నీవంటివారు లేరు.
పాపినైనట్టి నన్ను కాపాడవమ్మ. 
నీకు తోచిన విధముగా నీరజాక్షి.
భావము.ఓ మహాదేవి! నావంటి పాపాత్ముడు మరొకడు లేనేలేడమ్మా. అట్లే ప్రాణులు చేసిన పాపాలను నాశనం చేయుటలొ నీతో సరిసమానులు వేరొకరు లేనేలేరు మాతా! కావున నా ఈ వేడికోలును మన్నించి ఓ జననీ! ఏది, ఎట్లు ఉచితమని భావించెదవో, అది అట్లే చేయుమని అర్థించెదను.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
బాగుంది మంచి సూక్తి ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.