గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, అక్టోబర్ 2018, సోమవారం

భ్రమక,తనూజ,అనఘా ,ప్రతిభా,కులమాన, మోక్షమిచ్చు,పతనా, ఛేదించు,బీదెవరు,వేధనా,గర్భ"-వేర్పాటు"-వృత్తము.రచన;-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్.
భ్రమక,తనూజ,అనఘా ,ప్రతిభా,కులమాన, మోక్షమిచ్చు,పతనా, ఛేదించు,బీదెవరు,వేధనా,గర్భ"-వేర్పాటు"-వృత్తము.రచన;-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

"-వేర్పాటు"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.న.జ.త.న.జ.న.ర.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
వేరు పాటు తనమదేల?వేధింపకు పర కులాల!వెడలు స్వేచ్ఛ భారతిన్!
చేరలేని ప్రతిభ తోడ! ఛేదింతువె?ప్రతిభ తెల్వి!చెడుకు మోక్ష మిత్తువే?
పౌర నాడి మనసునెంచి!బాధించుట సమతయౌనె?పడును ఖ్యాతి భీతిలన్?                                                         బేర సార పదవులేల?బీదెవ్వడు?ధనికుడాయె!పిడుగు పాటు భ్రాంతినిన్?

1,గర్భగత"-భ్రమక"-వృత్తము.
బృహతీఛందము.ర.న.జ.గణములు.వృ.సం.379,ప్రాసగలదు.
వేరు పాటు తన మదేల?
చేర లేని ప్రతిభ తోడ!
పౌర నాడి మనసు నెంచి!
బేర సార పదవులేల?

2.గర్భగత"-తనూజ"-వృత్తము.
బృహతీఛందము.త.న.జ.గణములు.వృ.సం.381.ప్రాసగలదు.
వేధింపకు పర కులాల?
ఛేదింతువె?ప్రతిభ తెల్వి!
బాధించుట సమత యౌనె?
బీదెవ్వడు?ధనికు డాయె?

3.గర్భగత"-అనఘా"-వృత్తము.
అనుష్టుప్ఛందము.న.ర.లగ.గణములు.వృ.సం.88.ప్రాసగలదు.
వెడలు స్వేచ్ఛ భారతిన్!
చెడుకు ముక్తి నిత్తువే?
పడును ఖ్యాతి భీతిలన్!
పిడుగు పాటుభ్రాంతినిన్!

4.గర్భగత"-ప్రతిభా"-వృత్తము.
ధృతిఛందము.ర.న.జ.త.న.జ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
వేరుపాటు తనమదేల?వేధింపకు?పర కులాల!
చేరలేని ప్రతిభతోడ!ఛేదింతువె?ప్రతిభ తెల్వి!
పౌర నాడి మనసు నెంచి!బాధించుట సమత యౌనె?
బేర సార పదవులేల?బీదెవ్వడు?ధనికుడాయె!

5.గర్భగత"-కులమాన"-వృత్తము.
అత్యష్టీఛందము.త.న.జ.న.ర.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
వేధింపకు?పర కులాల!వెడలు స్వేచ్ఛ భారతిన్?
ఛేదింతువె?ప్రతిభ తెల్వి!చెడుకు ముక్తి నిత్తువే?
బాధించుట సమత యౌనె?పడును ఖ్యాతి భీతిలన్!
బీదెవ్వడు?ధనికుడాయె!పిడుగు పాటు భ్రాంతినిన్!

6.గర్భగత.లఘ్వంత"-ముక్తినొసగు"-
ఉత్కృతిఛందము.త.న.జ.న.ర.య.జ.న.గల.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
వేధింపకు?పర కులాల!వెడలు స్వేచ్ఛ భారతిం!వేరుపాటు తన మదేల?
ఛేదింతువె?ప్రతిభ తెల్వి!చెడుకు ముక్తి నిత్తువే?చేరలేని ప్రతిభ తోడ!
బాధించుట సమత యౌనె?పడును ఖ్యాతి భీతిలం!పౌరనాడి,మనసు నెంచి!                                                                                      
బీదెవ్వడు?ధనికుడాయె!పిడుగుపాటు భ్రాంతినిం!బేరసార పదవు లేల?

7.గర్భగత"-పతనా"-వృత్తము
అత్యష్టీఛందము.న.ర.య.జ.న.గల.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
వెడలు స్వేచ్ఛ భారతిం!వేరుపాటు తనమదేల?
చెడుకు ముక్తి నిత్తువే?చేరలేని ప్రతిభ తోడ!
పడును ఖ్యాతి భీతిలం!పౌర నాడి మనసు నెంచి!
పిడుగుపాటు భ్రాంతినిం!బేరసార పదవు లేల?

8.గర్భగత.లఘ్వంత"-ఛేదింపు.
ఉత్కృతిఛందము.న.ర.య.జన.ర.భ.న.గల.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
వెడలు స్వేచ్ఛ భారతిం!వేరుపాటు తనమదేల?వేధింపకు!పరకులాల!
చెడుకు ముక్తి నిత్తువే?చేరలేని ప్రతిభ తోడ!ఛేదింతువె?ప్రతిభ తెల్వి?
పడును ఖ్యాతి భీతిలం!పౌర నాడి మనసు నెంచి!బాధించుటసమత యౌనె?                                                         పిడుగుపాటు భ్రాంతినిం!బేరసార పదవు లేల? బీదెవ్వడు?ధనికుడాయె!

9.గర్భగత"-బీదెవరు"-వృత్తము.
ధృతిఛందము.త.న.జ.ర.న.జ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
వేధింపకు!పరకులాల!వేరుపాటు తనమదేల?
ఛేదింతువె?ప్రతిభ తెల్వి?చేరలేని ప్రతిభ తోడ!
బాధించుట సమత యౌనె?పౌరనాడి మనసు నెంచి!
బీదెవ్వడు?ధనికుడాయె!బేరసార పదవు లేల?

10,గర్భగత"-వేధనా"-వృత్తము.
ఉత్కృతిఛందము.త.న.జ.ర.న.జ.న.ర.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
వేధింపకు!పరకులాల!వేరుపాటు తనమదేల?వెడలు స్వేచ్ఛ భారతిన్?
ఛేదింతువె?ప్రతిభ తెల్వి?చేరలేని ప్రతిభ తోడ!చెడుకు ముక్తి నిత్తువే?
బాధించుట!సమత యౌనె?పౌరనాడి మనసునెంచి!పడును ఖ్యాతి భీతిలన్?                                                         బీదెవ్వడు?ధనికుడాయె!బేరసార పదవులేల?పిడుగుపాటుభ్రాంతినిన్!
స్వస్తి
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
వేరుపాటు తనమెందులకు,పరకులాలను వేధింప వలదు " అని అన్ని వృత్తములలోను చక్కగా వివరించినారు. వల్లభవఝుల వారికి ధన్య వాదములు . శ్రీ చింతా సోదరులకు అభినందనలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.