గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, అక్టోబర్ 2018, గురువారం

పరోపదేశే పాణ్డిత్యం ..... మేలిమి బంగారం మన సంస్కృతి,

జైశ్రీరామ్.
శ్లో. పరోపదేశే పాణ్డిత్యం సర్వేషాం సుకరం నృణామ్|
ధర్మే స్వీయమనుష్టానం కస్యచిత్ సుమహాత్మనః ||

తే.గీ. చెప్పుటన్నది సులభము. చేయలేము.
ధర్మభోధన పరులకు. తానకు కాదు.
మహితమొనరించి చెప్పుట. మాన్యులెపుడు
చేసి చెప్పుదురిలను సద్భాస మహిత!
భావము.
ఇతరులకు ధర్మాన్ని ఉపదేశించడం అందరికీ చాలా తేలికైన పని.ఆ ధర్మముయందు ఆచరణము అనునది ఏ ఒక్క మహాత్ముడి యందే ఉండును.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అవును చెప్పడం కంటే ఆచరించడం వలన మంచి ఫలితముండును చక్కగా వివరించారు . ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.