గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

9, జూన్ 2018, శనివారం

వటవృక్షో మహానేష మార్గమావృత్యతిష్థతి .. .. .. బ్రహ్మశ్రీ కొరిడే విశ్వనాథమ్.


జైశ్రీరామ్.
." వటవృక్షో మహానేష మార్గమావృత్యతిష్థతి | 
తావత్త్వయా న గన్తవ్యం యావన్నాన్యత్ర గచ్ఛతి ||
భావము. 
వటవృక్ష మిక్కడ మార్గమునావరించి ఉన్నది. 
అది మరొకచోటుకు వెళ్ళునంతవరకు నీవు వెళ్ళకు. 
అని దానర్థం.
ఇక్కడ ఎవరి కి చెప్పబడుతున్నదో అనే మధ్యమపురుషవచనపదం 
కాని 

లేదా సంబోధనకాని లేదు. 

వృక్షము మరొకచోటికి వెళ్ళుట అనే విరోధముకూడ చెప్పబడుతున్నది. 

ఈ సమస్యా పరీష్కారమార్గము కేవలము పదవిచ్ఛేదము మాత్రమే చూపఁగలుఁగును. 

'వటవృక్ష' ఆనేచోట 

వటవృక్ష = మఱ్ఱిచెట్టు. 

ఆ విధముగ కాకుండా

వటో, + ఋక్ష అనివిడదీసినచో 

" ఓ బ్రహ్మచారి ! 

ఋక్షము అనగా ఎలుగుబంటి 

మార్గమునావరించి 
ఉన్నది." 
ఈ విధముగ పదచ్ఛేదము చేసినంతనే ఇందలి విరోధము ఆభాసమే అని వ్యక్తమగును.
ఇక 
వటోవృక్ష పదముల కలయికలో ఉన్న సంధిని విచారించినచో 

వటో + ఋక్ష అనుచోట 
'ఏచోయవాయావః' ఆనే సూత్రం ప్రకారము 
ఓకారస్థానమున 'అవ్ ' ఆదేశముగా వచ్చి 
వటవృక్ష అని సిద్ధించును.
స్వస్తి.
మీ
కొరిడె విశ్వనాథశర్మ,
ధర్మపురి.
బ్రహ్మశ్రీ కొరిడే విశ్వనాథమ్ పండిత వరులకు ధన్యవాద పూర్వక ప్రణామములు.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.