గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, జూన్ 2018, శుక్రవారం

విరహ, సిరినిలయ, మంగళకర, వెలయౌ, శశిసమ, ములుకుల, స్వర్భాను, తిలకినీ, మూల్యతా, అతీత, గర్భ"-కలి కలన"-వృత్తము.రచన:-శ్రీవల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.

జైశ్రీరామ్.

విరహ, సిరినిలయ, మంగళకర, వెలయౌ, శశిసమ, ములుకుల, స్వర్భాను, తిలకినీ, మూల్యతా, అతీత, గర్భ"-కలి కలన"-వృత్తము.

రచన:-శ్రీవల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
జుత్తాడ.

"-కలి కలన"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.స.ర.స.స.య.స.మ.గగ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
కలి కలన రంగఃస్థలిం?కలికే! మలుకై జనం?కాపుర మేమౌ?నూహింపంగా?
విలువల కతీతంబునై?విలువెంచక నీచతం?వేపుచు వీపుం జూచేతీరున్?
తెలివిగ నటింపేమిటో??తిలకింపగ దుష్టతం?  తీపియు చేదై   గన్పట్టున్లే?
బలిదముఘటింపనం?బలిచేయును ఖ్యాతినిం?బాపురె!భర్తేమౌ!నెంచన్?

1.గర్భగత"-విరహ"-వృత్తము.
బృహతీఛందము.న.స.ర.గణములు.వృ.సం.160.ప్రాసగలదు.
కలి కలన రంగఃస్థలిన్?
విలువల కతీతంబునై?
తెలివిగ నటింపేమిటో?
బలిదము ఘటిం పనం?

2.గర్భగత"-సిరినిలయ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.స.స.లగ.గణములు.వృ.సం.92.ప్రాసగలదు.
కలికే?ములుకై జనన్?
విలువెంచక నీచతన్?
తిలకింపగ దుష్టతన్?
బలి చేయును ఖ్యాతినిన్?

3.గర్భగత"మంగళకర"-వృత్తము.
బృహతీఛందము.భ.మ.మ.గణములు.వృ.సం.07.సనీగలదు.
కాపురమేమౌ? నూహింపంగా?
వేపుచు వీపుంజూచే తీరున్?
తీపియు చేదై గన్పట్టున్లే?
బాపురె!భర్తేమౌ?నెంచన్?

4.గర్భగత"-వెలయౌ"-వృత్తము.
అత్యష్టీఛందము.న.స.ర.స.స.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
కలి కలన రంగఃస్థలిం? కలికే?ములుకై జనన్?
విలువల కతీతంబునై?విలువెంచక నీచతన్?
తెలివిగ నటింపేమిటో?తిలకింపగ! దుష్టతన్?
బలిదము ఘటింపనం?బలిచేయయును! ఖ్యాతినిన్?

5.గర్భగత"-శశిసమ"-వృత్తము.
అత్యష్టీఛందము.స.స.య.స.మ.గగ.గణములు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
కలికే! ములుకై జనం?కాపుర మేమౌ?నూహింపంగా?
విలువెంచక నీచతం?వేపుచు వీపుంజూచే!తీరున్?
తిలకింపగ దుష్టతం?తీపియు చేదై గన్పట్టున్లే?
బలిచేయును ఖ్యాతినిం?బాపురె! భర్తేమౌ?నెంచన్?

6.గర్భగత"-ములుకుల"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.స.య.స.మ.త.న.జ.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
కలికే!ములుకై జనం?కాపుర మేమౌ!నూహింపంగా?కలి కలన రంగఃస్థలిన్?
విలువెంచక నీచతం?వేపుచు వీపుంజూచే!తీరుం?విలువల కతీతంబునై?
తిలకింపగ!దుష్టతం!తీపియు చేదై గన్పట్టున్లే?తెలివిగ నటింపేమిటో?
బలిచేయును ఖ్యాతినిం?బాపురె!భర్తేమౌ?నెంచన్!బలిదము!ఘటింపనం?

7.గర్భగత"-స్వర్భాను"-వృత్తము.
ధృతిఛందము.భ.మ.మ.న.స.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
కాపుర మేమౌ?నూహింపంగా?కలి కలన రంగఃస్థలిన్?
వేపుచు వీపుం జూచే తీరుం?విలువల కతీతంబునై?
తీపియు చేదై గన్పట్టున్లే?    తెలివిగ   నటింపేమిటో?
బాపురె!భర్తేమౌ?నెంచం?బలిదము ఘటింపనం?

8.గర్భగత"-తిలకినీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.మ.మ.న.స.ర.స.స.లగ.గణములు.యతులు.10,19.ప్రాసనీమముగలదదు.
కాపుర మేమౌ?నూహింపంగా?కలి కలన రంగఃస్థలిం?కలికే!ములుకై జనన్?
వేపుచువవీపుంజూచే తీరుం?విలువల కతీతంబునై?విలువెంచక నీచతన్?
తీపియు చేదై!గన్పట్టున్లే?తెలివిగ నటింపేమిటో?తిలకింపగ దుష్టతం?
బాపురె!భర్తేమౌ?నెంచం?బలిదము ఘటింపనం?బలిచేయునుఖ్యాతినిన్?

9.గర్భగత"-మూల్యతా"-వృత్తము.
అత్యష్టీఛందము.స.స.జ.న.య.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
కలికే!ములుకై జనం?కలి కలన రంగః స్థలిన్?
విలువెంచక నీచతం?విలువల కతీతంబై?
తిలకింపగ దుష్టతం?తెలివిగ నటింపేమిటో?
బలిచేయును ఖ్యాతినిం?బలిదము ఘటింపనం?

10,గర్భగత"-అతీత"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.స.జ.న.య.య.స.మ.గగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
కలికే!ములికై జనం?కలి కలన రంగఃస్థలిం?కాపుర మేమౌ?నూహింపంగా?
విలువెంచక నీచతం?విలువల కతీతంబై?వేపుచు వీపుంజూచే తీరున్?
తిలకింపగ దుష్టతం?తెలివిగ నటింపేమిటో?  తీపియు చేదై గన్పట్టున్లే?
బలిచేయును ఖ్యాతినిం?బలిదము ఘటింపనం?బాపురె?భర్తేమౌ?నెంచన్?
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.