గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, జూన్ 2018, బుధవారం

భాసిజ,శ్రీనామక,మత్తరజినీ,నధర్మ,సాయజ,నిస్వర,స్ఫూర్తినీ,నేతనెంచు,భాసయాన,నీవినాపుగర్భ"-శ్రీర్మహిమా"-వృత్తము. రచన:-శ్రీవల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.

జైశ్రీరామ్.

భాసిజ,శ్రీనామక,మత్తరజినీ,నధర్మ,సాయజ,నిస్వర,స్ఫూర్తినీ,నేతనెంచు,భాసయాన,నీవినాపుగర్భ"-శ్రీర్మహిమా"-వృత్తము.
రచన:-శ్రీవల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
జుత్తాడ.

"-శ్రీర్మహిమా"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.స.జ.భ.స.య.జ.స.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
తప్పు నెరిగి జేసెదేల?ధర్మ మెరిగి వీడుచున్?దాత నీవి నాపెదేలనో?
నిప్పునిముర కాలుగాదె?నిర్మలతకు దూరుతం?!నేత,త్రాత నెంచ రేమొకో?
చిప్ప చివర చేతికొచ్చు?శ్రీర్మహిమ పొసంగునే?చేతనంబు కుంటి సాకగున్?
గొప్పయగునె?దుర్మదంబు?కూర్మిగనని జీవులం! లేని ప్రేత భంగిమన్?


1.గర్భగత"-భాసిజ"-వృత్తము.
బృహతీఛందముభ.స.జ.గణములు.వృ.సం.351.ప్రాసగలదు.
తప్పు నెరిగి చేసెదేల?
నిప్పు నిముర కాలుగాదె?
చిప్ప చివరచేతి కొచ్చు?
గొప్ప యగునె?దుర్మదంబు?

2.గర్భగత"-శ్రీనామక"-వృత్తము.
అనుష్టుప్ఛందము.భ.స.లగ.గణములగ.వృ.సం.95.ప్రాసగలదు.
ధర్మ మెరిగి వీడుచున్?
నిర్మలతకు దూరుడౌ?
శ్రీర్మహిమ పొసంగునే?
కూర్మి గనని జీవులం?

3.గర్భగత"-మత్తరజినీ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.ప్రాసగలదు.
దాత నీవి నాపెదేలనో?
నేత త్రాత నెంచ రేమొకో?
చేతనంబు కుంటి సాకగున్?
కూత లేని ప్రేత భంగిమన్

4.గర్భగత"-నధర్మ"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.స.జ.భ.స.లగ.గణములు.యతి.10,వయక్షరము.
ప్రాసనీమముగలదు.
తప్పు నెరిగి జేసె దేల?ధర్మ మెరిగి వీడుచున్?
నిప్పు నిముర కాల్చు గాదె?నిర్మలతకు దూరుడౌ?
చిప్ప చివర చేతికొచ్చు?శ్రీర్మహిమ పొసంగునే?
గొప్ప యగునె?దుర్మదంబు?కూర్మి గనని జీవులన్?

5.గర్భగత"-సాయజ"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.స.య.జ.ర.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
ధర్మ మెరిగి వీడుచుం?దాత నీవి నాపె దేలనో?
నిర్మలతకు దూరుడౌ?నేత త్రాత నెంచ రేమొకో?
శ్రీర్మహిమ పొసంగునే?చేతనంబు కుంటి సాకగున్?
కూర్మిగనని జీవులం?కూత లేని ప్రేత భంగిమన్?

6.గర్భగత"-నిస్వర"-వృత్తము
ఉత్కృతి ఛందము.భ.స.య.జ.ర.య.ప.జ.గల.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
ధర్మ మెరిగి వీడుచుం?దాత నీవి నాపెదేలనో? తప్పు  నెరిగి  జేసె దేల?
నిర్మలతకు దూరుడౌ?నేత త్రాత, నెంచ రేమొకో?నిప్పు నిముర గాల్చు గాదె?
శ్రీర్మహిమ పొసంగునే?చేతనంబు కుంటి సాకగుం?చిప్ప చివర చేతికొచ్చు?కూర్మిగనని జీవులం?కూత లేని ప్రేత భంగిమం?గొప్పయగునె?దుర్మదంబు?

7.గర్భగత"స్ఫూర్తిననీ"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.భ.స.జ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
దాత నీవి నాపె దేలనో?తప్పు నెరిగి జేసె దేల?
నేత,త్రాత నెంచ రేమొకో?నిప్పు నిముర కాల్చు గాదె?
చేతనంబు కుంటి సాకగుం?చిప్ప చివర చేతి కొచ్చు?
కూతలేని ప్రేత భంగిమం?గొప్ప యగునె?దుర్మదంబు?

8.గర్భగత"నేతననెంచు"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.భ.స.జ.భ.స.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
దాత నీవి నాపె దేలనో?తప్పు నెరిగి జేసె దేల?ధర్మ మెరిగి వీడుచున్?
నేత,త్రాత, నెంచ రేమొకో?నిప్పు నిముర కాల్చు గాదె?నిర్మలతకు దూరుడౌ?
చేతనంబు కుంటి సాకగుం?చిప్ప చివర చేతికొచ్చు?శ్రీర్మహిమ పొసంగునే?
కూత లేని ప్రేత  భంగిమం?గొప్ప యగునె?దుర్మదంబు?కూర్మిగనని జీవులన్?

9.గర్భగత"-భాసయాన"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.స.య.న.జ.గల.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
ధర్మ మెరిగి వీడుచుం?తప్పు నెరిగి జేసె దేల?
నిర్మలతకు దూరుడౌ?నిప్పు నిముర కాల్చు గాదె?
శ్రీర్మహిమ పొసంగునే?చిప్ప చివర చేతికొచ్చు?
కూర్మిగనని జీవివై?గొప్పయగునె?దుర్మదంబు?

10,గర్భగత"-నీవినాపు"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.స.య.న.జ.ర.జ.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
ధర్మ మెరిగి వీడుచో?తప్పు నెరిగి జేసె దేల?దాత నీవి నాపె దేలనో?
నిర్మలతకు దూరుడౌ?నిప్పు నిముర కాల్చు గాదె?నేత,త్రాత,నెంచ వేమిటో?
శ్రీర్మహిమ పొసంగునే?చిప్ప చివర చేతికొచ్చు?చేతనంబు కుంటి సాకగున్?
కూర్మి గనని జీవులం?గొప్ప యగునె?దుర్మదంబు?కూత లేని ప్రేత భంగిమన్?
స్వస్తి.
మూర్తి.జుత్తాడ..
జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.