గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

26, జూన్ 2018, మంగళవారం

జన్మప్రభృతి యత్కించిత్ సుకృతం . .. .. .. మేలిమి బంగారం మన సంస్కృతి,

జైశ్రీరామ్.
శ్లో. జన్మప్రభృతి యత్కించిత్ సుకృతం సముపార్జితమ్|
తత్సర్వం నిష్ఫలం యాతి ఏకహస్తాభివాదనాత్ || ~ మనుస్మృతి 2/8
తే.గీ. వందనము చేయునప్పుడు వంచి శిరము
హస్తములు రెండు జోడించి మస్తకమున
చేయవలెనొంటి చేతితో చేసిరేని
పుణ్యఫలమెల్ల నశియించు పుఉజ్యులార.
భావము. మనము ఎక్కడయినా ఎవరికయినా ఒక చేతితో మాత్రమే నమస్కరించినచో పుట్టిన కాలమునుండి కావించి ఆర్జించిన సమస్తపుణ్యసంచయమంతయునూ నిష్ఫలమగును.
వందే భారత మాతరమ్.
Print this post

1 comments:

కంది శంకరయ్య చెప్పారు...

బాగుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.