గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, జూన్ 2018, శుక్రవారం

గతికా,సమాశ్రీ,గతిమా,సమాశ్రీ,నోపని,కరడగు,దుశ్చింత,బలియౌ,పొన్నొదవు,మారణ, గర్భ-"వెలితిలు"-వృత్తము.రచన:-శ్రీవల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్.

గతికా,సమాశ్రీ,గతిమా,సమాశ్రీ,నోపని,కరడగు,దుశ్చింత,బలియౌ,పొన్నొదవు,

మారణ, గర్భ-"వెలితిలు"-వృత్తము.

రచన:-శ్రీవల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
జుత్తాడ.
-"వెలితిలు"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.జ.ర.జ.భ.జ.జ.గల.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
కరడుగట్టె దుష్ట చింత!కానదాయె?నీతినెంచ!కలి మారణ హోమమందు?
పరుగు దీసె జాతి నీతి!వాన గాలిమేఘమట్లు?బలియైరని తెల్సి కోరు?
పెరల బాగు నోపరైరి?వే నడంచు తీరు తప్పు?వెలితౌ గదె?భావి తీరు?
విరుగుబాటు!నిల్చు నొక్కొ?వినరేమి?మంచికొంత!విలువేదిల?లోకమింతె?

1.గర్భగత"-గతికా"-వృత్తము.
బృహతీఛందము.న.ర.జ.గణములు.వృ.సం.344.ప్రాసగలదు.
కరడుగట్టె దుష్ట చింత!.
పరుగుదీసె జాతి నీతి!
పెరల బాగు నోపరైరి?
విరుగుబాటు నిల్చు నొక్కొ?

2.గర్భగత"-సమాశ్రీ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.జ.గల.గణములు.వృ.సం.171.ప్రాసగలదు.
కానదాయె?నీతి నెంచ!
వాన గాలిమేఘమట్లు?
వే నడంచు తీరు తప్పు?
వినరేమి?మంచి కొంత?

3.గర్భగత"-గతిమా"-వృత్తము.
బృహతీఛందము.స.స.జ.గణములు.వృ.సం.348.ప్రాసగలదు.
కలి మారణ హోమమందు?
బలియైరని తెల్సి కోరు?
వెలితౌ గదె?భావి తీరు!
విలువేదిల?లోక మింతె!

4.గర్భగత"-సుమాశ్రీ"-వృత్తము.
అత్యష్టీఛందము.న.ర.జ.ర.జ.గల.గణములు.యతి.10.యవయక్షరము.
ప్రాసనీమముగలదు.
కరడు గట్టె దుష్ట చింత?కానదాయె ?నీతి నెంచ?
పరుగుదీసె జాతినీతి?వాన,గాలి మేఘమట్లు?
పెరల బాగు నోపరైరి?వే నడంచు తీరు తప్పు?
విరుగుబాటు నిల్చు నొక్కొ?వినరేమి?మంచికొంత?

5.గర్భగత"నొపని"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.భ.జ.జ.గల.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
కానదాయె నీతినెంచ?కలి మారణ హోమమందు?
వాన,గాలి మేఘమట్లు?బలియైరని తెల్సికోరు?
వే నడంచు తీరు తప్పు?వెలితౌ గదె?భావి తీరు!
వినరేమి?మంచికొంత?విలువేదిల? లోకమింతె?

6.గర్భగత"-కరడగు"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.భ.జ.జ.భ.స.జ.గల.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
కానదాయె నీతినెంచ?కలి మారణహోమ మందు?కరడుగట్టె దుష్టచింత?
వాన,గాలి మేఘమట్లు?బలియైరని తెల్సికోరు?పరుగుదీసె జాతి నీతి?
వేనడంచు తీరు తప్పు వెలితౌగదె?భావితీరు!పెరలబాగు నోపరైరి?
వినరేమి?మంచికొంత?విలువేదిల? లోకమింతె?విరుగుబాటు నిల్చు నొక్కొ?

7.గర్భగత"-దుశ్చింత"-వృత్తము.
ధృతిఛందము.స.స.జ.న.ర.జ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
కలి మారణ హోమమందు?కరడుగట్టె  దుష్టచింత?
బలియైరని తెల్సికోరు?పరుగుదీసె జాతినీతి?
వెలితౌగదె?భావితీరు! పెరల బాగు నోపరైరి?
విలువేదిల?లోకమింతె?విరుగుబాటు నిల్చు నొక్కొ?

8.గర్భగత"-బలిఉత్కృతిఛందము
ఉత్కృతిఛందము.స.స.జ.న.ర.జ.ర.జ.గల.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
కలి మారణ హోమమందు?కరడు గట్టె దుష్టచింత?కానదాయె నీతినెంచ?
బలియైరని తెల్సికోరు?పరుగుదీసె జాతినీతి?వాన,గాలి మేఘమట్లు?
వెలితౌ గదె?భావితీరు!పెరల బాగు నోపరైరి? వే నడంచుతీరు తప్పు?
విలువేదిల?లోకమింతె?విరుగుబాటు నిల్చునొక్కొ?వినరేమి?మంచికొంత?

9.గర్భగత"-పొన్నొదవు"-వృత్తము.
అత్యష్టీఛందము.త.జ.భ.స.జ.గల.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
కానదాయెనీతి నెంచ?కరడు గట్టె దుష్ట చింత?
వాన,గాలి మేఘమట్లు?పరుగుదీసె జాతి నీతి?
వే నడంచు తీరు తప్పు?పెరల బాగు నోపరైరి?
వినరేమి?మంచికొంత?విరుగుబాటు నిల్చు నొక్కొ?

10.గర్భగత"-మారణ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.భ.స.జ.భ.జ.జ.గల.గణములు.యతులు.9,18.
ప్రాసనీము కలదు.
కానదాయె నీతినెంచ?కరడు గట్టె దుష్ట చింత?కలి మారణహోమమందు?
వాన,గాలి మేఘమట్లు?పరుగుదీసె జాతి నీతి?బలియైరని తెల్సి కోరు?
వే నడంచు తీరు తప్పు?పెరల బాగు నోపరైరి?వెలితౌగదె?భావి తీరు?
వినరేమి?మంచికొంత?విరుగుబానిల్చు నొక్కొ?విలువేదిల?లోకమింతె?
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
Print this post

1 comments:

sam చెప్పారు...

dear sir very good blog and very good content
Telugu News

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.