గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, జూన్ 2018, ఆదివారం

రసయాద్వయ,మృదుమానస,రసయారస,భీతచేతనాద్వయ,మౌనగీతిద్వయ,ధృతిరసయా,యశోయశ,గర్భస్వాతిముత్య"-వృత్తము."- రచన. శ్రీ వల్లభవఝల అప్పల నరసింహమూర్తి., జుత్తాడ.

జైశ్రీరామ్.
రసయాద్వయ,మృదుమానస,రసయారస,భీతచేతనాద్వయ,మౌనగీతిద్వయ,ధృతిరసయా,యశోయశ,గర్భస్వాతిముత్య"-వృత్తము."-  రచన. శ్రీ వల్లభవఝల అప్పల నరసింహమూర్తి., జుత్తాడ.

స్వాతిముత్య"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.స.య.ర.స.య.జ.త.గగ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
భీతచేతనవీడుమయ్యా!ప్రీతినొందుమలోకముం?ప్రేమ గొల్వుమి దేవతాళిన్!
జాతినీతిని నిల్పుమోయీ!స్వాతిముత్యము తీరునం?సామతం!చతురుండ వౌచున్?
త్రాత దైవము మెచ్చుకోలై?రాతిబొమ్మవుగాకుమా!రామ!యన్ననుమోక్ష! మౌరా?
దాతవోయన!నిల్పుకీర్తిం?తాత,తండ్రుల దల్చుమా!తామసంబది ఖ్యాతి మాపున్?

1.గర్భగత"-రసయా"-ద్వయ వృత్తములు.
బృహతీఛందము.ర.స.య.గణములు.వృ.సం.91.ప్రాసగలదు.
1.భీతచేతన వీడుమయ్యా!          2.ప్రేమ గొల్వుమి దేవతాళిన్?
   జాతి నీతిని నిల్పు మోయీ!          సామతం చతురుండ వౌచున్?
   త్రాత దైవము మెచ్చుకోలై?            రామ యన్నను మోక్ష మౌరా?
   దాతవో?యన నిల్పు కీర్తిన్?          తామసంబది ఖ్యాతి మాపున్?

2.గర్భగత"-మృదుమానస"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.స.లగ.గణములు.వృ.సం.91.ప్రాస గలదు.
ప్రీతి నొందుమ లోకమున్?
స్వాతి ముత్యము తీరునన్?
రాతి బొమ్మవు గాకుమా?
తాత,తండ్రుల దల్చుమా!

3.గర్భగత"-రసయారస"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.స.య.ర.స.లగ.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
భీత చేతన వీడుమయ్యా!ప్రేమ గొల్వుమి దేవతాళిన్?
జాతి నీతిని నిల్పు మోయీ!సామతం చతురుండ వౌచున్?
త్రాత దైవము మెచ్చు కోలై?రామ యన్నను మోక్ష మౌరా?
దాతవో?యన నిల్పు కీర్తిం?తామసంబది ఖ్యాతి మాపున్?

4.గర్భగత"-భీత చేతనా"-ద్వయ వృత్తము
అత్యష్టీఛందము.ర.స.య.జ.జ.గగ.గణములు.యతి.9.,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
1.ప్రీతి నొందుమ లోకముం?ప్రేమ గొల్వుమి దేవతాళిన్?
  స్వాతి ముత్యము తీరునం?సామతం చతురుండ వౌచున్?
  రాతి బొమ్మవు గాకుమా?రామ యన్నను మోక్షమమౌరా?
తాత తండ్రుల దల్చుమా!తామసంబది ఖ్యాతి మాపున్?

2.ప్రితి నొందుమ లోకముం?భీత చేతన వీడు మయ్యా!
   స్వాతి ముత్యము తీరునం?జాతి నీతిని నిల్పు మోయీ?
   రాతి బొమ్మవు గాకుమా?త్రాత దైవము మెచ్చు కోలై?
   తాత తండ్రుల దల్చుమా?దాతవో?యన నిల్పు కీర్తిన్?

5.గర్భగత"-మౌనగీతి"-వయ వృత్తములు.
ఉత్కృతిఛందము.ర.స.య.జ.జ.మ.జ.జ.గగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
ప్రీతి నొందుమ లోకముం?ప్రేమ గొల్వుమ దేవతాళిం?భీత చేతన వీడు మయ్యా?
స్వాతి ముత్యము తీరునం?సామతం చతురుండ వౌచుం?జాతి నీతిని.నిల్పు మోయీ?
రాతి బొమ్మవు గాకుమా?రామ యన్నను మోక్ష మౌరా?త్రాత దైవము మెచ్చు కోలై?
తాత తండ్రుల దల్చుమా?తామసంబది ఖ్యాతి మాపుం?దాతవో?యన నిల్పు కీర్తిన్?

2.ప్రీతి నొందుమ లోకముం?భీత చేతన వీడు మయ్యా?ప్రేమ గొల్వుమ దేవతాళిన్?
స్వాతి ముత్యము తీరునం?జాతినీతిని నిల్పు మోయీ?సామతం  చతురుండ వౌచున్?
రాతి బొమ్మవు గాకుమా?త్రాత దైవము మెచ్చు కోలై?రామ యన్నను మోక్ష మౌరా?
తాత తండ్రుల దల్చుమా?దాతవోయన?నిల్పు కీర్తిం?తామసంబది ఖ్యాతి మాపున్?

6.గర్భగత"-ధృతిరసయా"-వృత్తము.
ధృతిఛందము.ర.స.య.ర.స.య.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
ప్రేమ గొల్వుమ దేవతాళిం?భీత చేతన వీడు మయ్యా?
సామతం చతురుండ వౌచుం?జాతి నీతిని నిల్పు మోయీ?
రామ యన్నను మోక్ష మౌరా?త్రాత దైవము మెచ్చు కోలై?
తామసంబది ఖ్యాతి మాపుం?దాతవో?యన నిల్పు కీర్తిన్?

7.గర్భగత"మౌనాగీతి"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.స.య.జ.జ.మ.జ.జ.గగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
ప్రీతి నొందుమ లోకముం?భీత చేతన వీడు మయ్యా?ప్రేమ గొల్వుమి  దేవతాళిన్?
స్వాతి ముత్యము తీరునం?జాతి నీతిని నిల్పు మోయీ!సామతం చతురుండ వౌచున్?
రాతి బొమ్మవు గాకుమా?త్రాత దైవము మెచ్చు కోలై?రామ యన్నను మోక్ష మౌరా?
తాత తండ్రుల దల్చుమా!దాతవో?యన!నిల్పు కీర్తిం?తామసంబది ఖ్యాతి మాపున్?
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.