గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, జూన్ 2018, గురువారం

భానుజ,సమాశ్రీ,మత్తరజినీ,మాన్యమౌ,యతిర్నవ సుగంధి,చేజేతల,స్ఫురితా,దీనబంధు,తగుతగ,మాయామయ,గర్భ"-ప్రపూర్ణ"-వృత్తము. రచన:-వల్లభ వఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.

జైశ్రీరామ్.
భానుజ,సమాశ్రీ,మత్తరజినీ,మాన్యమౌ,యతిర్నవ సుగంధి,చేజేతల,స్ఫురితా,దీనబంధు,తగుతగ,మాయామయ,గర్భ"-ప్రపూర్ణ"-వృత్తము.
రచన:-వల్లభ వఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.
"-ప్రపూర్ణ"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.న.జ.ర.జ.ర.జ.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
మంచి చెడులు గలవాడ!మంచి పెంచి మాన్యుడౌమ?మాయలోన మ్రగ్గి  పోకుమా?
వంచనమును విడు మోయి!పంచు జాతి ఖ్యాతి నీతి?వాయసంబు జన్మ గాకుమా?
తృంచి భవిత మనకోయి!త్రెంచ శూన్య మౌను జాతి?తీయకోయి!చేతు  లారగన్?
పంచు సుఖము జనులందు!పంచ పాతకాలు వీడు?పాయసంబు చేదు చేయకన్?

1.గర్భగత"-భానుజ"-వృత్తము.
బృహతీఛందము.భ.న.జ.గణములు.వృ.సం.383,ప్రాసగలదు.
మంచి  చెడులు  గలవాడ!
వంచనమును విడు మోయి?
తృంచి భవిత మనకోయి!
పంచు సుఖము జనులందు!

2.గర్భగత"-సమాశ్రీ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.జ.గల.గణములు.వృ.సం.171.ప్రాసగలదు.
మంచి పెంచి మాన్యు డౌమ?
పంచు జాతి ఖ్యాతి  నీతి?
త్రెంచ శూన్య మౌను జాతి?
పంచ పాతకాలు వీడు?

3.గర్భగత"-మత్తరజినీ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.ప్రాసగలదు.
మాయ లోన మ్రగ్గి పోకుమా?
వాయసంబు జన్మ గాకుమా?
తీయ కోయి!చేతులారగన్?
పాయసంబు చేదు చేయకన్?

4.గర్భగత"-మాన్యమౌ"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.న.జ.ర.జ.గల.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
మంచి చెడులు గలవాడ!మంచి పెంచి మాన్యు డౌమ?
వంచనమును విడు మోయి?పంచుజాతి ఖ్యాతి నీతి?
తృంచి భవిత మనకోయి?త్రెంచ శూన్యమౌను. జాతి?
పంచు సుఖము జనులందు?పంచ పాతకాలు వీడు?

5.గర్భగత"-యతిర్నవ సుగంధి"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.జ.ర.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
మంచి పెంచి మాన్యు డౌమ?మాయలోన మ్రగ్గి పోకుమా?
పంచు జాతి ఖ్యాతి నీతి?వాయసంబు జన్మ గాకుమా?
త్రెంచ శూన్య మౌను జాతి?తీయకోయి చేతులారగన్?
పంచ పాతకాలు వీడు?పాయసంబు చేదు చేయకన్?

6.గర్భగత"-చేజేతల"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.జ.ర.య.న.న.గల.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
మంచి పెంచి మాన్యు డౌమ?మాయలోన మ్రగ్గి పోకుమా?మంచి చెడులు  గలవాడ!
పంచు జాతి ఖ్యాతి నీతి?వాయసంబు జన్మ గాకుమా?వంచనమును వీడు  మోయి?
త్రెంచ శూన్య మౌను జాతి?తీయకోయి?చేతులారగం?తృంచి భవిత మన కోయి?
పంచ పాతకాలు వీడు?పాయసంబు చేదు జేయకం?పంచు సుఖము  జనులందు?

7.గర్భగత"-స్ఫురితా"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.భ.న.జ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
మాయలోన మ్రగ్గి పోకుమా?మంచి చెడులు గలవాడ?
వాయసంబు జన్మ గాకుమా?వంచనమును వీడుమోయి?
తీయకోయి?చేతులారగం?తృంచి భవిత మనకోయి?
పాయసంబు చేదు జేయకం?పంచు సుఖము జనులందు?

8.గర్భగత"-దీనబంధు"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.భ.న.జ.ర.జ.గల.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
మాయ లోన మ్రగ్గి పోకుమా?మంచి చెడులు గల వాడ?మంచి పెంచిమాన్యు డౌమ?
వాయసంబు జన్మ గాకుమా?వంచనమును వీడు మోయి?పంచు జాతి.ఖ్యాతినీతిినిన్?                                          
తీయకోయి?చేతులారగం?తృంచి భవిత మనకోయి?త్రెంచ శూన్య మౌను జాతి?
పాయసంబు చేదుజేయకం?పంచు సుఖము జనులందు?పంచ పాతకాలు వీడు?

9.గర్భగత"-తగుతగ"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.న.న.గల.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
మంచి పెంచి మాన్యు డౌమ?మంచి చెడులు గలవాడ?
పంచు జాతి ఖ్యాతి నీతి?వంచనమును వీడు మోయి?
త్రెంచ శూన్య మౌను జాతి?తృంచి భవిత మనకోయి?
పంచ పాతకాలు వీడు?పంచు సుఖము జనులందు?

10.గర్భగత"-మాయామయ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.న.న.ర.జ.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
మంచి పెంచి మాన్యు డౌమ?మంచి చెడులు గలవాడ!మాయ లోన మ్రగ్గి పోకుమా?
పంచు జాతి ఖ్యాతి నీతి?వంచనమును వీడుమోయి?వాయసంబు జన్మ గాకుమా?
త్రెంచ శూన్య మౌను జాతి?తృంచి భవిత మనకోయి?తీయ కోయి చేతు లారగన్?
పంచ పాతకాలు వీడు?పంచు సుఖము జనులందు? పాయసంబు చేదు జేయకన్?
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.