గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, జూన్ 2018, మంగళవారం

గతికా,అనఘా,మత్తరజినీ,నశోచయ,మంచికోరు,తావళ,సునీతినీ,సౌరహీన,స్వభావ,మనుజనీతి,గర్భ"-తాడినీ"-వృత్తము.రచన:-శ్రీ వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్.
గతికా,అనఘా,మత్తరజినీ,నశోచయ,మంచికోరు,తావళ,సునీతినీ,సౌరహీన,స్వభావ,మనుజనీతి,గర్భ"-తాడినీ"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
జుత్తాడ.
"-తాడినీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.జ.న.ర.య.జర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
మరువరాదు మంచినీవు?మనసు మంచి కోరుమా?మాదకాలుముట్ట కెన్నడున్?
పరువు మాలి యొప్పరాదు?పనులయందు మేటివై?పాదు వౌచు కీర్తి నిల్పుమా!
తెరవు నెంచి నీతి నిల్పు!తెనుగు వెల్గు చాటుమా!ధీదితుల్వెలుంగ మన్నుమా!
కరము భక్తి మోక్ష మిచ్చు!కనుమ బీద సాదలం?కాదనేది? లేదు చూడగన్?

1.గర్భగత"-గతికా"-వృత్తము.
బృహతీఛందము.న.ర.జ.గణములు.వృ.సం.341.ప్రాసగలదు.
మరువరాదు?మంచి నీవు!
పరువు మాలి యొప్ప రాదు!
తెరవు నెంచి!నీతి నిల్పు!
కరము భక్తి మోక్షమిచ్చు!

2.గర్భగత"-అనఘా"-వృత్తము.
అనుష్టుప్ఛందము.న.ర.లగ.గణములు.వృ.సం.88.ప్రాసగలదు.
మనసు మంచి కోరుమా?
పనులయందు మేటివై?
తెనుగు వెల్గు చాటుమా!
కనుమ బీదసాదలన్?

3.గర్భగత"-మత్తరజినీ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.ర.గణములు వృ.సం.171.
ప్రాసగలదు.
మాదకాలు ముట్ట కెన్నడున్?
పాదువౌచు కీర్తి నిల్పుమా!
ధీదితు ల్వెలుంగ! మన్నుమా?
కాదనేది లేదు?చూడగన్?

4.గర్భగత"-నశోచయ"-వృత్తము.
అత్యష్టీఛందము.న.ర.జ.న.ర.లగ.గణములు.యతి.10,వయక్షరము
ప్రాసనీమముగలదు.
మరువ రాదు?మంచి నీవు?మనసు మంచి కోరుమా?
పరువు మాలి యొప్ప రాదు?పనులయందు మేటివై?
తెరవు నెంచి నీతి నిల్పు!తెనుగు వెల్గు చాటుమా!
కరము భక్తి మోక్ష మిచ్చు?కనుమ బీదసాదలన్?

5.గర్భగత"-మంచికోరు"-వృత్తము.
అత్యష్టీఛందము.న.జ.య.జ.ర.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
మనసు మంచి కోరుమా?మాదకాలు ముట్ట కెన్నడున్?
పనుల యందు మేటివై?పాదువౌచు కీర్తి నిల్పుమా!
తెనుగు వెల్గు చాటుమా!ధీదితల్వెలుంగ మన్నుమా?
కనుమ బీదసాదలం?కాదనేది లేదు చూడగన్?

6.గర్భగత"-తావళ"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.య.జ.ర.జ.స.జ.గల.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
మనసు మంచి కోరుమా?మాదకాలు ముట్ట కెన్నడుం?మరువరాదు?మంచి నీవు!
పనులయందు మేటివై?పాదువౌచు కీర్తి నిల్పుమా!పరువుమాలి యొప్పరాదు
తెనుగు వెల్గు చాటుమా!ధీదితుల్వెలుంగ మన్నుమా?తెరవు నెంచి నీతి నిల్పు!
కనుమ బీదసాదలం?కాదనేది లేదు?చూడగం!కరము భక్తి మోక్షమిచ్చు?

7.గర్భగత"-సునీతినీ"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.న.ర.జ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
మాదకాలు ముట్ట కెన్నడుం?మరువ రాదు మంచి నీవు?
పాదువౌచు కీర్తి నిల్పుమా!పరువు మాలి యొప్పరాదు?
ధీదితుల్వెలుంగ మన్నుమా?తెరవు నెంచి నీతి నిల్పు?
కాదనేది?లేదు?చూడగం!కరము భక్తి మోక్ష మిచ్చు?

8.గర్భగత"-సౌరహీన"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.న.ర.జ.న.ర.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
మాదకాలు ముట్టకెన్నడుం?మరువరాదు మంచి నీవు?మనసు మంచికోరుమా?
పాదువౌచు కీర్తి నిల్పుమా?పరువు మాలి యొప్పరాదు?పనుల యందుమేటివై?
ధీదితుల్వెలుంగ మన్నుమా!తెరవు నెంచి నీతి నిల్పు?తెనుగు వెల్గు చాటుమా?
కాదనేది?లేదు?చూడగం?కరము భక్తి మోక్ష మిచ్చు?కనుమ బీదసాదలన్?

9.గర్భగత"స్వభావ"-వృత్తము.
అత్యష్టీఛందము.న.ర.జ.స.జ.గల.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
మనసు మంచి కోరుమా?మరువరాదు?మంచి నీవు?
పనులయందు మేటివై?పరువుమాలి యొప్పరాదు?
తెనుగు వెల్గు చాటుమా?తెరవు నెంచి నీతి నిల్పు?
కనుమ బీద సాదలం?కరము భక్తి మోక్ష మిచ్చు?

10.గర్భగత"-మనుజనీతి"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.జ.స.జ.ర.జ.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
మనసు మంచి కోరుమా?మరువరాదు మంచినీవు?మాదకాలు ముట్ట కెన్నడున్?
పనులయందు మేటివైపరువుమాలి యొప్పరాదు?పాదువౌచు కీర్తి నిల్పుమా?
తెనుగు వెల్గు చాటుమా?తెరవు నెంచి నీతి నిల్పు?ధీదితుల్వెలుంగ మన్నుమా?   
కనుమ బీదసాదలం?కరము భక్తి మోక్ష మిచ్చు?కాదనేది లేదు? చూడగన్? 
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.