గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, జూన్ 2018, శనివారం

నాణ్యతా,త్రినేత్ర,సమాశ్రీ,జీవనావ,విస్ఫుట,పధమొదవు,కోర్కెదీరు , పతితపావనా,నిధాన,వెన్నవన్నె,గర్భ"-శివతమ"-వృత్తము.రచన:-శ్రీవల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.

జైశ్రీరామ్.

నాణ్యతా,త్రినేత్ర,సమాశ్రీ,జీవనావ,విస్ఫుట,పధమొదవు,కోర్కెదీరు , పతితపావనా,నిధాన,వెన్నవన్నె,గర్భ"-శివతమ"-వృత్తము.

రచన:-శ్రీవల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.
"-శివతమ"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.న.భ.న.న.య.ర.జ.గల.గణములు.
యతులు.10,19.ప్రాసనీమముగలదు.
పధమొదవు జగత్పిత?పతితుల గను నిధాన!వారణాశి క్షేత్ర వాసి!
కొదువొదవని శ్రీలిడు!కుతలము సుతల మేర్చు!కోరువారి కోర్కె దీర్చు!
వదలడు దురితాత్ముల!బ్రతుకులు నడుపు నీతి!పారమార్ధ చింతనింపు!
సదమలుడగు శంభుడు!చతురుడు?జగతి బ్రోచు!చారువన్నెవెన్న!మేన?

1,గర్భగత"-నాణ్యతా"-వృత్తము.
బృహతీఛందము.న.న.భ.గణములు.వృ.సం.448.ప్రాసగలదు.
పధమొదవు డగత్పిత?
కొదువొదవని శ్రీలిడు!
వదలడు దురితాత్ముల!
సదమలుడగు శంభుడు!

2.గర్భగత"-త్రినేత్ర"-వృత్తము.
బృహతీఛందము.న.న.జ.గణములు.వృ.సం.384.ప్రాసగలదు.
పతితుల గను నిధాన?
కుతలము సుతల మేర్చు?
బ్రతుకుల నడుపు నీతి?
చతురుడు జగతి బ్రోచు?

3.గర్భగత"-సమాశ్రీ"-వృత్తము
అనుష్టుప్ఛందము.ర.జ.గల.గణములు.వృ.సం.171.పప్ఛందము
వారణాశి క్షేత్ర వాసి!
కోరువారి కోర్కెదీర్చు!
పారమార్ధ చింత నింపు?
చారు వెన్న వన్నె మేన!

4.గర్భగత"-జీవనావ"-వృత్తము.
ధృతిఛందము.న.న.భ.న.న.జ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
పధమొదవు జగత్పిత?పతితుల గను నిధాన!
కొదువొదవని శ్రీలిడు?కుతలము సుతలమేర్చు?
వదలడు దురితాత్ముల?బ్రతుకులు నడుపు నీతి!
సదమలుడగు శంభుడు!చతురుడు జగతి బ్రోచు!

5.గర్భగత"-విస్ఫుట"-వృత్తము.
అత్యష్టీఛందము.న.న.జ.ర.జ.గల.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
పతితుల గను నిధాన?వారణాశి క్షేత్రవాసి?
కుతలము సుతలమేర్చు?కోరువారి కోర్కె దీర్చు!
బ్రతుకులు నడుపు నీతి?పారమార్ధ చింత నింపు!
చతురుడు జగతి బ్రోచు?చారు వెన్న వన్నె మేన!

6.గర్భగత"-పధమొదవు"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.న.జ.ర.జ.భ.న.స.లల.గణములు.యతులు.19,18.
ప్రాసనీమముగలదు.
పతితుల గను నిధాన?వారణాశి క్షేత్రవాసి?పధ మొదవు జగత్పిత?
కుతలము సుతల మేర్చు?కోరువారి కోర్కె దీర్చు?కొదువొదవని శ్రీలిడు?
బ్రతుకుల నడుపు నీతి?పారమార్ధ చింత నింపు!వదలడు దురితాత్ముల?
చతురుడు జగతి బ్రోచు?చారువెన్న వన్నె మేన?సదమలుడగు!శంభుడు?

7.గర్భగత"-కోర్కెదీరు"-వృత్తము.
అత్య ష్టీఛందము.ర.జ.భ.న.స.లల.గణములు.యతి.9,వ.యక్షరమ
.ప్రాసనీమముగలదు .
వారణాశి క్షేత్రవాసి?పధమొదవు జగత్పిత?
కోరువారి కోర్కెదీర్చు?కొదువొదవని శ్రీలిడు?
పారమార్ధ చింత నింపు!వదలడు దురితాత్ముల?
చారువెన్న!వన్నె మేన?సదమలుడగు?శంభుడు?

8.గర్భగత"-పతితపావనా"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.భ.న.స.న.న.న.గల.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
వారణాశి!క్షేత్రవాసి?పధమొదవు?జగత్పిత!పతితుల గను నిధాన?
కోరువారి కోర్కె దిర్చు?కొదువొదవని శ్రీలిడు?కుతలము సుతలమేర్చు?
పారమార్ధ చింత నింపు!వదలడు?దురితాత్ముల?బ్రతుకుల నడుపు నీతి?
చారు వన్నె వెన్న మేన?సదమలుడగుశంభుడు?చతురుడు!జగతిబ్రోచు?

9.గర్భగత"-నిధాన"-వృత్తము.
ధృతిఛందము.న.న.జ.న.న.భ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
పతితుల గను నిధాన?పధమొదవు జగత్పిత!
కుతలము సుతలమేర్చు?కొదువొదవని శ్రీలిడు?
బ్రతుకుల నడుపు నీతి?వదలడు దురితాత్ముల?
చతురుడు?జగతిబ్రోచు!సదమలుడగు?శంభుడు?

10.గర్భగత"-వెన్నవన్నె"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.న.జ.న.న.భ.ర.జ.గల.గణములు.యతులు.10,19.
ప్రసనీమముగలదు.
పతితుల గను నిధాన?పధమొదవు?జగత్పిత!వారణాసి క్షేత్ర వాసి!
కుతలము సుతలమేర్చు?కొదువొదవని శ్రీలిడు?కోరువారి కోర్కె దీర్చు?
బ్రతుకుల నడుపు నీతి?వదలడు దురితాత్ముల?పారమార్ధ చింత నింపు!
చతురుడు!జగతిబ్రోచు?సదమలుడగు శంభుడు?చారువన్నె వెన్న మేన?
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.