గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, జూన్ 2018, శుక్రవారం

వినయశ,నయజా,కృపారసార్ద్ర,ఘటనా,కులార్తి,బాధాపహ,జనీయ,సుషుప్తి,వలనగు,ఘనతా," గర్భ"-కుదురొదవు"-వృత్తము.రచన:-వల్లభ వఝల అప్పల నరసింహమూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్.

వినయశ,నయజా,కృపారసార్ద్ర,ఘటనా,కులార్తి,బాధాపహ,జనీయ,సుషుప్తి,వలనగు,ఘనతా," గర్భ"-కుదురొదవు"-వృత్తము.

రచన:-వల్లభ వఝల అప్పల నరసింహమూర్తి. జుత్తాడ.
"-కుదురొదవు"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.న.స.న.య.జ.న.జ.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
కతిపయ దినములలో!కలలకు సాకార మౌచు?ఘనత ఘటించు భువిన్?
ప్రతిఘటనలు కొదువౌ?వలనగు రీతిం శుభాలు!పనితన మెంచ బడున్?
మతి కుదురొదవునుగా?మలిన కులార్తుల్విడంగ?మనుజత పెంపొనరున్?
గతి కనెదరు నరుల్!  కలుగును కీర్తు ల్జగాన!   కను  మరుగౌ!   చెడులున్?

1.గర్భగత"-వినయశ"-వృత్తము.
బృహతీఛందము.న.న.స.గణములు.వృ.సం.256.ప్రాస గలదు.
కతిపయ దినములలో!
ప్రతిఘటనలు కొదువౌ?
మతి కుదురొదవునుగా?
గతి కనెదరు?  నరుల్?

2.గర్భగత"-నయజా"-వృత్తము.
బృహతీఛందము.న.య.జ.గణములు.వృ.సం.336.ప్రాసగలదు.
కలలకు!సాకార మౌచు?
వలనగు! రీతిం శుభాలు?
మలిన కులార్తు ల్విడంగ!
కలుగును! కీర్తు ల్జగాన!

3.గర్భగత"-కృపారసార్ద్ర"-వృత్తము.
అనుష్టుప్ఛందము.న.జ.లగ.గణములువవృ.సం.112.ప్రాసగలదు.
ఘనత ఘటించు భువిన్?
పనితన మెంచ బడున్?
మనుజత పెంపొనరున్!
కను మరుగౌ! చెడులున్?

4.గర్భగత"-ఘటనా"-వృత్తము.
ధృతిఛందము.న.న.జ.న.య.జ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
కతిపయ దినములలో? కలలకు సాకార మౌచు?
ప్రతిఘటనలు కొదువౌ? వలనగు రీతిం శుభాలు!
మతి! కుదు రొదవునుగా?మలిన కులార్తు ల్విడంగ?
గతి! కనె దరు నరుల్? కలుగును  కీర్తుల్? జగాన!

5.గర్భగత"-కులార్తి"-వృత్తము.
అత్యష్టీఛందము.న.య.జ.న.జ.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
కలలకు సాకార మౌచు?ఘనత ఘటించు భువిన్?
వలనగు రీతిం?శుభాలు!పనితన మెంచబడున్?
మలిన కులా ర్తుల్విడంగ?మనుజత పెంపొనరున్?
కలుగును కీర్తు ల్జగాన?కను మరుగౌ?చెడులున్?

6.గర్భగత"-బాధాపహ"-వృత్తము..
ఉత్కృతిఛందము.న.య.జ.న.జ.జ.న.న.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
కలలకు సాకారమౌచు?ఘనత ఘటించు భువిం?కతిపయ దినములలో?
వలనగు రీతిం?శుభాలు పనితన మెంచ బడుం?ప్రతిఘటనలు కొదువౌ?మలిన కులార్తు ల్విడంగ?మనుజత పెంపొనరుం?మతి!కుదురొదవునుగా?
కలుగును!  కీర్తు ల్జగాన?కను మరుగౌ?  చెడులుం?   గతి కనెదరు నరుల్?

7.గర్భగత"-జనీయ"-వృత్తము.
అత్యష్టీఛందము.న.జ.జ.న.న.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
ఘనత ఘటించు భువిం? కతిపయ దినములలో?
పని తన మెంచ బడుం? ప్రతి ఘటనలు. కొదవౌ?
మనుజత పెంపొనరుం? మతి కుదురొదవును గా?
కను మరుగౌ!చెడులుం?గతి కనెదరు నరుల్?

8.గర్భగత"-సుషుప్తి"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.జ.జ.న.న.జ.న.త.గల.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
ఘనత ఘటించు భువిం?కతిపయ దినములలో?కలలలకు సాకార మౌచు?
పనితన మెంచ బడుం? ప్రతి ఘటనలు కొదువౌ?వలనగు రీతిం!శుభాలు?
మనుజత పెంపొనరుం?మతి కుదురొదవును గా?మలిన కులార్తుల్విడంగ?
కను మరుగౌ?చెడులుం?గతి కనెదరు నరుల్? కలుగును! కీర్తు ల్జగాన?


9.గర్భగత"-వలనగు"-వృత్తము.
ధృతిఛందము.న.య.జ.న.న.స.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
కలలకు సాకార మౌచు?కతిపయ దినములలో?
వలనగు రీతిం?శుభాలు!ప్రతి ఘటనలు కొదువౌ?
మలిన కులార్తుల్విడంగ?మతి కుదు రొదవును గా?
కలుగును  కీర్తు ల్జగాన? గతి.   కనెదరు?   నరుల్?

10,గర్భగత"-ఘనతా"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.య.జ.న.న.స.న.జ.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
కలలకు!సాకార మౌచు?కతిపయ దినములలో?ఘనత ఘటించు భువిన్?
వలనగు రీతిం?శుభాలు!ప్రతి ఘటనలు కొదువౌ?పనితన మెంచ బడున్?
మలిన కులార్తుల్విడంగ?మతి కుదురొదవును గా?మనుజత పెంపొనరున్?
కలుగును కీర్తు ల్జగాన? గతి కనెదరు?నరుల్? కను మరుగౌ?  చెడులున్?
స్వస్తి.
మూర్తి. జుత్తాడ.
జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.