గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

25, జూన్ 2018, సోమవారం

భావజద్వయ,పురుషద్వయ,మృదుపద,శృతినుత,చాలినీ,జనశూన్య, యాడది,పరాశక్తి,యాపె లేని"ద్వయ,తరోజ,రజనరజా,సువర్తనా ద్వయ.గర్భ.చెరగనిసత్యంవృత్తము. రచన:-శ్రీ వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్.

         భావజద్వయ,పురుషద్వయ,మృదుపద,శృతినుత,చాలినీ,జనశూన్య, యాడది,పరాశక్తి,యాపె
                        లేని"ద్వయ,తరోజ,రజనరజా,సువర్తనా ద్వయ.గర్భ.చెరగనిసత్యంవృత్తము.                                          రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
"-చెరగని సత్యం"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.న.న.ర.స.ర.స.గల.గణములు.యతులు.15,21.
ప్రాసనీమముగలదు.
ఆమె లేకయున్న!యవని జనము  సున్న?ఆది పరాశక్తి యాడదిరా?బిడ్డ!
భీమదంబు భావి!వివరిత కడు దవ్వు?భేదత పాఠించి పీడిల జేయంగ?
సీమ లెల్ల మాయు!చివరికి నరకంబు!ఛేదిత కీర్తెంచ! చీడల లోనౌదు?
భాము లంద నేల?భవమును కనకండి?బాధిలు సర్వంబు!పాడగు సశ్యంబు?

1.గర్భగత"-భావజ"-ద్వయ వృత్తములు.
గాయిత్రీఛందము.భ.త.గణములు.వృ.సం.39.ప్రాసగలదు.
1.ఆది పరాశక్తి                 2.ఆడదిరా?బిడ్డ!
   భేదత పాఠించి.                పీడిల జేయంగ?
   ఛేదిత కీర్తెంచ?                 చీడల లోనౌదు?
   బాధిలు సర్వంబు!          పాడగు!సశ్యంబు!

2.గర్భగత"-పురుష"-వృత్తము.
జగతీఛందము.భ.త.భ.త.గణములు.యతి.7.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
ఆదిపరాశక్తి!  యాడదిరా!  బిడ్డ?
భేదత పాఠించి !పీడిల జేయంగ?
ఛేదిత కీర్తెంచ? చీడల లోనౌదు?
బాధిలు సర్వంబు?పాడగు!సశ్యంబు?

3.గర్భగత"-శమన"-వృత్తము.
గాయిత్రీఛందము.ర.జ.గణములు.వృ.సం.43.ప్రాసగలదు.
ఆమె!లేకయున్న?
భీమదంబు భావి!
సీమలెల్ల?మాయు!
భాములంద నేల?

4.గర్భగత"-మృదు పద"-వృత్తము.
అనుష్టుప్ఛందముదవృ.సం.192.ప్రాసగలదు.
యవని జనము సున్న!
వివరిత కడు దవ్వు?
చివరికి నరకంబు?
భవమును కనకండి?

5.గర్భగత"-శృతినుత"-వృత్తము.
శక్వరీఛందము.ర.జ.న.న.గల.గణములు.యతి.7,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
ఆమె! లేక యున్న!యవని జనము సున్న?
భీమదంబు భావి? వివరిత కడు దవ్వు?
సీమ లెల్ల మాయు!చివరికి నరకంబు?
భాములంద నేల?భవమును!కనకండి?

6.గర్భగత"-చాలినీ"-వృత్తము.
శక్వరీఛందక్న.న.న.ర.స.గల.గణములు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
అవని జనము సున్న!యాడది లేకున్న?
వివరిత కడు దవ్వు?భీమదంబు భావి?
చివరికి నరకంబు?సీమలెల్ల?మాయు!
భవమును కన కండి!భాములంద నేల?

7.గర్భగత"-జనశూన్య"-వృత్తము.
కృతిఛందము.ర.జ.న.న.ర.స.గల.గణములు.యతి.7.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
ఆమె!లేకయున్న యవని జనము సున్న?ఆది పరాశక్తి?
భీమదంబు భావి!వివరిత కడు దవ్వు?భేదత పాఠించి!
సీమ లెల్ల?మాయు!చివరికి నరకంబు?ఛేదిత కీర్తెంచ?
భాము లంద నేల?భవమును కనకండి?బాధిలు సర్వంబు!

8.గర్భగత"-యాడది"-వృత్తము.
కృతిఛందము.భ.న.ర.స.ర.స.గల.గణములు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
అవని జనము సున్న!ఆది పరాశక్తి?యాడదిరా!బిడ్డ!
వివరిత కడు దవ్వు?భీమదంబు భావి?పీడిల జేయంగ?
చివరికి నరకంబు?సీమ లెల్ల మాయు!చీడల లోనౌదు?
భవమును కనకండి!భములంద నేల?పాడగు సశ్యంబు?

9.గర్భగత"-పరాశక్తి"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.న.ర.స.ర.స.ర.జ.గల.గణములు.యతులు.15,21.
ప్రాసనీమముగలదు.
అవని జనము సున్న!ఆది పరాశక్తి!ఆడది రా! బిడ్డ?యామె లేకయున్న?
వివరిత కడు దవ్వు?భేదత పాఠించి!?పీడిల జేయంగ?భీమదంబు భువి?
చివరికి నరకంబు? ఛేదిత కీర్తెంచ? చీడల లోనౌదు?సీమలెల్ల మాయు?
భవమును కనకండి!బాధిలుసర్వంబు?పాడగు సశ్యంబు?భాములంద నేల?

10,గర్భగత"-యాపె లేని"-ద్వయ వృత్తములు.
కృతిఛందము.భ.త.ర.జ.న.న.గల.గణములు.యతి.13.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
1.ఆడదిరా!బిడ్డ!యామె లేక యున్న?యవని జనము సున్న!
   పీడిల జేయంగ?భీమదంబు భావి!వివరిత కడు దవ్వు?
   చీడల లోనౌదు?సీమలెల్ల మాయు!చివరికి  నరకంబు?
  పాడగు సశ్యంబు?భాములంద నేల?భవమును కనకండి?

2.ఆది పరాశక్తి? యామె లేకయున్న?యవని జనము సున్న?
   భేదత పాఠించి!భీమదంబు భావి!వివరిత కడుదవ్వు?
  ఛేదిత కీర్తెంచ?సీమలెల్ల?మాయు!చివరికి నరకంబు?
  బాధిలు సర్వంబు?భాములంద నేల?భవమును కనకండి?

11.గర్భగత"-తరోజ"-వృత్తము.
ధృతిఛందము.భ.త.భ.త.ర.జ.గణములు.యతి13.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
ఆడదిరా!బిడ్డ!ఆది పరాశక్తి!యామె లేకయున్న?
పీడిల జేయంగ?భేదత పాఠించి!భీమదంబు భావి?
చీడల లోనౌదు?ఛేదిత కీర్తెంచ?సీమలెల్ల మాయు?
పాడగు సశ్యంబు?బాధిలు?సర్వంబు!భాములంద నేల?

12.గర్భగత"-రజనరజా"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.త.ర.జ.న.న.ర.జ.గల.గణములు.యతులు.13.21.
ప్రాసనీమముగలదు.
ఆది పరాశక్తి!ఆమె!లేకయున్న?యవని జనము!సున్న!ఆడదిరా!బిడ్డ?
భేదత!పాఠించిభీమదంబు భావి!వివరత కడుదవ్వు?పీడిల జేయంగ?
ఛేదిత కీర్తెంచ?సీమలెల్ల మాయు!చివరికి నరకంబు?చీడల లోనౌదు?
బాధిలు సర్వంబు?భాములందనేల?భవమునను కనకండి?పాడగు! సశ్యంబు!

13సగర్భగత"-సువర్తనా"-ద్వయ వృత్తములు.
ఉత్కృతిఛందము.భ.త.భ.త.ర.జ.న.న.గల.గణములు.యతులు.13,19.
ప్రాసనీమముగలదు.
1.ఆది పరాశక్తి!యాడదిరా!బిడ్డ?యామె!లేక యున్న!అవని జనము సున్న?
   భేదత పాఠించి!పీడిల జేయంగ?భీమదంబు భావి!వివరిత కడుదవ్వు?
    ఛేదిత కీర్తెంచ?చీడల లోనౌదు!సీమ లెల్ల మాయు?చివరికి నరకంబు!
    బాధిల్లు సర్వంబు?పాడగు?సశ్యంబు?భాములంద నేల?భవమును  గనకండి?

2.ఆడదిరా!బిడ్డ!ఆది పరాశక్తి?ఆమె!లేక యున్న?అవని జనము సున్న?
   పీడిల జేయంగ?భేదత పాఠించి!భీమదంబు భావి!వివరత కడుదవ్వు?
   చీడల లోనౌదు?ఛేదిత కీర్తెంచ?సీమ లెల్ల?మాయు!చివరికి నరకంబు?
   పాడగు!సశ్యంబు?బాధిలు సర్వంబు?భాములంద నేల?భవమును! గనకండి?
స్వస్తి..
మూర్తి.జుత్తాడ.
జైహింద్.

Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
" ఆడదిరా బిడ్డ ఆది పరాశక్తి " అంటూ అన్నివృత్తములలోను చక్కగా వివరించిన శ్రీ వల్లభవఝులవారి ప్రతిభ శ్లాఘనీయము. మాకందించిన శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.