గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

10, ఏప్రిల్ 2017, సోమవారం

ప్రజ - పద్యమ్ ౨౩. శ్రీ అన్నపరెడ్డి సత్యనారాయణరెడ్డి.

 జైశ్రీరామ్.
ఉ. అన్నపరెడ్డి రైతు. పరమార్ద్రతతో వివరించినారు రై
తన్నల గోడు. సత్యమె. యహర్నిశలున్ శ్రమియించు రైతునే
కన్నుల నీరు పెట్టునటు కల్గిన భూమిని లాగుకొన్న. నా
పన్నులఁ జూచి తాను ప్రజ పద్యమునన్ వినిపించె. నార్తితోన్.  
జైహింద్.
Print this post

1 comments:

A.Satyanarayana Reddy చెప్పారు...

గురువర్యులకు నమస్సులు. ధన్యవాదములు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.