గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

7, ఏప్రిల్ 2017, శుక్రవారం

ప్రజ - పద్యమ్ ౩౫. డా. మాడ్గుల అనిల్ కుమార్. ప్రోత్సాహక బహుమతి.

 జైశ్రీరామ్.
ఆర్యులారా! డా.మాడుగుల అనిల్ కుమార్ అసాధారణ ప్రజ్ఞాన్విత కవి. వారి రచనలో నాటకీయత ఉండి పాత్రలలో జీవకళ ఉట్టిపడుతుంది. ఎంతో శ్రమించి వేదము స్మార్తము నేర్చుకొని జీవనానికి పొరోహిత్యముపై ఆధారపడే బ్రాహ్మణుల దయనీయ జీవన గతికి అద్దంపట్టే వీరి కవిత ప్రోత్సాహక బహుమతినందుకోబోతోంది.
వారిని మనసారా అభినందిద్దాము.
శా. పౌరోహిత్యము చేయు బ్రాహ్మణులు సంపాదించు పాపంబునే.
కోరున్ లోకుల శ్రేయమున్. తనకు తా కోరంగ నేర్వండహో!
లేరెవ్వారలు వాని కష్టముగనన్. క్లేశంబు తా గాంచి రీ
ధీరుల్ మాడ్గులనిల్ కుమారు. హరియే దీవించు నీ సత్కవిన్.
జైహింద్.
Print this post

2 comments:

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

కవిమిత్రుల సామాజికహిత పద్యసుమములను ఆంధ్రామృతం ద్వారా అందరికీ పంచుతున్న శ్రీ చింతా వారికి ధన్యవాదములు.

Dhanikonda Ravi Prasad చెప్పారు...

ఎవరి సమస్యలనైనా వ్రాస్తే సామాజికస్పృహ అవుతుంది కానీ బ్రాహ్మణుల సమస్యలని రాస్తే సామాజికస్పృహ అవుతుందో కాదో అని భయపడకుండా బ్రాహ్మణుల సమస్యలని కవిత్వం లో పెట్టినందుకు అనిల్ కుమార్ అవధాని గారి ధైర్యానికి మొదట అభినందనలు. బహుశా బ్రాహ్మణ సమస్యలని పద్యరూపం లో పెట్టిన మొదటి కవి వీరే కావచ్చు. పద్యాలకి కూడా అభినందనలు. వీటికి మార్కులేస్తే ఎవరే మనుకుంటారో అని భయపడకుండా మార్కులు వేసిన న్యాయనిర్ణేతలకి అభినందనలు .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.