గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

5, ఏప్రిల్ 2017, బుధవారం

ప్రజ - పద్యమ్ ౩౦. శ్రీ ధనికొండ రవిప్రసాద్.- భాగీరథి. ద్వితీయ బహుమతి.

 జైశ్రీరామ్.
ఆర్యులారా! విగత భర్తృకలయెడ మన సమాజమున గల ఆచార సరళికి అద్దంపట్టిన కవి శ్రీ ధనికొండ అద్వితీయమైన రచన చేసి ద్వితీయ బహుమతికి ఎంపిక చేయబడ్డారు..
ఏది ఏమైన బాధాకర విషయాన్ని కూడా మంగళాంత చేసిన మన ధనికొండ అభినందనీయులుక. హృదయంబెంతగ వేగెనొ 
విధవల గతి కనిన కవికి. విఖ్యాతిగ తా
మదినున్న భావసరళికి
పదిలంబగు రూపమిచ్చి ప్రకటించిరొగిన్. 
కార్య సాధనా నిపుణులైన కవికి నా అభినందనలు.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.