గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, నవంబర్ 2024, ఆదివారం

సమరస,స రమస,అగణిత,తమి విడు,విమలత,సరి గను,ధనమదె,ఘనుమిల,ఘన స్థితి. వరదమ,కనె దిల,వెలుగిడు,సరి జను,జన హిత,"గర్భ. "విమల పద"వృత్తమురచన -వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి జుత్తాడ,,,

జైశ్రీరామ్. 

సమ రస స రమసతన్! చను మగణిత ఖనివై! జన మనముల మంచిన్!

గమి సుర పధ మనుచున్!కను సరి జన హితమున్!ఘనమగు స్థిత ప్రజ్ఞన్!
తమి నెడమిడి మెలుగన్!ధన మదె వరదమునౌ!తనియుమి గురు నానన్!
విమలమగు పర మదే!వినుతిని గనెద విలన్!వినయము నయ మెంచన్!

సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి"అనిరుద్ఛందాంతర్గత"ఉత్కృతి"
ఛందము లోనిది,ప్రాస నియమము కలదు,పాదమునకు26"అక్షసము లుండును,
యతులు"10,19,వ యక్షరమునకు చెల్లును,

1.గర్భగత"సమ రస"వృత్తము,

సమరస స రమస తన్!
గమి సుర పధ మనుచున్!
తమి నెడ మిడి మెలుగన్!
విమలమగు పర మదే!

అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు,9,,అక్షరము లుండును,

2,గర్భగత"స రమస"వృత్తము,

చను మగణిత ఖనివై!
కను సరిజన హితమున్!
ధన మదె వరదమునౌ!
వినుతిని గనెద విలన్!

అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"9"అక్షరము లుండును,

3,గర్భగత"అగణిత"వృత్తము,

జన మనముల మంచిన్!
ఘన మగు స్థిత ప్రజ్ఞన్!
తనియుమి గురు నానన్!
వినయము నయ మెంచన్!

అభిజ్ఞా ఛందము నందలి"అనుష్టుప్ఛందము నందలిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"8"అక్షరము లుండును,

4 గర్భగత"తమి విడు"వృత్తము,

సమ రస స రమస తన్!చను మగణిత ఖనివై!
గమి సుర పథ మనుచున్!కను సరిజన హితమున్!
తమి నెడమిడి మెలుగన్!ధన మదె వరదము నౌ!
విమలమగు పర మదే!వినుతిని గనెద విలన్!

అణిమా ఛందము నందలి"ధృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"18'అక్షరము లుండును,
యతి"10"వ యక్షరమునకు చెల్లును,

5 గర్భగత"విమల"వృత్తము,

చను మగణిత ఖనివై!సమరస స రమస తన్!
కను సరిజన హితమున్!గమి సుర పథమనుచున్!
ధన మదె వరదమునౌ!తమి నెడమిడి మెలుగన్!
వినుతిని గనెద విలన్!విమలమగు పర మదే!

అణిమా ఛందము నందలి"ధృతి ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"18"అక్షరము లుండును,
యతి"10"వ యక్షరమునకు చెల్లును,

6.గర్భగత"సరి గను"వృత్తము,

చను మగణిత ఖనివై!జన మనముల మంచిన్!
కను సరిజన హితమున్!ఘనమగు స్థిత ప్రజ్ఞన్!
ధన మదె వరదమునౌ!తనియుమి గురు నానన్!
వినుతిని గనెద విలన్!వినయము నయ మెంచన్!

అణిమా ఛందము నందలి"ఉష్ణిక్"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"10,వ యక్షరమునకు చెల్లును,

7.గర్భగత"ధన మిదె"వృత్తము,

జన మనముల మంచిన్!చను మగణిత ఖనివై!
ఘనమగు స్థిత ప్రజ్ఞన్!కను సరిజన హితమున్!
తనియుమి గురు నానన్!ధన మదె వరదమునౌ!
వినయము నయ మెంచన్!వినుతిని గనెద విలన్!

అణిమా ఛందము నందలి"ఉష్ణిక్"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"9"వ యక్షరమునకు చెల్లును,

8.గర్భగత"మనుమిల"వృత్తము,

సమ రస స రమసతన్!జన మనముల మంచిన్!
గమి సుర పథమనుచున్!ఘనమగు స్ధిత ప్రజ్ఞన్!
తమి నెడమిడి వెలుగన్!తనియుమి గురు నానన్!
విమలమగు పర మదే!వినయము నయ మెంచన్!

అణిమా ఛందము నందలి"ఉష్ణిక్"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదము నకు17,అక్షరము లుండును,
యతి,10,వ యక్షరమునకు చెల్లును,

9.గర్భగత"ఘన స్థితి"వృత్తము

జన మనముల మంచిన్!సమరస స రమసతన్!
ఘనమగు స్థిత ప్రజ్ఞన్!గమి సుర పథ మనుచున్!
తనియుమి గురు నానన్!తమి నెడమిడి వెలుగన్!
వినయము నయ మెంచన్!విమలమగు పర మదే!

అణిమా ఛందము నందలి"ఉష్ణిక్"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"9"వ యక్షరమునకు చెల్లును,

10.గర్భగత"వరదమ"వృత్తము,

చను మగణిత ఖనివై!సమరస స రమసతన్!జన మనముల మంచిన్!
కను సరిజన హితమున్!గమి సురపథమనుచున్!ఘనమగు స్థిత ప్రజ్ఞన్!
ధనమదె!వరదమునౌ!తమి నెడమిడి వెలుగన్!తనియుమి గురు నానన్!
వినుతిని గనెద విలన్!విమలమగు పరమదే!వినయము నయ మెంచన్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10,19,అక్షరములకు చెల్లును,

11.గర్భగత"-కనె దిల"వృత్తము,

చను మగణిత ఖనివై!జన మనముల మంచిన్!సమరస స రమసతన్!
కను సరిజన హితమున్!ఘన మగు స్థిత ప్రజ్ఞన్!గమి సుర పథ మనుచున్!
ధన మదె వరదమునౌ!తనియుమి గురు నానన్!తమి నెడమిడి వెలుగన్!
వినుతిని గనెద విలన్!వినయము నయ మెంచన్!విమలమగు వర మదే!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు.,10,18,అక్షరములకు చెల్లును,

12.గర్భగత"వెలుగుడి"వృత్తము,

జన మనముల మంచిన్!చను మగణిత ఖనివై!సమరస స రమసతన్!
ఘన మగు స్థిత ప్రజ్ఞన్!కను సరిజన హితమున్!గమి సురపథ మనుచున్!
తనియుమి గురు నానన్!ధన మదె వరదమునౌ!తమి నెడమిడి మెలుగన్!
వినయము నయ మెంచన్!వినుతిని గనెద విలన్!విమలమగు వర మదే!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"26"అక్షసము లుండును,
యతులు.,9,18.అక్షరము లకు చెల్లును,

13,గర్భగత"సరిజను"వృత్తము,

సమరస స రమసతన్!జన మనముల మంచిన్!చను మగణిత ఖనివై!
గమి సుర పథమనుచున్!ఘనమగు స్థిత ప్రజ్ఞన్!కను సరిజన హితమున్!
తమి నెడమిడి మెలుగన్!తనియుమి గురు నానన్!ధనమదె వరదమునౌ!
విమలమగు వర మదే!వినయము నయ మెంచన్!వినుతిని గనెద విలన్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10,18,అక్షరములకు చెల్లును,

14.గర్భగత"జనహిత"-వృత్తము,

జన మనముల మంచిన్!సమరస స రమసతన్!చను మగణిత ఖనివై!
ఘనమగు స్థిత ప్రజ్ఞన్!గమి సుర పథమనుచున్!కను సరిజన హితమున్!
తనియుమి గురు నానన్!తమి నెడమిడి మెలుగన్!ధన మదె వరదమునౌ!
వినయము నయ మెంచన్!విమల మగు వర మదె!వినుతిని గనెద విలన్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,9,18,అక్షరములకు చెల్లును,
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.