గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, నవంబర్ 2024, ఆదివారం

నీచతా,నితర,దిగు వొనరు,సిద్ద కొరుకు,పౌరషత్వ,నేర నైజ,కావని,నిటలాక్ష,దంత భ్రష్ట, మాయు,గుణ భావ,సామరస్య,మేలగు,జ్ఞానతా,గర్భ"పరాపరాధ"వృత్తము, రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి, జుత్తాడ,

 జైశ్రీరామ్.

కుక్క చెప్పు కొరికె నంచున్!కోరి సిద్దను కొర్కు చోన్!కూలు నేల దంతా లవెల్లన్!
ప్రక్క వార్ని దిగువ చేయన్!పౌరుషత్వము మాయులే!ఫాల నేత్రు డంతంబు జేయున్!
నిక్కి నీల్గ మడియు దీవే!నేర నైజము తప్పునౌ!నేల సామరస్యంబు మేలౌ!
రక్కసత్వము చెడ దీయున్!రా రదెవ్వరు?కావగా!రాలు ఖ్యాతి పరాపరాధీ!

సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి,అనిరుద్ఛందాంతర్గత"ఉత్కృతి"
ఛందము లోనిది,ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10,18,అక్షరము లకు చెల్లును,

1,గర్భగత"నీచతా"వృత్తము,

కుక్క చెప్పు కొరికె నంచున్!
ప్రక్క వార్ని దిగువ చేయన్!
నిక్కి నీల్గ మడియు దీవే!
రక్క సత్వము చెడ దీయున్!

అభిజ్ఞా"ఛందమునందలి"బృహతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"9"అక్షరము లుండును,

2,గర్భగత"నితర"వృత్తము,

కోరి సిద్దను కొర్కు చోన్!
పౌరషత్వము మాయులే!
నేర నైజము తప్పునౌ!
రా రదెవ్వరు?కావగా!

అభిజ్ఞా"ఛందము నందలి"అను ష్టుప్ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"8"అక్షరము లుండును,

3,గర్భగత"దిగువొనరు"వృత్తము,

కూలు నేల దంతా లవెల్లన్!
ఫాల నేత్రు డంతంబు సేయున్!
నేల సామరస్యంబు మేలౌ!
రాలు ఖ్యాతి పరాప రాధీ!
.
అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు,9,అక్షరము లుండును,

4.గర్భగత"సిద్ద కొరుకు"వృత్తము,

కుక్క చెప్పు కొరికె నంచున్!కోరి సిద్దను కొర్కు చోన్!
ప్రక్క వార్ని దిగువ జేయన్!పౌరషత్వము మాయులే!
నిక్కి నీల్గ మడియు దీవే!నేర నైజము తప్పునౌ!
రక్కసత్వము చెడ దీయున్!రా రదెవ్వరు?కాయగా!

అణిమా ఛందము నందలి "అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు 17"అక్షరము లుండును,
యతి,10,వ యక్షరమునకు చెల్లును,

5.గర్భగత"పౌరషత్వ"వృత్తము,

కోరి సిద్దను కొర్కు చోన్!కుక్క చెప్పు కొరికె నంచున్!
పౌరుషత్వము మాయులే!ప్రక్క వార్ని దిగువ జేయన్!
నేర నైజము తప్పునౌ!నిక్కి నీల్గ మడియు దీవే!
రా రదెవ్వరు?కాయగా!రక్క సత్వము చెడ దీయున్!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి,9,వ యక్షరమునకు చెల్లును

6.గర్భగత"నేరనైజ"వృత్తము,

కుక్క చెప్పు కొరికె నంచున్!కూలు నేల దంతాలవెల్లన్!
ప్రక్క వార్ని దిగువ జేయన్!ఫాల నేత్రు డంతంబు సేయున్!
నిక్కి నీల్గ మడియు దీవే!నేల సామ రస్యంబు మేలౌ!
రక్క సత్వము చెడ దీయున్!రాలు ఖ్యాతి పరాపరాధీ!

అణిమా ఛందము నందలి"ధృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు 18.అక్షరము లుండును,
యతి,10,వ యక్షరమునకు చెల్లును,

7.గర్భగత"కావని"వృత్తము,

కూలు నేల దంతా లవెల్లన్!కుక్క చెప్పు కొరికె9,18, నంచున్!
ఫాల నేత్రు డంతంబు సేయున్!ప్రక్క వార్ని దిగువ సేయన్!
నేల సామ రస్యంబు మేలౌ!నిక్కి నీల్గ మడియు దీవే!
రాలు ఖ్యాతి పరాప రాధీ!రక్కసత్వము చెడ దీయున్!

అణిమా ఛందము నందలి"ధృతి ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"18,అక్షరము లుండును,
యతి"10"వ యక్షరమునకు చెల్లును,

8.గర్భగత"నిటలాక్ష" వృత్తము

కోరి సిద్దను కొర్కు చోన్!కూలు నేల దంతా లవెల్లన్!
పౌరుషత్వము మాయులే!ఫాల నేత్రు డంతంబు సేయున్!
నేర నైజము తప్పునౌ!నేల సామ రస్యంబు మేలౌ!
రా రదెవ్వరు?కాయగా!రాలు ఖ్యాతి పరాపరాధీ!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరములుండును,
యతి"9"వ యక్షరమునకు చెల్లును,

9.గర్భగత"దంత భ్రష్ట"వృత్తము,

కూలు నేల దంతా లవెల్లన్!కోరి సిద్దను కొర్కు చోన్!
ఫాల నేత్రు డంతంబు సేయున్!పౌరుషత్వము మాయులే!
నేల సామరస్యంబు మేలౌ!నేర నైజము తప్పునౌ!
రాలు ఖ్యాతి పరాప రాధీ!రా రదెవ్వరు?కాయగా!

అణిమా ఛందము నందలి"ఉత్కృతి ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి,10,వ యక్షరమునకు చెల్లును,

10.గర్భగత"మాయు"వృత్తము,

కోరి సిద్దను కొర్కు చోన్!కుక్క చెప్పు కొరికె నంచున్!కూలు నేల దంతా లవెల్లన్!
పౌరుషత్వము మాయులే!ప్రక్క వార్ని దిగువ సేయన్!ఫాల నేత్రు డంతంబు సేయున్!
నేర నైజము తప్పునౌ!నిక్కి నీల్గ మడియు దీవే!నేల సామరస్యంబు మేలౌ!
రా రదెవ్వరు?కావగా!రక్క సత్వము చెడ దీయున్!రాలు ఖ్యాతి పరాపరాధీ!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు, పాదమునకు,26,అక్షరము లుండును,
యతులు.9,18,అక్షరములకు చెల్లును,

11,గర్భగత"గుణభావ"వృత్తము,

కూలు నేల దంతా లవెల్లన్!కుక్క చెప్పు కొరికె నంచున్!కోరి సిద్దను కొర్కు చోన్!
ఫాల నేత్రు డంతంబు సేయున్!ప్రక్క వార్ని దిగువ సేయన్!పొరుషత్వము మాయులే!
నేల సామరస్యంబు మేలౌ!నిక్కి నీల్గ మడియు దీవే!నేర నైజము తప్పునౌ!
రాలు ఖ్యాతి పరాపరాధీ!రక్క సత్వము చెడ దీయున్!రా రదెవ్వరు?కావగా!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు 26,అక్షరము లుండును,
యతులు,10,19,అక్షరములకు చెల్లును,

12,గర్భగత"సామరస్య"వృత్తము,

కోరి సిద్దను కొర్కు చోన్!కూలు నేల దంతా లవెల్లన్!కుక్క చెప్పు కొరికె నంచున్!
పౌరుషత్వము మాయులే!ఫాల నేత్రు డంతంబు సేయున్!ప్రక్క వార్ని దిగువ సేయన్!
నేర నైజము తప్పునౌ!నేల సామ రస్యంబు మేలౌ!నిక్కి నీల్గ మడియు దీవే!
రా రదెవ్వరు?కావగా!రాలు ఖ్యాతి పరాపరాధీ!రక్క సత్వము చెడ దీయున్!
.
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు. పాదమునకు "126"అక్షరము లుండును,
యతులు,9,18,అక్షరములకు చెల్లును,

13,,గర్భగత"-మేలగు"వృత్తము,

కుక్క చెప్పు కొరికె నంచున్!కూలు నేల దంతాలవెల్లన్!కోరి సిద్దను కొర్కు చోన్!
ప్రక్క వార్ని దిగువ సేయన్!ఫాల నేత్రు డంతంబు సేయున్!పౌరుషత్వము మాయులే!
నిక్కి నీల్గ మడియు దీవే!నేల సామ రస్యంబు మేలౌ!నేర నైజము తప్పునౌ!
రక్కసత్వము చెడదీయున్!రాలు ఖ్యాతి పరాపరాధీ!రా రదెవ్వరు?కావగా!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్పరము లుండును,
యతులు'10,19,అక్షరములకు చెల్లును,

14, గర్భగత",జ్ఞానతా"వృత్తము,

కూలు నేల దంతాలవెల్లన్!కోరి సిద్దను కొర్కు చోన్!కుక్క చెప్పు కొర్కె నంచున్!
ఫాల నేత్రుం డంతంబు సేయున్!పౌరుషత్వము మాయులే!ప్రక్క వార్ని దిగువ సేయన్!
నేల సామరస్యంబు మేలౌ!నేర నైజము తప్పునౌ!నిక్కి నీల్గ మడియు దీవే!
రాలు ఖ్యాతి పరాపరాధీ!రా రదెవ్వరు? కావగా!రక్కసత్వము చెడ దీయున్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు "26"అక్షరము లుండును,
యతులు,10,18,అక్షరములకు చెల్లును,

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.