గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, నవంబర్ 2024, శుక్రవారం

ఉపదేశో హి మూర్ఖాణాం. ... మేలిమిబంగారం మన సంస్కృతి

 జైశ్రీరామ్.

శ్లో.  ఉపదేశో హి మూర్ఖాణాం  -  ప్రకోపాయా న శాంతయే ౹

పయః పానం భుజంగనాం   -  కేవలం విష్వవర్ధనం ౹౹

తే.గీ.  మూర్ఖులకుబోధ చేయుట మూఢగుణము,

కోపమే పెంచు వానిలో, కొనఁడు శాంతి,

పాలు పోయుచు పెంచినన్ బాములోన

విషమె వృద్ధియౌ నిజమిది, వేదవేద్య!     

భావము.  మూర్ఖులకు ఉపదేశం చెయ్యడం వల్ల వాళ్లకు కోపం తెప్పించడం 

అవుతుందే కానీ వాళ్ళని శాంతపరచలేము.సరి చెయ్యలేము.పాములకు 

పాలు పొయ్యడం వల్ల వాటి విషం వృద్ధి అవుతుంది.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.