జైశ్రీరామ్.
శ్లో. నాప్రాప్యమభివాంఛంతి - నష్టం నేచ్ఛంతి శోచితుం ౹
ఆపత్సు చ న ముహ్యంతి - నరాః పండిత బుద్ధయః ౹౹
తే.గీ. ప్రాప్తమవనట్టిదానికై పరుగులిడరు,
తాము కోలుపోయిన దానిఁ దలపరు మది,
ఆపదలవేళ మోహమ్మునందబోరు,
బుద్ధిమంతులౌ పండితుల్, బుధవరేణ్య!
భావము. ప్రాప్తి లేనిదాన్ని వివేకం ఉన్న పండితులు ఆశించరు.నష్టమైనదానికి
చితించరు.అలాగే,ఆపత్తు కాలంలో ఏ మోహానికి గురి కారు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.