గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

18, నవంబర్ 2024, సోమవారం

శకటరేఫ యుక్త పదముల, సాధురేఫ యుక్త పదముల, మరియు అర్థానుస్వారపూర్వక వర్ణయుక్తపదముల, అర్థానుస్వారవర్ణ రహిత పదముల అర్థములు వేరువేరుగా ఉండునవగుటచే మనము వాటిని గ్రహింపవలసి యున్నది. గమనింపుడు.

జైశ్రీరామ్.

శకటరేఫ యుక్త పదముల, సాధురేఫ యుక్త పదముల, మరియు 

అర్థానుస్వారపూర్వక వర్ణయుక్తపదముల, అర్థానుస్వారవర్ణ రహిత పదముల 

అర్థములు వేరువేరుగా ఉండునవగుటచే మనము వాటిని గ్రహింపవలసి

యున్నది. గమనింపుడు. 

కరి = ఏనుగు

కఱి = నల్లని

కారు = ఋతువు, కాలము

కాఱు = కారుట (స్రవించు)

తరి = తరుచు

తఱి = తఱచు

తఱుఁగు = తగ్గుట, క్షయం

తఱుగు = తరగటం (ఖండించటం)

తీరు = పద్ధతి

తీఱు = నశించు, పూర్తి (తీరింది)

నెరి = వక్రత

నెఱి = అందమైన

నీరు = పానీయం

నీఱు = బూడిద

వేరు = చెట్టు వేరు

వేఋ = మరొకవిధము

అఱుగు = జీర్ణించు

అరుగు = వెళ్ళు, పోవు

అరుఁగు = వీధి అరుగుకాఁపు = కులము

కాపు = కావలి

కాఁచు = వెచ్చచేయు

కాచు = రక్షించు

ఏఁడు = సంవత్సరం

ఏడు = 7 సంఖ్య

చీఁకు = చప్పరించు

చీకు = నిస్సారము, గ్రుడ్డి

దాఁక = వరకు

దాక = కుండ, పాత్ర

నాఁడు = కాలము

నాడు = దేశము, ప్రాంతము

పేఁట = నగరములో భాగము

పేట = హారంలో వరుస

పోఁగు - దారము పో( గు

పోగు = కుప్ప

బోటి = స్త్రీ

బోఁటి = వంటి [నీబోఁటి]

వాఁడి = వాఁడిగా గల

వాడి = ఉపయోగించి

మడుఁగు = వంగు, అడఁగు

మడుగు =  కొలను, హ్రదము

ఈ విధముగా ఎన్నో ఉన్నాయి.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.