జైశ్రీరామ్.
శ్లో. ఉపయుక్తంతు నా దద్యాత్వ - ర్తికార్థంతు సాధకః
ఉపాదద్యాన్నూత్నమేవ - సతతం శ్రీ వివృద్ధయే.
తే.గీ. వాడియున్నట్టి యారిన వత్తులనిడి
దీపమును పెట్టరాదిల దేవుని కడ,
చేసి క్రొత్తగా వత్తులన్ శ్రీప్రదముగ
పెట్టుటొప్పును దీపమ్ము విజ్ఞులార!
భావము. సాధకుఁడి పూజాదికములలో దీపముపెట్టగా ఘనమైన
ఆ దీపపు వత్తులతో మరల దీపారాధన చేయరాదు. మంగళములు
కలుగుటకు దీపారాధన నూతనమైన వత్తులతోనే చేయవలెను.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.