జైశ్రీరామ్.
శ్లో. న హ్యస్త్యవిద్యా మనసోఽతిరిక్తా - మనో హ్యవిద్యా భవబన్ధహేతుః ।
తస్మిన్వినష్టే సకలం వినష్టం - విజృమ్భితేయస్మిన్సకలం విజృమ్భతే ।।
(వివేకచూడామణి 169)
తే.గీ. వెలుపల మదికి నెన్న నవిద్య లేదు,
మనసవిద్య, బంధముల్ మనకుఁగొలుపు,
నది నశించిన నశియించు నన్నియుఁ గన
నది విజృంభింప రేకెత్తునన్నియు, హరి!
భావము. మనస్సు వెలుపల అజ్ఞానం (అవిద్య) లేదు. మనస్సు ఒక్కటే అవిద్య,
పరివర్తన బంధానికి కారణం. అది నాశనమైనప్పుడు, మిగతావన్నీ నాశనమవుతాయి,
మరియు అది వ్యక్తమైనప్పుడు, మిగతావన్నీ వ్యక్తమవుతాయి.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.