జైశ్రీరామ్.
శ్లో. క్షుధాం దేహవ్యథాం త్యక్త్వా బాలః క్రీడతి వస్తుని ।
తథైవ విద్వాన్ రమతే నిర్మమో నిరహం సుఖీ ॥
(వివేకచూడామణి537)
తే.గీ. ఆకలిని దేహబాధల నతఁడు మరచి
యాడుకొను బాలుఁడెట్టులో యటులె పండి
తుండు మమకారమహము తా తుడిచివైచి
ధ్యానమగ్నుఁడై యానంద మానసుఁడగు.
భావము. ఆకలి దప్పుల్ని దేహ బాధను వదలి బాలుడు ఆటపాటల్లో ఎలా
నిమగ్నమై ఉంటాడో, అలానే తత్త్వవేత్త దేహేంద్రియ మనోబుద్ధి
చిత్తాహంకారాలను నేననే భ్రాంతిని వీడి,నిత్య నిరతిశయానంద నిష్ఠలో
నిమగ్నమై ఉంటాడు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.