జైశ్రీరామ్.
శ్లో. అనాలోక్య వ్యయం కర్తా - అనాథః కలహప్రియః
ఆతురః సర్వకార్యేషు - నరశ్శీఘ్రం వినస్యతి.
చాణక్యనీతి.
తే.గీ. చింతచేయక వ్యయమును చేయువాఁడు,
కలహమునకు తానొక్కఁడే వెడలువాఁడు
నన్నిపనులఁ దొందరపాటునున్న వాఁడు
నట్టి నరుఁడు నశించునో యమరవినుత!
భావము. ముందువెనుకలు చూచుకొనకుండా ధనమును వెచ్చించు వాఁడు,
ఒంటరిగా కలహమునకు సిద్దపడువాఁడు, అన్నిపనులయందు ఆతురతతో
ప్రవర్తించువాఁడు, ఐన నరుఁడు నశించిపోవును.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.