గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

6, నవంబర్ 2024, బుధవారం

క యితి బ్రహ్మణో నామ,. ... మేలిమిబంగారం మన సంస్కృతి. కేశవాయ స్వాహా అని పరిషేచన లో మొదటగా అనుటకు ముఖ్య కారణం.

 జైశ్రీరామ్.

శ్లో.  క యితి బ్రహ్మణో నామ,  - ఈశోహం సర్వ దేహినాం,

ఆవాం తవాంగే సంభూతౌ  -  తస్మాత్ కేశవ నామవాన్.

తే.గీ.  కయన బ్రహ్మనామంబగు, కనుమ నేను

నీశుఁడను దేహులకు హరీ! యెపుడు మేము

నీదు దేహంబుననునుంట, నిఖిల పతిరొ!

కేశవుండుగ నీపేరు భాసిలునయ.

భావము.  కేశవ అను విష్ణునామములో క యనునది బ్రహ్మనామము, ఈశ అనునది 

శివనామము, సమస్తదేహములందు ఉండు కేశవుని దేహములో బ్రహ్మ, 

ఈశ్వరుఁడు ఉన్నందున విష్ణువునకు కేశన అను నామము లకుగెను. 

త్రిమూర్తులకు ప్రతీకగా నిలుచు ఈ కేశవ నామమే పూజాదికములలో 

ప్రథమముగా ఆచమనసమయమున చెప్పబడుచుండును. అంతటి 

వైశిష్ట్యము కలదీ కేశవ నామము.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.