జైశ్రీరామ్.
శ్లో. సుమహాంత్యపి శాస్త్రాణి - ధారయంతో బహుశ్రుతాః |
ఛేత్తారః సంశయానాం చ - క్లిశ్యంతే లుబ్ధమోహితాః ||
(హితోపదేశం)
తే.గీ. కఠినమౌ శా స్త్రవిజ్ఞానఘనత కలిగి,
విషయములు పెక్కు తెలిసియు, ప్రీతి నితర
జనుల సంశయచ్ఛేదకుల్ జగతిలోన
లోభమోహాదులన్ జిక్కి క్లేశపడెడు.
భావము. కఠినతమమైన శాస్త్రాల జ్ఞానాన్ని కలిగి ఉన్నవారు, అనేక విషయాలను
విని తెలుసుకున్నవారు, మరియు ఇతరుల సందేహాలను తొలగించే సామర్థ్యం
ఉన్నవారు కూడా లోభం మరియు మోహానికి లోనై కష్టపడతారు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.