జైశ్రీరామ్.
నారాయనోపనిషద్ |
ఓం సహ నావవతు |
సహ నౌ భునక్తు |
సహ వీర్యం కరవావహై |
తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ||
ఓం శాన్తిః శాన్తిః శాన్తిః ||
ఓం అధ పురుషో హ వై నారాయణో కామయత ప్రజాః సృజేయేతి |
నారాయణాత్రాణో జాయతే | మనః సర్వేన్డ్రియాణి చ |
ఖం వాయుర్జ్యోతిరాపః పృథివీ విశ్వస్య ధారిణీ |
నారాయణాద్-బ్రహ్మా జాయతే |
నారాయణాద్_రుద్రో జాయతే |
నారాయణాదిన్రో జాయతే |
నారాయణాత్ప్రజాపతయః ప్రజాయన్తో |
నారాయణాధ్వాదశాదిత్యా రుద్రా వసవస్సర్వాణి చ ఛన్దాంసి |
నారాయణాదేవ సముత్పద్యన్తే |
నారాయణే ప్రవర్తనే |
నారాయణే ప్రలీయనే ||
ఓం | అథ నిత్యో నారాయణః |
బ్రహ్మా నారాయణః |
శివశ్చ నారాయణః |
శక్రశ్చ నారాయణః |
ద్యావాపృథివ్యౌ చ నారాయణః |
కాలశ్చ నారాయణః |
దిశశ్చ నారాయణః |
ఊర్ధ్వశ్చ నారాయణః |
అధశ్చ నారాయణః |
అన్తర్బహిశ్చ నారాయణః |
నారాయణ ఏవేదగ్ం సర్వమ్ |
యద్_భూతం యచ్చ భవ్యమ్ |
నిష్కలో నిరంజనో నిర్వికల్పో నిరాఖ్యాతః శుద్దో దేవ ఏకో నారాయణః |
న ద్వితీయోస్తి కశ్చిత్ | య ఏవం వేద |
స విష్ణురేవ భవతి స విష్ణురేవ భవతి ||
ఓమిత్యగ్రే వ్యాహరేత్ |
నమ ఇతి పశ్చాత్ |
నారాయణాయేత్యుపరిష్టాత్ |
ఓమిత్యేకాక్షరమ్ |
నమ ఇతి ద్వే అక్షరే |
నారాయణాయేతి పఞ్చక్షరాణి |
ఏతద్వై నారాయణస్యాష్టాక్షరం పదమ్ |
యో హ వై నారాయణస్యాష్టాక్షరం పదమధ్యేతి |
అనపబ్రవస్సర్వమాయురేతి |
విన్దతే ప్రాజాపత్యగం రాయస్పోషం గౌపత్యమ్ |
తతోzమృతత్వమశ్నుతే తతోzమృతత్వమశ్నుత ఇతి | య ఏవం వేద ||
ప్రత్యగానన్దం బ్రహ్మ పురుషం ప్రణవస్వరూపమ్ |
అకార ఉకార మకార ఇతి |
తానేకదా సమభరత్తదేతదోమితి |
యముక్త్వా ముచ్యతే యోగీ జన్మసంసారబన్దనాత్ |
ఓం నమో నారాయణాయేతి మన్రోపాసకః |
వైకుణభువనలోకం గమిష్యతి |
తదిదం పరం పుణ్డరీకం విజ్ఞానఘనమ్ |
తస్మాత్తదిదావన్మాత్రమ్ |
బ్రహ్మణ్యో దేవకీపుత్రో బ్రహ్మణ్యో మధుసూదనోమ్ |
సర్వభూతస్థమేకం నారాయణమ్ |
కారణరూపమకార పరబ్రహ్మోమ్ |
ఏతదధర్వ శిరోయో2ధీతే ప్రాతరధీయానో
రాత్రికృతం పాపం నాశయతి |
సాయమధీయానో దివసకృతం పాపం నాశయతి |
మాధ్యన్దినమాదిత్యాభిముఖోఽధీయానః
పఞ్చపాతకోపపాతకాత్రముచ్యతే |
సర్వ వేద పారాయణ పుణ్యం లభతే |
నారాయణసాయుజ్యమవాప్నోతి నారాయణ సాయుజ్యమవాప్నోతి | య ఏవం వేద | ఇత్యుపనిషత్ ||
ఓం సహ నావవతు సహ నౌ భునక్తు |
సహ వీర్యం కరవావహై |
తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ||
ఓం శాన్తిః శాన్తిః శాన్తిః ||
నారాయనోపనిషద్ |
ఓం అధ పురుషో హ వై నారాయణో కామయత ప్రజాః సృజేయేతి |
పరమపురుషుఁడైన నారాయణుఁడు జీవులను సృష్టించ సంకల్పించెను.
నారాయణాత్రాణో జాయతే |
ఆ నారాయణుని నుండి ప్రాణశక్తి ఉద్భవించెను.
మనః సర్వేన్డ్రియాణి చ |
మనస్సు ఇంద్రియములు ఆ నారాయణుని నుండి ఉద్భవించెను.
ఖం వాయుర్జ్యోతిరాపః పృథివీ విశ్వస్య ధారిణీ |
ఆకాశము, వాయువు, అగ్ని, జలము, మరియు భూమి నారాయణునినుండి ఉద్భవించెను. ఇవన్నియు కలిసి విశ్వముగా రూపొందెను.
నారాయణాద్-బ్రహ్మా జాయతే |
నారాయణునినుండి బ్రహ్మ ఉద్భవించెను.
నారాయణాద్_రుద్రో జాయతే |
నారాయణునినుండి మహారుద్రుఁడు ఉద్భవించెను.
నారాయణాదిన్రో జాయతే |
నారాయణునినుండి ఇంద్రుఁడు ఉద్భవించెను.
నారాయణాత్ప్రజాపతయః ప్రజాయన్తో |
మరియు ప్రజాపతులు నారాయణునినుండి ఆవిర్భవించిరి.
నారాయణాధ్వాదశాదిత్యా రుద్రా వసవస్సర్వాణి చ ఛన్దాంసి |
ద్వాదశాదిత్యులు, ఏకాదశ రుద్రులు, అష్టవసువులు, నాలుగు వేదములు, మరియు సమస్త సంపదలు కూడా నారాయణునినుండియే యుత్పత్తియయ్యెను.
నారాయణాదేవ సముత్పద్యన్తే |
సృష్టిలోని సమస్త జీవులు, వస్తువులు నారాయణునినుండి ఉత్పత్తి అయ్యెను.
నారాయణే ప్రవర్తనే | నారాయణే ప్రలీయనే ||
సృష్టి అంతయు నారాయణునిచే పోషింపఁబడి, చివరికి నారాయణునియందే లయమగును.
ఓం | అథ నిత్యో నారాయణః |
నారాయణ తత్త్వము సనాతనమైనది.
బ్రహ్మా నారాయణః |
బ్రహ్మయే నారాయణుఁడు.
శివశ్చ నారాయణః |
పరమేశ్వరుఁడు నారాయణుఁడు.
శక్రశ్చ నారాయణః |
ఇంద్రుఁడు కూడా నారాయణ స్వరూపుఁడే.
ద్యావాపృథివ్యౌ చ నారాయణః |
స్వర్గ, మర్త్య లోకములు రెండూ నారాయణ తత్త్వముతో నిండియున్నవి.
కాలశ్చ నారాయణః |
కాలము నారాయణ స్వరూపమే.
దిశశ్చ నారాయణః |
దిక్కులు నారాయణ స్వరూపమే.
ఊర్ధ్వశ్చ నారాయణః | అధశ్చ నారాయణః |
ఊర్ధ్వాధోలోకములు నారాయణ తత్త్వమే.
అన్తర్బహిశ్చ నారాయణః |
అంతర్బహిరూపమైన సమస్త లోకములు నారాయణ స్వరూపమే.
నారాయణ ఏవేదగ్ం సర్వమ్ |
సమస్తము నారాయణ స్వరూపమే.
యద్_భూతం యచ్చ భవ్యమ్ |
భూత భవిష్యత్ కాలములు నారాయణ స్వరూపమే.
నిష్కలో నిరంజనో నిర్వికల్పో నిరాఖ్యాతః శుద్దో దేవ ఏకో నారాయణః | న ద్వితీయోస్తి కశ్చిత్ | య ఏవం వేద|
నారాయణ తత్త్వము నిష్కల్మషమైనది. నిరంజనమైనది. నిర్వికల్పమైనది. మరియు అద్వైతమైనది.నారాయణుఁడు విశ్వమంతా వ్యాపించియున్నాఁడు. నారాయణుఁడొక్కఁడే నిత్యసత్యమైనవాడు.
స విష్ణురేవ భవతి స విష్ణురేవ భవతి ||
ఈ జగత్తులో నారాయణ స్వరూపము కానిదేదీ లేదు. నారాయణుఁడు పరమాత్మ స్వరూపుఁడు.
ఓమిత్యగ్రే వ్యాహరేత్ |
నారాయణ మంత్రము ప్రణవమైన ఓం తో ప్రారంభమౌతుంది.
నమ ఇతి పశ్చాత్ |
తరువాత నమో అనే అక్షరములు ఉచ్చరించాలి.
నారాయణాయేత్యుపరిష్టాత్ |
తరువాత నారాయణ అనే పదమును ధ్యానించాలి.
ఓమిత్యేకాక్షరమ్ |
ఓం ఏకాక్షరము.
నమ ఇతి ద్వే అక్షరే |
నమో రెండక్షరములతోను,
నారాయణాయేతి పఞ్చక్షరాణి |
మరియు నారాయణ పంచాక్షరములతోను కూడియున్నది.
ఏతద్వై నారాయణస్యాష్టాక్షరం పదమ్ |
ఇవన్నీ కలిసి ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రముగా రూపు దిద్దుకున్నది.
యో హ వై నారాయణస్యాష్టాక్షరం పదమధ్యేతి |
ఈ అష్టాక్షరీ మంత్రము మంత్రములన్నిటికీ మకుటాయమానమైనది.
అనపబ్రవస్సర్వమాయురేతి |
ఎవరైతే ఈ మంత్రమును నిర్మల భక్తి విశ్వాసములతో ప్రతి నిత్యము జపిస్తారో వారికి ఆరోగ్యము, దీర్ఘాయుషు, మరియు సకల సంపదలు చేకూరును.
విన్దతే ప్రాజాపత్యగం రాయస్పోషం గౌపత్యమ్ |
వారికి ప్రజాపతి పదవి కూడా లభిస్తుంది.
తతోzమృతత్వమశ్నుతే తతోzమృతత్వమశ్నుత ఇతి | య ఏవం వేద ||
అంతే కాదు వారు నారాయణత్వ స్థితిని పొందుతారు.
ప్రత్యగానన్దం బ్రహ్మ పురుషం ప్రణవస్వరూపమ్ |
ప్రణవము సాక్షాత్ ప్రాణ తత్త్వము. ప్రణవము బ్రహ్మానంద స్వరూపము. ఇది అత్యున్నతమైన ఆత్మ తత్త్వము.
అకార ఉకార మకార ఇతి | తానేకదా సమభరత్తదేతదోమితి |
ప్రణవనాదమైన ఓం అ కార ఉ కార మ కార ములతో కూడుకొన్న మంత్రము.
యముక్త్వా ముచ్యతే యోగీ జన్మసంసారబన్దనాత్ |
ఈ విషయమును తెలుసుకొన్న యోగీశ్వరులు భక్తిప్రపత్తులతో ఓం అను ప్రణవ మంత్రమును జపించి ముక్తిధామమును చేరుదురు.
ఓం నమో నారాయణాయేతి మన్రోపాసకః | వైకుణభువనలోకం గమిష్యతి |
ఓం నమో నారాయాణాయ అనే అష్టాక్షరీ మంత్రమును భక్తిశ్రద్ధలతో జపించువారు వైకుంఠ ధామమును చేరగలరు.
తదిదం పరం పుణ్డరీకం విజ్ఞానఘనమ్ |
ఆయన జీవుల హృదయకమలముపై అధివసించి ఉంటాడు. ఆ పరబ్రహ్మ తత్త్వమును గురించిన జ్ఞానమే అత్యున్నతమైన విజ్ఞాన ధనము.
తస్మాత్తదిదావన్మాత్రమ్ |
ఆ జ్ఞానబోధ విద్యుల్లతవలె ప్రకాశిస్తుంది.
బ్రహ్మణ్యో దేవకీపుత్రో బ్రహ్మణ్యో మధుసూదనోమ్ |
దేవకీనందనుఁడైన శ్రీకృష్ణపరమాత్మ సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుఁడే. ఆయన మధు సూదనునిగా కూడా కీర్తింపఁబడుతున్నాఁడు.
సర్వభూతస్థమేకం నారాయణమ్ |
ఆయన సర్వభూతాంతరాత్మ. ఆయన సమస్థ జగత్తుకు మూలాధారమైన తత్త్వము.
కారణరూపమకార పరబ్రహ్మోమ్ |
ఆయనను బంధించే కారణమేమీ లేదు. ఆయన అ కార పరబ్రహ్మ.
ఏతదధర్వ శిరోయో2ధీతే ప్రాతరధీయానో రాత్రికృతం పాపం నాశయతి |
అధర్వ వేదమునందలి ప్రథమభాగమునందీవిధముగా చెప్పఁబడినది. ఈ ఉపనిషత్తును ప్రాతః కాలమందు పఠించిన గత రాత్రియంది చేయఁబడిన పాపములను నిర్మూలించును.
సాయమధీయానో దివసకృతం పాపం నాశయతి |
సాయం సంధ్యయందు పఠించిన పగటిభాగమందు చేయఁబడిన పాపములను నిర్మూలించును.
మాధ్యన్దినమాదిత్యాభిముఖోఽధీయానః పఞ్చపాతకోపపాతకాత్రముచ్యతే |
మధ్యాహ్న సమయమందు సూర్యునివైపు చూస్తూ పఠించిన పంచమహాపాతకోపపాతకములు నిర్మూలించఁబడును.
సర్వ వేద పారాయణ పుణ్యం లభతే |
ఈ ఉపనిషత్తును పఠించినవారికి చతుర్వేదములను అద్ధ్యయనము చేసిన ఫలితము లభించును.
నారాయణసాయుజ్యమవాప్నోతి నారాయణ సాయుజ్యమవాప్నోతి | య ఏవం వేద | ఇత్యుపనిషత్ ||
చివరకు వారి నారాయణ సాయుజ్యమును పొందుదురు.
ఓం సహ నావవతు సహ నౌ భునక్తు |
సహ వీర్యం కరవావహై |
తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ||
ఓం శాన్తిః శాన్తిః శాన్తిః ||
భావము.
పరమపురుషుఁడైన నారాయణుఁడు జీవులను సృష్టించ సంకల్పించెను. ఆ నారాయణుని నుండి ప్రాణశక్తి ఉద్భవించెను. మనస్సు ఇంద్రియములు ఆ నారాయణుని నుండి ఉద్భవించెను. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, మరియు భూమి నారాయణునినుండి ఉద్భవించెను. ఇవన్నియు కలిసి విశ్వముగా రూపొందెను. నారాయణునినుండి బ్రహ్మ ఉద్భవించెను. నారాయణునినుండి మహారుద్రుఁడు ఉద్భవించెను. నారాయణునినుండి ఇంద్రుఁడు ఉద్భవించెను. మరియు ప్రజాపతులు నారాయణునినుండి ఆవిర్భవించిరి. ద్వాదశాదిత్యులు, ఏకాదశ రుద్రులు, అష్టవసువులు, నాలుగు వేదములు, మరియు సమస్త సంపదలు కూడా నారాయణునినుండియే యుత్పత్తియయ్యెను. సృష్టిలోని సమస్త జీవులు, వస్తువులు నారాయణునినుండి ఉత్పత్తి అయ్యెను. సృష్టి అంతయు నారాయణునిచే పోషింపఁబడి, చివరికి నారాయణునియందే లయమగును. నారాయణ తత్త్వము సనాతనమైనది. బ్రహ్మయే నారాయణుఁడు. పరమేశ్వరుఁడు నారాయణుఁడు. ఇంద్రుఁడు కూడా నారాయణ స్వరూపుఁడే. స్వర్గ, మర్త్య లోకములు రెండూ నారాయణ తత్త్వముతో నిండియున్నవి. కాలము నారాయణ స్వరూపమే. దిక్కులు నారాయణ స్వరూపమే. ఊర్ధ్వాధోలోకములు నారాయణ తత్త్వమే. అంతర్బహిరూపమైన సమస్త లోకములు నారాయణ స్వరూపమే. సమస్తము నారాయణ స్వరూపమే. భూత భవిష్యత్ కాలములు నారాయణ స్వరూపమే.
నారాయణ తత్త్వము నిష్కల్మషమైనది. నిరంజనమైనది. నిర్వికల్పమైనది. మరియు అద్వైతమైనది. నారాయణుఁడు విశ్వమంతా వ్యాపించియున్నాఁడు. నారాయణుఁడొక్కఁడే నిత్యసత్యమైనవాడు. ఈ జగత్తులో నారాయణ స్వరూపము కానిదేదీ లేదు. నారాయణుఁడు పరమాత్మ స్వరూపుఁడు. నారాయణ మంత్రము ప్రణవమైన ఓం తో ప్రారంభమౌతుంది. తరువాత నమో అనే అక్షరములు ఉచ్చరించాలి. తరువాత నారాయణ అనే పదమును ధ్యానించాలి. ఓం ఏకాక్షరము. నమో రెండక్షరములతోను, మరియు నారాయణ పంచాక్షరములతోను కూడియున్నది. ఇవన్నీ కలిసి ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రముగా రూపు దిద్దుకున్నది. ఈ అష్టాక్షరీ మంత్రము మంత్రములన్నిటికీ మకుటాయమానమైనది. ఎవరైతే ఈ మంత్రమును నిర్మల భక్తి విశ్వాసములతో ప్రతి నిత్యము జపిస్తారో వారికి ఆరోగ్యము, దీర్ఘాయుషు, మరియు సకల సంపదలు చేకూరును. వారికి ప్రజాపతి పదవి కూడా లభిస్తుంది.అంతే కాదు వారు నారాయణత్వ స్థితిని పొందుతారు. ప్రణవము సాక్షాత్ ప్రాణ తత్త్వము. ప్రణవము బ్రహ్మానంద స్వరూపము. ఇది అత్యున్నతమైన ఆత్మ తత్త్వము. ప్రణవనాదమైన ఓం అ కార ఉ కార మ కార ములతో కూడుకొన్న మంత్రము. ఈ విషయమును తెలుసుకొన్న యోగీశ్వరులు భక్తిప్రపత్తులతో ఓం అను ప్రణవ మంత్రమును జపించి ముక్తిధామమును చేరుదురు. ఓం నమో నారాయాణాయ అనే అష్టాక్షరీ మంత్రమును భక్తిశ్రద్ధలతో జపించువారు వైకుంఠ ధామమును చేరగలరు. ఆయన జీవుల హృదయకమలముపై అధివసించి ఉంటాడు. ఆ పరబ్రహ్మ తత్త్వమును గురించిన జ్ఞానమే అత్యున్నతమైన విజ్ఞాన ధనము. ఆ జ్ఞానబోధ విద్యుల్లతవలె ప్రకాశిస్తుంది. దేవకీనందనుఁడైన శ్రీకృష్ణపరమాత్మ సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుఁడే. ఆయన మధు సూదనునిగా కూడా కీర్తింపఁబడుతున్నాఁడు. ఆయన సర్వభూతాంతరాత్మ. ఆయన సమస్థ జగత్తుకు మూలాధారమైన తత్త్వము. ఆయనను బంధించే కారణమేమీ లేదు. ఆయన అ కార పరబ్రహ్మ. అధర్వ వేదమునందలి ప్రథమభాగమునందీవిధముగా చెప్పఁబడినది. ఈ ఉపనిషత్తును ప్రాతః కాలమందు పఠించిన గత రాత్రియంది చేయఁబడిన పాపములను నిర్మూలించును. సాయం సంధ్యయందు పఠించిన పగటిభాగమందు చేయఁబడిన పాపములను నిర్మూలించును. మధ్యాహ్న సమయమందు సూర్యునివైపు చూస్తూ పఠించిన పంచమహా పాతకోపపాతకములు నిర్మూలించఁబడును. ఈ ఉపనిషత్తును పఠించినవారికి చతుర్వేదములను అద్ధ్యయనము చేసిన ఫలితము లభించును. చివరకు వారి నారాయణ సాయుజ్యమును పొందుదురు.
ఓం సహ నావవతు సహ నౌ భునక్తు |
సహ వీర్యం కరవావహై |
తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ||
ఓం శాన్తిః శాన్తిః శాన్తిః ||
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.