జైశ్రీరామ్.
నయ,సాన్నిధ్య,దశమార్పు ,ప్రళయంకర,పగత,నెలవు, విషగళ, అనిశ్చిత,నిశిచర,ప్రళ య గర్భ
"-కలిగమన"-వృత్తము .
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
**కలిగమన**వృత్తము.
ఉత్కృతిఛందము.న.న.న.న.స.న.న.జ.ల ల.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
ఇసుక మెసగు నొకడు?ఇల,గనులు మెక్కొకడు?ఇల,గిరు లమ్మొ కడు?
రసిక చరుడు నొకడు?ప్రళయముల కర్తొకడు?ప్రళయ సృజుం డొకడు?
కసిగ జెలగు నొకడు?"కలికి-నిలయుం డొకడు?గళము విషం బొకడు?
నిశిని తిరుగు నొకడు?నిలుకడ గనం డొకడు?నిలుపు దురం బొకడు?
ఇసుక మెసగు=ఇసుకను తిను,(ఇసుకననమ్ముకొనును),గనుల మెక్కు=గనులనుభుజించు(గనులను అమ్మును),గిరులమ్ము=
కొండలనువిక్రయయించును.ప్రళయకర్ త=ప్రళయకారకుడు,
ప్రళయ సృజుండు=విపత్కరుడు,కసిగజెలగు ఇతరకులములపపై
నీర్ష్య,కలికినిలుడు=చెడులకు తావైన వాడు.గళము విషంబు=కుత్తక
యందు విషము.విషప పూరిత వాగ్జాలము.నిశిని తిరుగు=రాత్రులందు
తిరుగాడు(దొంగ),నిలుకడ=స్థిరత్ వము,నిలుపు దురంబు=యుద్ధము
కలిగించు.(జగడాల మారి),
1.గర్భగత"-నయ"-వృత్తము.
బృహతీఛందము.న.న.న.గణములు.వృససం. 512.ప్రాస గలదు.
ఇసుక మెసగు నొకడు?
రసిక చరుడు నొకడు?
కసిగ జెలగు నొకడు?
నిశిని తిరుగు నొకడు?
2.గర్భగత"-సాన్నిధ్య"-వృత్తము.
బృహతీఛందము.న.స.న.గణములు.వృ.సం. 480.ప్రాసగలదు.
ఇల గనులు మెక్కొకడు?
ప్రళయముల కర్తొకడు?
కలికి నిలయుం డొకడు?
నిలుకడ గనం డొకడు?
3.గర్భగత"-దశమార్పు"-వృత్తము.
అనుష్టుప్ఛందము.న.జ.లల.గణములు. వృ.సం.240.ప్రాసగలదు.
ఇల గిరు లమ్మొకడు?
ప్రళయ సృజుం డొకడు?
గళము విషం బొకడు?
నిలుపు దురం బొకడు?
4.గర్భగత"-ప్రళయంకర"-వృత్తము.
ధృతిఛందము.న.న.న.న.స.న.గణములు. యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
ఇసుక మెసగు నొకడు?ఇల గనుల మెక్కొకడు?
రసిక చరుడు నొకడు?ప్రళయముల కర్తొకడు?
కసిగ జెలగు నొకడు?కలికి నిలయుం డొకడు?
నిశిని తిరుగు నొకడు?నిలుకడ గనం డొకడు?
5.గర్భగత"-పగత"-వృత్తము.
అత్యష్టీఛందము.న.స.న.న.జ.లల. గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
ఇల గనుల మెక్కొకడు?ఇల గిరు లమ్మొకడు?
ప్రళయముల కర్తొకడు?ప్రళయ సృజుం డొకడు?
కలికి నిలయుం డొకడు?గళము విషం బొకడు?
నిలుకడ గనం డొకడు?నిలుపు దురం బొకడు?
6.గర్భగత"-విషగళ"-వృత్తము.
ఉత్కృతఛందము.న.స.న.న.జ.న.న.న. లల.గణములు.యతులు.10,18.ప్రాసననీ మముగలదు.
ఇల గనుల మెక్కొకడు?ఇల గిరు లమ్మొకడు?ఇసుక మెసగు నొకడు?
ప్రళయముల కర్తొకడు?ప్రళయ సృజుండొకడు?రసిక చరుడు నొకడు?
కలికి నిలయుం డొకడు?గళము విషం బొకడు?కసిగ జెలగు నొకడు?
నిలుకడ గనం డొకడు?నిలుపు దురం బొకడు?నిశిని కదులు నొకడు?
7.గర్భగత"-నెలవు"-వృత్తము.
అత్యష్టీఛందము.న.జ.న.న.న.లల. గణములు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
ఇల గిరు లమ్మొకడు?ఇసుక మెసగు నొకడు?
ప్రళయ సృజుండొకడు?రసిక చరుడు నొకడు?
గళము విషం బొకడు?కసిగ జెలగు నొకడు?
నిలుపు దురం బొకడు?నిశిని కదులు నొకడు?
8.గర్భగత"-అనిశ్చిత"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.జ.న.న.న.న.న.జ. లల.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
ఇల గిరు లమ్మొకడు?ఇసుక మెసగు నొకడు?ఇల గనుల మెక్కొకడు?
ప్రళయ సృజుం డొకడు?రసిక చరుడు నొకడు?ప్రళయముల కర్తొకడు?
గళము విషం బొకడు?కసిగ జెలగు నొకడు?కలికి నిలయుం డొకడు?
నిలుపు దురం బొకడు?నిశిని కదులు నొకడు?నిలుకడ గనం డొకడు?
9.గర్భగత"-నిశిచర"-వృత్తము.
ధృతిఛందము.న.స.న.న.న.న.గణములు. యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
ఇల గనుల మెక్కొకడు?ఇసుక మెసగు నొకడు?
ప్రళయముల కర్తొకడు?రసిక చరుడు నొకడు?
కలికి నిలయుం డొకడు?కసిగ జెలగు నొకడు?
నిలుకడ గనం డొకడు?నిశిని కదులు నొకడు?
10,గర్భగత"-ప్రళయ"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.స.న.న.న.న.న.జ. లల.గణములు.యతులు 10,19.
ప్రాసనీమముగలదు.
ఇల గనుల మెక్కొకడు?ఇసుక మెసగు నొకడు?ఇల గిరు లమ్మొకడు?
ప్రళయముల కర్తొకడు?రసిక చరుడు నొకడు?ప్రళయ సృజుం డొకడు?
కలికి నిలయుం డొకడు?కసిగ జెలగు నొకడు?గళము విషం బొకడు?
నిలుకడ గనం డొకడు?నిశిని కదులు నొకడు?నిలుపు దురం బొకడు?
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.