జైశ్రీరామ్.
నయద్వయ,చతురిమ,యుగళని దేశినీ,పంచాస్య,నవవిర తిపంచాస్య,భేదవిరతి నిదానినాయుగళ,గర్భ"-ని దానినా"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.
"-నిదానినా యుగళ"-వృత్తములు.
ఉత్కృతిఛందము.న.న.న.న.న.న.న.న. లల.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.వృ.సం.6,71,08, 864.
1.యెదలు సొదలు దవిలె!ఎదుగు పొదుగు గనక! ఇటునటు నెటు గన?
ముదము కొదువ యవగ!మొదలు చెరిగె నిజము!మొటికె చిదుము టగు!
పదిల మెటుల పొసగు?పదపడ శ్రమ మిగులు!పటువు చెడును జగతి?
సుధలు గనగ వశమె?క్షుదలు తొలగ వవని!స్ఫుటము తెగు నిజము!
2.ఎదుగు పొదుగు గనక!యెదలు సొదలు దవిలె!ఇటునటు నెటు గన?
మొదలు చెరిగె నిజము!ముదము కొదువ యవగ!మొటికె చిదుము టగు!
పదపడ శ్రమ మిగులు!పదిల మెటుల పొసగు?పటువు చెడు జగతి!
క్షుదలు తొలగ వవని!సుధలు గనగ వశమె?స్ఫుటము తెగు నిజము!
1.గర్భగత"-నయద్వయ"-వృత్తములు.
బృహతీఛందము.న.న.న.గణములు.వృ.సం. 512.ప్రాసగలదు.
1.యెదలు సొదలు దవిలె! 2.ఎదుగు పొదుగు గనక!
ముదము కొదువ యవగ! మొదలు చెరిగె నిజము!
పదిల మెటుల పొసగు? పదపడ శ్రమ మిగులు!
సుధలు గనగ వశమె? క్షుదలు తొలగ వవని!
2.గర్భగత"-చతురిమ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.న.న.లల.గణములు. వృ.సం.256.ప్రాసగలదు.
ఇటు నటు నెటు గన?
మొటికె చిదుము టగు!
పటువు చెడు జగతి!
స్ఫుటము తెగు నిజము!
2.గర్భగత"-యుగళ నిదేశినీ"-వృత్తములు.
ధృతిఛందము.న.న.న.న.న.న.గణములు. యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.వృ.సం.2,62,144.
1.ఎదలు సొదలు దవిలె! యెదుగు పొదుగు గనక!
ముదము కొదువ యవగ!మొదలు చెరిగె నిజము!
పదిల మెటుల పొసగు?పదపడ శ్రమ మిగులు!
సుధలు గనగ వశమె? క్షుదలు తొలగ వవని!
2.ఎదుగు పొదుగు గనక!యెదలు సొదలు దవిలె!
మొదలుచెరిగగె నిజము!ముదము కొదువ యవగ!
పదపడ శ్రమ మిగులు!పదిల మెటుల పొసగు?
క్షుదలు తొలగ వవని!సుధలు గనగ వశమె?
3.గర్భగత"-పంచాస్య"-వృత్తము
అత్యష్టీఛందము.న.న.న.న.న.లల. గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.వృ.సం.1,31,072.
1.ఎదుగు పొదుగు గనక!ఇటు నటు యెటు గన!
మొదలు చెరిగె నిజము!మొటికె చిదుము టగు!
పదపడ శ్రమ మిగులు!పటువు చెడు జగతి!
క్షుదలు తొలగ వవని!స్ఫుటము తెగు నవని!
4.గర్భగత"-నవవిరతిపంచాస్య"-వృత్ తము.
అత్యష్టీఛందము.న.న.న.న.న.లల. గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.వృ.సం.1.31,072.
ఇటు నటు ఎటు గన!యెదలు సొదలు దవిలె!
మొటికె చిదుము టగు!ముదము కొదువ యవగ!
పటువు చెడు జగతి! పదిల మెటుల పొసగు?
స్ఫుటము తెగు నవని!సుధలు గనగ వశమె?
5.గర్భగత"భేదవిరతినిదానినా"-యు గళ వృత్తములు.
ఉత్కృతిఛందము.న.న.న.న.న.న.న.న. లల.గణములు.
వృ.సం.6,71,08,864.ప్రాసగలదు.
1.9,18,విరతి నిదానినా వృత్తము.
ఇటు నటు యెటు గన!యెదలు సొదలు దవిలె!ఎదుగు పొదుగు గనక!
మొటికె చిదుము టగు!ముదము కొదువ యవగ!మొదలు చెరిగె నిజము!
పటువు చెడు జగతి!పదిల మెటుల పొసగు?పదపడ శ్రమ మిగులు!
స్ఫుటము తెగు నవని!సుధలు గనగ వశమె?క్షుదలు తొలగ వవని!
2.10,1నివిరతి నిదానినా వృత్తము.
ఎదుగు పొదుగు గనక!ఇటు నటు ఎటు గన!యెదలు సొదలు దవిలె!
మొదలు చెరిగె నిజము!మొటికె చిదుము టగు!ముదము కొదువ యవగ!
పదపడ శ్రమ మిగులు!పటువు చెడు జగతి!పదిల మెటుల పొసగు?
క్షుదలు తొలగ వవని!స్ఫుటము తెగు నవని!సుధలు గనగ వశమె?
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.