గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, జులై 2018, మంగళవారం

వినయశ,భ్రమర,నాశక,కలుముల,చిరంబ,మృగత,దర్వినీ,సమసాననస, చెల్లౌ,తల ములుకులు.గర్భ"-తరింపు"-వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్
వినయశ,భ్రమర,నాశక,కలుముల,చిరంబ,మృగత,దర్వినీ,సమసాననస, చెల్లౌ,తల ములుకులు.గర్భ"-తరింపు"-వృత్తమురచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

"- తరింపు"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.న.స.భ.త.భ.య.త.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
తల ములుకుల కొలుకుల్?తాపము గల్గించు నోయి!తరియింపే!మృగ్యం బగుగా!       
బలుపని తలపకుమా!వాపది రోగాల పుట్ట!భరమౌ జీవార్తిం గనుగా?
కలుములు చరములుగా!కాపుర మౌనే?చిరంబు!కరమౌ!కీర్తిం!తా గనునే?
నిలువవు స్థిర మొకచోన్!నీపని!చెల్లౌను శ్శ్రీల! నిరసించే!చైదం బలమున్?

1.గర్భగత"-వినయశ"-వృత్తము.
బృహతీఛందము.న.న.స.గణములు.వృ.సం.256.ప్రాసగలదు.
తల మలుకుల కొలుకుల్?
బలుపని తలపకుమా!
కలుములు చరములుగా!
నిలువవు స్థిర మొకచోన్?

2.గర్భగత"-భ్రమర"-వృత్తము.
అనుష్టుప్ఛందము.భ.త.గల.గణములు.వృ.సం 167.ప్రాసగలదు.
తాపము గల్గించు నోయి!
వాపది రోగాల పుట్ట!
కాపురమౌనే?చిరంబు!
నీపని చెల్లౌను!శ్రీల?

3.గర్భగత"-నాశక"-వృత్తము.
బృహతీఛందము.స.మ.స.గణములు.వృ.సం.196.ప్రాసగలదు.
తరియింపే!మృగ్యం బగుగా?
భరమౌ!జీవార్తిం గనుగా!
కరమౌ!కీర్తిం తా గనునే?
నిరసించే!చైదం బలమన్?

4.గర్భగత"-కలుములు"-వృత్తము.
అత్యష్టీఛందము.న.న.స.భ.త.గల.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
తలములుకుల కులుకుల్?తాపము గల్గించు నోయి!
బలుపని తలపకుమా!వాపది రోగాల పుట్ట!
కలుములు చరములుగా!కాపుర మౌనే?చిరంబు?
నిలువవు స్థిర మొకచోన్?నీపని చెల్లౌను! శ్రీల?

5.గర్భగత"-చిరంబ"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.త.భ.య.త.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
తాపము కల్గించు నోయి!తరింపే!మృగ్యం బగుగా?
వాపది రోగాల పుట్ట!భరమౌ జీవార్తిం గనుగా!
కాపుర మౌనే?చిరంబు!కరమౌ!కీర్తిం తా గనునే?
నీపని చెల్లౌను శ్రీల?నిరసించే చైదంబలమన్?

6.గర్భగత"-మృగతా"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.త.భ.య.త.జ.న.న.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
తాపము కల్గించు నోయి!తరియింపే!మృగ్యం బగుగా?తల ములుకుల కులుకుల్?
వాపది రోగాల పుట్ట!భరమౌ జీవార్తిం గనుగా!బలుపని తలపకుమా?
కాపురమౌనే?చిరంబు?కరమౌ!కీర్తిం తా గనునే?కలుములు చరములుగా!
నీపని చెల్లౌను శ్రీల!నిరసించే చైదం బలమన్?నిలువవు స్థిర మొక చోన్?

7.గర్భగత"-దర్విణీ"-వృత్తము.
ధృతిఛందము.స.మ.స.న.న.స.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
తరియింపే! మృగ్యంబగుగా?తల ములుకుల కులుకుల్?
భరమౌ జీవార్తిం గనుగా !బలుపని తలపకుమా?
కరమౌ కీర్తిం తాగనునే?కలుములు చరములుగా!
నిరసించే చైదంబలమన్?నిలువవు స్థిర మొకచోన్?

8.గర్భగత"-సమసా ననసా"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.మ.స.న.న.స.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
తరియింపే!మృగ్యంబగుగా?తలములుకుల కులుకుల్?తాపము గల్గించు నోయి?
భరమౌ!జీవార్తిం గనుగా!బలుపని తలపకుమా?వాపది రోగాల పుట్ట!
కరమౌ!కీర్తిం తా గనునే?కలుములు చరములుగా!కాపుర మౌనే?చిరంబు?
నిరసించే చైదం బలమం?నిలువవు స్థిర మొకచోన్?నీపని చెల్లౌను శ్రీల!

9,గర్భగత"-చెల్లౌ"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.త.భ.న.న.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
తాపము కలిగించు నోయి?తలములుకుల కులుకుల్?
వాపది రోగాల పుట్ట! బలుపని  తలపకుమా!
కాపుర మౌనే?చిరంబు?కలుములు చరములుగా!
నీ పని చెల్లౌను శ్రీల!నిలువవు స్థిర మొకచోన్!

10,గర్భగత"-తలములకల"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.త.భ.న.న.జ.య.త.లగ.గణములు.యతులు9,18.
ప్రాసనీమముగలదు.
తాపము కలిగించు నోయి!తలములకల కులుకుల్?తరియింప!మృగ్యం బగుగా?
వాపది రోగాల పుట్ట!బలుపని తలపకుమా?భరమౌ!జీవార్తిం గనుగా!
కాపుర మౌనే?చిరంబు!కలుములు చరములుగా!కరమౌ కీర్తిం తా గనునే?
నీపని చెల్లౌను శ్రీల!నిలువవు స్థిర మొకచోన్!నిరసించే చైదం బలమన్?
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
 జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.