గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, జులై 2018, శనివారం

మత్తరజినీ,సమాశ్రీ,వారుణ,సుగంధి,ఏకతీర్పు,జీవచర్య,వెచ్చనౌ,ప్రితి జీవనా, యతిర్నవ సుగంధి,పెర లశాంతి,గర్భ "-నాతిచర్య"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.

జైశ్రీరామ్.

మత్తరజినీ,సమాశ్రీ,వారుణ,సుగంధి,ఏకతీర్పు,జీవచర్య,వెచ్చనౌ,ప్రితి జీవనా,
యతిర్నవ సుగంధి,పెర లశాంతి,గర్భ "-నాతిచర్య"-వృత్తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.
నాతిచర్య వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.జ.భ.స.జ.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
పెచ్చుజాతి యొక్క నుండుచో?భీతి,నీతి పర్వులెత్తు!పెర లశాంతి జీవంబునౌ!
నచ్చినట్లు!తీర్పు నొప్పదే?నాతి చర్య దోషమౌను!నరుల స్వేచ్ఛ!బూదౌనుగా!
పచ్చనైన కాపురాలకుం?వాత మౌను వీరిచర్య?పరువు పోవు లోకంబునన్?
వెచ్చనౌను వీరితీరులుం?ప్రీతిజీవ,ముండునొక్కొ?వెఱపుదక్కు జీవాంతమున్

భావము:-ఒకే జాతి,యెక్కువ శాతము గల్గి,మిగిలిన జాతులు చాల తక్కువ
గల ప్రాంతములలో,నీతి యనేది!భయముతో పరుగు లిడును.ఇతరుల జీవి
తములు శాంతి దూరమగును.నచ్చినట్లు తీర్పులు వెలువడును.అతిగాని,
చర్యలు కూడ దోషమౌను.అల్ప జనానీకము చేయు పను లేవైన?దోషమే,
యగును.వారికిస్వతంత్రముబూదౌను.అనగాస్వతంత్రముండదు.పచ్చని
కుటుంబాలు వారి గాలికి లోనగును.లోకములో!అల్పుల పరువుండదు.
వీరితీరుకు(ధనికులప్రవర్తనకు!)వెచ్చనౌను.ప్రాణకంటక మౌను.అల్పులకు
 (తక్కవ జనము )గలవారికి,అనురాగ పూరితమైన జీవితముండదు.
జీవితాంతము వారికి(అల్ప సంఖ్యాకులకు)విచచారమే దక్కును.

1.గర్భగత"-మత్తరజినీ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.ప్రాసగలదు.
పెచ్చు జాతి యొక్క నుండుచో?
నచ్చి నట్లు తీర్పు నొప్పదే?
పచ్చ నైన కాపురాలకున్?
వెచ్చ నౌను వీరి తీరులున్!

2.గర్భగత"-సమాశ్రీ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.జ.లగ.గణములు.వృ.సం.171.ప్రాసగలదు.
భీతి నీతి పర్వులెత్తు!
నాతి చర్య దోష మౌను!
వాత మౌను వీరి చర్య!
ప్రీతి జీవ ముండు నొక్కొ?

3.గర్భగత"-వారుణ"-వృత్తము.
బృహతీఛందము.న.ర.ర.గణములు.వృ.సం.152.ప్రాసగలదు.
పెర లశాంతి జీవంబు నౌ?
నరుల స్వేచ్ఛ బూదౌను గా?
పరువు పోవు లోకంబు నన్!
వెఱపు దక్కు జీవాంతమున్!

4.గర్భగత"-సుగంధి"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.ర.జ.గల.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
పెచ్చు జాతి యొక్క నుండుచో?భీతి నీతి పర్వు లెత్తు!
నచ్చి నట్లు తీర్పు నొప్పదే?నాతి చర్య !  దోష  మౌను!
పచ్చ నైన కాపు రాలకుం? వాత  మౌను  వీరి  చర్య!
వెచ్చ నౌను వీరి తీరులుం?ప్రీతి జీవ ముండు నొక్కొ?

5.గర్భగత"-ఏక తీర్పు"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.భ.స.య.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
భీతి నీతి పర్వు లెత్తు?పెర లశాంతి జీవంబు నౌ?
నాతి చర్య దోష మౌను!నరుల స్వేచ్ఛ బూదౌను గా?
వాత మౌను వీరి చర్య!పరువు పోవు లోకంబునన్?
ప్రీతి జీవ ముండు నొక్కొ?వెరపు దక్కు జీవాంతమున్!

6.గర్భగత"-జీవచర్య"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.భ.స.య.జ.జ.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
భీతి నీతి,పర్వు లెత్తు!పరు లశాంతి జీవంబునౌ?పెచ్చుజాతియొక్కనుండుచో 
నాతిచర్య దోషమౌను!నరుల స్వేచ్ఛ బూదౌనుగా!నచ్చినట్లు తీర్పు నొప్పదే?
వాత మౌను! వీరిచర్య!పరువు,పోవు!లోకంబు నం?పచ్చ నైన!కాపురాలకున్?
ప్రీతి జీవ ముండు నొక్కొ?వెఱపు దక్కు జీవాంతముం!వెచ్చ నౌను!వీరి తీరులున్!

7.గర్భగత"-వెచ్చనౌ"-వృత్తము.
ధృతిఛందము.న.ర.ర.ర.జ.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
పెర లశాంతి జీవంబునౌ?పెచ్చు జాతి యొక్క నుండుచో?
నరుల స్వేచ్ఛ బూదౌనుగా? నచ్చి నట్లు   తీర్పు నొప్పదే?
పరువు పోవు లోకంబునం?పచ్చ  నైన  కాపు రాలకున్!
వెఱపు దక్కు జీవాంతముం?వెచ్చనౌను వీరి తీరులున్?

8.గర్భగత"-ప్రీతిజీవన"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.ర.ర.జ.ర.ర.జ.గల.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
పెర లశాంతి జీవంబునౌ?పెచ్చుజాతి యొక్కనుండుచో?భీతి నీతి పర్వులెత్తు
నరుల స్వేచ్ఛ బూదౌనుగా!నచ్చినట్లు తీర్పు నొప్పదే!నాతి చర్య దోషమౌను?
పరువు పోవు,లోకంబునం?పచ్చనైన కాపురాలకుం?వాతమౌను వీరిచర్య!
వెరపుదక్కు జీవాంతముం!వెచ్చనౌను వీరితీరులుం,ప్రీతి జీవముండు నొక్కొ?

9.గర్భగత"-యతిర్నవ సుగంధి"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.జ.ర.లగ.గణములు.యతి.9.వయక్షరము.
ప్రాసనీమముగలదు.
భీతి నీతి పర్వులెత్తు,పెచ్చు జాతి యొక్క నుండుచో?
నాతి చర్య దోషమౌను!నచ్చి నట్లు తీర్పు నొప్పదే?
వాత మౌను వీరి చర్య!పచ్చనైన కాపురాలకున్!
ప్రీతి జీవముండు నొక్కొ?వెచ్చనౌను వీరితీరులున్?

10.గర్భగత"-పెర లశాంతి"-వృత్తము
ఉత్కృతిఛందము.ర.జ.ర.జ.ర.జ.స.య.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
భీతి నీతి పర్వులెత్తు!పెచ్చు జాతి యొక్క నున్నచో?పెర లశాంతి జీవంబునౌ!
నాతిచర్య! దోషమౌను!నచ్చినట్లు, తీర్పు నొప్పదే?నరుల! స్వేచ్ఛ బూదౌనుగా!
వాత మౌను వీరిచర్య!పచ్చనైన కాపురాలకుం?పరువు పోవు లోకంబునన్?
ప్రీతిజీవముండు నొక్కొ?వెచ్చనౌను, వీరితీరులుం,వెఱపుదక్కు,జీవాంతమున్ 
జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.