గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

26, జులై 2018, గురువారం

విశ్వజ్యోత్స్న,చిత్రపద,నియమ,లంపట,ఘటనా,ఆర్తిలు,భవజీవనా,నయదూర,భీకర,అనలానిల,గర్భ"-రానేమో"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి, జుత్తాడ.

జైశ్రీరామ్.
విశ్వజ్యోత్స్న,చిత్రపద,నియమ,లంపట,ఘటనా,ఆర్తిలు,భవజీవనా,నయదూర,భీకర,అనలానిల,గర్భ"-రానేమో"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి, జుత్తాడ.

"-రానేమో"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.స.భ.భ.భ.త.న.మ.గగ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
అనలానిల లాంపట్యము!యార్తి ఘటించెను సత్యం!హర!హర!జీవం
                                                                                         బేమౌనో?
పనిగా!చెడు పెర్గెం కడు!వర్తిలె భీకర చైదం!వరదత లేదే!యెంచంగన్!
ఘనమై!ధన మేలెం భువి!కర్తరి దోష మదంటెం!కరటుల ధాతృత్వంబాయెన్!
వనరుల్చెడు భుక్తంబయె!వర్తక మార్గ మయెంన్లే?వరమయ గావన్రా వేగన్!

1.గర్భగత"-విశ్వ జ్యోత్స్న"-వృత్తము.
బృహతీఛందము.స.స.భ.గణములు.వృ.సం.412.ప్రాసగలదు.
అనలానిల లాంపట్యము
పనిగా చెడు పెర్గెం కడు!
ఘనమై!ధన మేలెం భువి!
వనరుల్చెడు భుక్తంబయె!

2.గర్భగత"-చిత్రపద"-వృత్తము.
అనుష్టుప్ఛందము.భ.భ.గగ.గణములు.వృ.సం.55.ప్రాసగలదు.
యార్తి ఘటించెను సత్యం!
వర్తిలె  భీకర   చైదం!
కర్తరి దోష మదంటెం!
వర్తక మార్గ మయెంన్లే?

3.గర్భగత"-నియమ"-వృత్తము.
బృహతీఛందము.న.య.మ.గణములు.వృ.సం.16.ప్రాసగలదు.
హర!హర!జీవంబేమౌనో?
వరదత లేదే యెంచంగన్!
కరటుల ధాతృత్వం బాయెన్!
వరమయ గావన్రా వేగన్!

4.గర్భగత"-లంపట"-వృత్తము.
అత్యష్టీఛందము.స.స.భ.భ.భ.గగ.గణములు.యతి.10,వయక్షరము.
ప్రాసనీమముగలదు.
అనలానిల లాంపట్యము!యార్తి ఘటించెను సత్యం!
పనిగా!చెడు పెర్గెం కడు ! వర్తిలె   భీకర   చైదం!
ఘనమై ధన మేలెం భువి!కర్తరి దోష మదంటెన్!
వనరుల్చెడు భుక్తంబయె!వర్తక మార్గ మయెన్లే?

5.గర్భగత"-ఘటనా"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.భ.త.న.మ.గగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
ఆర్తి ఘటించెను సత్యం!హర!హర! జీవం బేమౌనో?
వర్తిలె భీకర చైదం!వరదత లేదే యెంచంగన్?
కర్తరి దోష మదంటెం!కరటుల ధాతృత్వం బాయెన్?
వర్తక మార్గ మయెన్లే! వరమయ గావన్రా వేగన్!

6.గర్భగత"-ఆర్తిలు"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.భ.త.న.మ.త.జ.య.లల.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
ఆర్తి ఘటించెను సత్యం!హర!హర!జీవంబే మౌనో?అనలానిల లాంపట్యము!
వర్తిలె భీకర చైదం!వరదత లేదే యెంచంగం?పనిగా చెడు పెర్గెం కడు!
కర్తరి దోష మదంటెం!కరటుల ధాతృత్వం బాయెం?ఘనమై ధన మేలెం భువి!
వర్తక మార్గ మయెన్లే!వరమయ గావన్రా వేగం? వనరుల్చెడు భుక్తంబయె! 

7.గర్భగత"-భవిజీవన"-వృత్తము.
ధృతిఛందము.న.య.మ.స.స.భ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాస నీమముగలదు.
హర!హర!జీవంబేమౌనో?అనలా నిల లాంపట్యము!
వరదత లేదే!యెంచంగం?పనిగా! చెడు పెర్గెం కడు!
కరటుల ధాతృత్వంబాయెం?ఘనమై!ధన మేలెం భువి!
వరమయ గావన్రా వేగం?వనరుల్చెడు భుక్తం బయె!

8.గర్భగత"-నయదూర"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.య.మ.స.స.భ.భ.భ.గగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
హర!హర!జీవంబేమౌనో?అన లానిల లాంపట్యం!ఆర్తి ఘటించెను సత్యం!
వరదత లేదే?యెంచంగం?పనిగా చెడు పెర్గెం కడు!వర్తిలె భీకర చైదం!
కరటుల ధాతృత్వంబాయెం?ఘనమై ధన మేలెం భువి!కర్తరి దోష మదంటెన్!
వరమయ గావన్రా వేగం?వనరుల్చెడు భుక్తంబయె!వర్తక మార్గ మాయెన్లే!

9.గర్భగత"-భీకర"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.భ.త.జ.య.ల.ల.గణములు.యతి.9,వయక్షరము.
ప్రాసనీమముగలదు.
ఆర్తి ఘటించెను సత్యం!అన లానిల లాంపట్యం!
వర్తిలె భీకర చైదం!పనిగ చెడు పెర్గెం కడు!
కర్తరి దోషమదంటెం!ఘనమై ధన మేలెం భువి!
వర్తక మార్గ మాయెన్లే?వనరుల్చెడు భుక్తం బయె!

10,గర్భగత"-అన లానిల"-వృత్తము.
ఉతకృతిఛందము.భ.భ.త.జ.య.న.న.మ.గగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
ఆర్తి ఘటించెను సత్యం!అన లానిల లాంపట్యం!హర,హర,జీవంబేమౌనో?
వర్తిలె భీకర చైదం!పనిగ చెడు పెర్గెం కడు!వరదత లేదే!  యెంచంగన్?
కర్తరి దోష మదంటెం!ఘనమై ధన మేలెం భువి!కరటుల ధాతృత్వం బాయెన్
వర్తక మార్గ మాయెన్లే?వనరుల్చెడు భుక్తం బయె!వరమయ గావన్రా వేగన్?
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్..
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.