గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, జులై 2018, గురువారం

సంగీత సాహిత్య సమలంకృతే. మన అక్కయ్య శ్రీమతి మంగిపూడి సుబ్బలక్ష్మి

 జైశ్రీరామ్.
ఆర్యులారా! ఎనుబదేండ్లు పైపదినా మొక్కవోని ఆత్మ విశ్వాసంతో తన ఒంటరి జీవన పోరాటంలో సంగీతామృత భరిత సాహిత్యమనే నావపై ప్రయాణం చేయుచు నిరంతరము చోడవరము పల్లెలో ఉన్న జనావళికి జిజ్ఞాస పుట్టిస్తూ సంగీత సాహిత్యములను సాధన చేయించుచూ ఆధ్యాత్మిక శిఖరాలకు చేర్చుచు అందరి జీవితములందు ఆనందం పండించుతూ అందరికీ అక్కయ్యగా నామాంతరం పొంది వెలుగొందుచున్న శ్రీమతి మంగిపూడి సుబ్బలక్ష్మి అక్కయ్యను గూర్చి ఏ పత్రికవారు ఎంతగా వ్రాసినా తక్కువే. 
ఆంధ్రజ్యోతి దినపత్రిక వారు ఆ మహిళామణిని గూర్చి వివరించుచున్న విషయాన్ని ఇక్కడ మీ ముందుంచుచున్నాను.
అక్కయ్యకు నా భినందన పూర్వక నమస్సులు.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.